AP High Court: కొన్ని కేసుల్లో సత్వర న్యాయం దొరికినా.. మరికొన్ని కేసుల్లో మాత్రం.. ఏళ్లు గడిచినా ఫలితం లేకుండా పోతుంది.. అయితే, పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులపై ఓ వివాహిత అదృశ్యంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.. ఓ వివాహిత 13 ఏళ్ల క్రితం అదృశ్యమైతే ఆమె ఆచూకీని పోలీసులు ఇప్పటికీ తెలుసుకోకపోవడంపై విస్మయం వ్యక్తం చేసింది హైకోర్టు.. ఆమె బతికుందో లేదో కూడా తెలియకుంటే..? ఆ తల్లిదండ్రుల వేదన ఎలా ఉంటుందో మీకు తెలుసా? అంటూ పోలీసులను ప్రశ్నించింది హైకోర్టు.. తన కుమార్తె మిస్సింగ్ విషయంలో ఫలానా వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేసిన తండ్రి.. ఫిర్యాదు చేస్తే.. ఆ వ్యక్తులను సకాలంలో విచారించకపోవడంపై సీరియస్ అయ్యింది హైకోర్టు.. అసలు, దర్యాప్తు ఎలా చేయాలో..? ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో కూడా తెలియదా? అంటూ ఫైర్ అయ్యింది.. అయితే, వ్యక్తుల మిస్సింగ్ కేసుల్లో ప్రతీ క్షణం కీలకమని పేర్కొంది హైకోర్టు.. ఘటన జరిగిన మొదట్లోనే ఫిర్యాదు చేస్తే.. ఆ తర్వాత ఎప్పుడో అనుమానితులను ప్రశ్నిస్తే ప్రయోజనం ఏంటి? అని ప్రశ్నించింది.. దర్యాప్తు విషయంలో ఏ మాత్రం మేం సంతృప్తికరంగా లేమంది హైకోర్టు.. ఈ కేసులో పురోగతిపై నివేదికను తమ ముందుంచాలని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ, కొవ్వూరు డీఎస్పీ, తాడేపల్లిగూడెం ఎస్‌ఐలను ఆదేశించింది హైకోర్టు.. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.
Read Also: Mass Festival: ఇదేక్కడి దీపావళి పండగరా బాబు… మరీ ఇలా కూడా చేసుకుంటారా
అయితే, పశ్చిమ గోదారి జిల్లా జీలుగుమిల్లి మండలం కామయ్యపాళెం గ్రామానికి చెందిన బండారు ప్రకాష్‌రావుకు కుమార్తె మంగాదేవి.. ఆమెను దండగర్ర గ్రామానికి చెందిన మోహన బ్రహ్మాజీ అనే వ్యక్తితో మ్యారేజ్ నిర్వహించారు.. అయితే, 2012 అక్టోబర్ 18న తన అల్లుడు బ్రహ్మాజీకి ఫోస్ చేసిన ప్రకాష్‌రావుకు షాకింగ్ విషయం చెప్పాడు అల్లుడు.. మీ కూతురు మంగాదేవి కనిపించడం లేదని చెప్పాడు.. దీంతో, గబరాపడిన ప్రకాశరావు అదే రోజున తాడేపల్లిగూడెం పోలీసులకు ఫిర్యాదు చేశారు.. దీంతో, మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తును మాత్రం మూలనపడేశారు.. ఎన్నిసార్లు పోలీసులను సంప్రదించినా ఉపయోగం లేకపోవడంతో.. 2017లో హైకోర్టును ఆశ్రయించారు ప్రకాష్‌రావు. అప్పటి నుంచి హైకోర్టులో ప్రకాష్‌రావు పిటిషన్‌పై విచారణ జరుగుతూనే ఉంది.. తాజాగా, ఈ పిటిషన్ న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ముందు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా మంగాదేవి అదృశ్యంపై పోలీసులు కేసు నమోదు చేయడం మినహా 2012 నుంచి ఏమీ చేయలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించడం సముచితమంటూ, దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసే ముందు ఈ కేసులో తాజాగా దర్యాప్తు పురోగతిపై నివేదిక ఇవ్వాలని జిల్లా ఎస్పీని గతంలో ఆదేశించారు..
Read Also: BC Bandh: తెలంగాణలో బీసీ బంద్.. రిజర్వేషన్ల సాధన కోసం ఉద్యమం లైవ్ అప్‌డేట్స్..
ఇక, శుక్రవారం ఈ పిటిషన్‌పై మరోసారి విచారణ జరిగింది.. జిల్లా ఎస్పీ తదితరులు స్వయంగా కోర్టు ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి ఈ కేసులో పోలీసులు సాగించిన దర్యాప్తు తీరుపై ఆసహనం వ్యక్తం చేసింది హైకోర్టు.. అనుమానితుల్లో ఉన్న మిస్సింగ్ అయిన మహిళ భర్తను ఫిర్యాదు ఇచ్చిన ఐదేళ్ల తరువాత విచారించడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు న్యాయమూర్తి.. రైల్వేస్టేషన్లలో, ఈసేవా కేంద్రాల్లో వెతికామంటూ కలర్ ఫోటోలు వేస్తే ఏ ప్రయోజనం ఉంటుందని ప్రశ్నించారు. ఈ కేసులో పురోగతితో స్థాయీ నివేదికను తమ ముందుంచాలని పోలీసులను ఆదేశిస్తూ.. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది ఏపీ హైకోర్టు..