Posani Krishna Murali: పోసాని క్వాష్ పిటిషన్లపై విచారణ.. హైకోర్టు కీలక ఆదేశాలు
- పోసాని కృష్ణమురళి క్వాష్ పిటిషన్లపై విచారణ..
- విజయవాడ పోలీసులు నమోదు చేసిన కేసులో పీటీ వారెంట్ అమలు చేశాం..
- హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం..
- ఈ కేసు క్వాష్ చేయాలన్న పోసాని కృష్ణ మురళి పిటిషన్ డిస్మిస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Posani Krishna Murali: సినీ నటుడు పోసాని కృష్ణమురళి క్వాష్ పిటిషన్లపై విచారణ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. విజయవాడ పోలీసులు నమోదు చేసిన కేసులో పీటీ వారెంట్ అమలు చేశామని కోర్టుకు తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం.. దీంతో, ఈ కేసు క్వాష్ చేయాలన్న పోసాని కృష్ణ మురళి పిటిషన్‌ను డిస్మిస్ చేసింది హైకోర్టు.. ఇక, విజయనగరం, గుంటూరు, అల్లూరి సీతా రామరాజు జిల్లా పోలీసులు నమోదు చేసిన కేసుల్లో 34 BNS ప్రకారం నోటీసు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం.. మరోవైపు, విశాఖపట్నంలో నమోదైన కేసు క్వాష్ చేయాలన్న పోసాని కృష్ణమురళి పిటిషన్ పై విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది హైకోర్టు..
Read Also: MOTOROLA Edge 50: అద్భుతమైన ఫీచర్లు, స్టైలిష్ డిజైన్ స్మార్ట్ ఫోన్ పై 11 వేల డిస్కౌంట్.. త్వరపడండి
Also Read
- AAS SGP : సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్..
- Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
- Nadendla Manohar: జనసేన టికెట్లపై క్లారిటీ..! గ్రూపులు లేవు.. పవన్ కల్యాణ్ నిర్ణయమే ఫైనల్..
- Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
కాగా, పోసాని కృష్ణ మురళికి కడప మొబైల్ కోర్ట్ బెయిల్ మంజూరు చేసిన విషయం విదితమే.. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్‌లో పోసానిపై నమోదైన కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేసింది కోర్టు.. పోసానిపై ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్‌లో గత నెల 24వ తేదీన కేసు నమోదు కాగా.. ఈ కేసులో గత నెల 28వ తేదీన ఓబులవారిపల్లె పోలీసులు పోసాని కృష్ణ మురళిని అరెస్టు చేశారు. 29వ తేదీన రైల్వే కోడూరు కోర్టులో హాజరుపర్చగా.. పోసానికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు.. అయితే, కడప మొబైల్ కోర్టు పోసానికి బెయిల్ మంజూరు చేసినా.. మిగతా కేసుల్లో బెయిల్ రాకపోవడంతో.. ఆయన జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.. ఇక, పోసాని బెయిల్ పిటిషన్‌పై ఈ రోజు కర్నూలు జేఎఫ్‌సీఎం కోర్టు విచారణ చేపట్టనుంది.. మరోవైపు, పోసాని కస్టడీ పిటిషన్ పై ఇప్పటికే తీర్పు రిజర్వు చేసింది కోర్టు.. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌ను గతంలో దూషించారనే ఫిర్యాదు మేరకు ఆదోని ట్రీ టౌన్ లో కేసు నమోదు అయిన విషయ విదితమే కాగా.. పోసానిని అరెస్ట్ చేసి విచారించిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టి.. ఆ తర్వాత కర్నూలు జైలుకు తరలించారు.. ఇప్పటికే ఆయన పలు పీఎస్‌లు.. జైలులు చుట్టివచ్చిన విషయం విదితమే..
తాజావార్తలు
-
Varanasi Update: ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్, క్లైమాక్స్.. ‘వారణాసి’పై క్రేజీ అప్డేట్ వైరల్!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
BRICS Trade Boost: బ్రిక్స్ దేశాల్లో భారతీయ వస్తువులకు భారీ డిమాండ్.. 5 నెలల్లో ఎగుమతులు 34% జంప్
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Medak Ddistrict: తూప్రాలో ఎర్ర లేఖ కలకలం.. ‘పోరాటం మరింత తీవ్రం చేస్తాం’ అంటూ హెచ్చరిక!
ట్రెండింగ్
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!