AP High Court: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం.. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) మోడల్లో అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకుంది.. అయితే, దీనిపై పెద్ద దుమారమే రేగింది.. పీపీపీ మోడ్ అంటూనే మెడికల్ కాలేజీలను ప్రైవేట్పరం చేయడంటూ అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహించింది.. ఇక, ఈ వ్యవహారం ఏపీ హైకోర్టు వరకు చేరింది.. పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీల అభివృద్ధిని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిల్…
AP High Court: టానిక్ లిక్కర్ ఎలైట్ స్టోర్ బ్రాండ్ పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.. TONIQUE తమ ఒరిజినల్ బ్రాండ్ గా ఉంటే కాపీ చేసి The TONIC పేరుతో ట్రేడ్ మార్క్ కాపీ చేసి విక్రయాలు చేస్తున్నారని కోర్టులో పిటిషన్ దాఖలైది.. మూడు రాష్ట్రాల్లో టానిక్ బ్రాండ్ తో అమ్మకాలు చేస్తోంది సంస్థ.. అయితే, నెల్లూరులో టానిక్ బ్రాండ్ కు ది టానిక్ పేరుగా కాపీ చేసి లిక్కర్ అమ్మకాలు…
వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ సవీంద్ర రెడ్డి అరెస్ట్ వ్యవహారంపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సవీంద్ర రెడ్డి అరెస్ట్ వ్యవహారంపై విచారణ చేయాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. సీబీఐని సుమోటోగా ఇంప్లేడ్ చేసిన ఏపీ హైకోర్టు విచారణ జరిపి ప్రాథమిక నివేదిక ఇవ్వాలని సీబీఐకి ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణ అక్టోబర్ 13కి వాయిదా వేసింది. తాడేపల్లిలో ఉన్న సవీంద్ర రెడ్డిని అక్రమంగా నిర్బంధించిన లాలాపేట పోలీసులు పత్తిపాడు పోలీస్ స్టేషన్లో…
AP High Court: అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా గుర్తించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేసింది.. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా గుర్తించేలా ఆదేశాలు ఇవ్వాలన్న జగన్ పిటిషన్పై విచారణ వాయిదా వేసింది.. అయితే, కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మంత్రి పయ్యావుల కేశవ్,…
తనను ప్రతిపక్ష నేతగా గుర్తించేందుకు నిరాకరిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 5వ తేదీన స్పీకర్ రూలింగ్ చట్టవిరుద్ధమైందిగా ప్రకటించాలని పిటిషన్ లో హైకోర్టును కోరారు జగన్.. ఈ రూలింగ్ రద్దు చేయాలని పిటిషన్ లో విజ్ఞప్తి చేశారు.. ఈ రూలింగ్ ఏపీ పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్ క్వాలిఫికేషన్ చట్టంలో సెక్షన్ 12బీ కి విరుద్ధమని ప్రకటించాలని హైకోర్టును కోరారు జగన్.
విజయవాడ సమీపంలోని గొల్లపూడిలో గొడుగుపేట వెంకటేశ్వర స్వామి దేవస్థానికి సంబంధించిన దేవాదాయ భూముల్లో విజయవాడ ఉత్సవ్ నిర్వహించడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. దేవాదాయ భూములను వాణిజ్య అవసరాలకు ఉపయోగించవద్దని ఆదేశాలు జారీ చేసింది.. వ్యవసాయ భూములను వ్యవసాయేతర అవసరాలకు ఎలా ఉపయోగిస్తారని ప్రశ్నించింది.. అందులో తోలిన గ్రావెల్, మట్టి, కంకరలను వెంటనే తొలగించాలని ఆదేశాలు ఇచ్చింది.. అంతేకాదు, ఆ భూములను యథాస్థితికి తీసుకు రావాలని ఆదేశించింది..
ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టిస్తోన్న ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.. లిక్కర్ స్కాం కేసులో ముగ్గురు నిందితులకు ఏసీబీ కోర్టు ఇచ్చిన బెయిల్ ఆదేశాలు సవాలు చేస్తూ సిట్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికార దుర్వినియోగం చేశారని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.. దీనిపై విచారణ జరిపింది హైకోర్టు.. ఈ సందర్భంగా.. హైకోర్టులో కీలక వాదనలు వినిపించారు పిటిషనర్ తరఫు న్యాయవాదులు..
ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది.. పదేళ్లుగా ఒక హత్య కేసులో స్టే ఎలా పొడిగిస్తున్నారని ప్రశ్నించింది న్యాయస్థానం.. ఇకపై వాయిదాలు వేయలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది..
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్పై స్టే విధించాలని కోరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు దాఖలు చేసిన పిటిషన్లపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణ పూర్తి అయ్యింది.. పోలింగ్ చట్ట విరుద్ధంగా అప్రజాస్వామ్య పద్ధతిలో జరిగిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్లు.. ఉప ఎన్నికల పోలింగ్ సందర్భంగా అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన చేసి పోలింగ్ ను అధికార పార్టీ నాయకులు చేయించారని కోర్టుకు తెలిపారు..