TTD Parakamani Case: ఆంధ్రప్రేదశ్‌లో సంచలనం సృష్టించిన టీటీడీ పరకామణి చోరీ కేసులో ఈ రోజు మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. పరకామణి చోరీ కేసుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ కొనసాగుతుండగా.. మరోసారి ఈ కేసును న్యాయవివాదాల పరిధిలో వేగవంతం చేయాలన్న హైకోర్టు నిర్ణయంపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రధాన కార్యాలయం నివేదనం సమర్పించింది. కేసు విచారణలో భాగంగా హైకోర్టు కోరిన AI టెక్నాలజీ అమలు, దాని సాధ్యాసాధ్యాలపై సమగ్ర నివేదికను టీటీడీ అధికారికంగా హైకోర్టుకి అందజేసింది.. ఈ నివేదికలో పరకామణి కోసం టెక్నాలజీలు, సాంకేతిక పరీక్షా విధానాలు, సమాచార విశ్లేషణ పైలట్ నమూనాలపై వివరాలు తెలిపారు. అయితే, పత్రాలపై హైకోర్టు మరింత పర్యవేక్షణ అవసరమని తెలిపింది. దీంతో రేపటి తేదీకి విచారణను వాయిదా వేస్తూ కోర్టు తదుపరి దశలో కేసును పరిశీలించాలని నిర్ణయించింది. మరోవైపు, పరకామణి చోరీ కేసులో మరో FIR నమోదు అంశంపై సుప్రీంకోర్టు తీర్పు పరిశీలించాలని CID, ACBలకు సూచించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు..
Read Also: Allu Arjun : టీ తాగడానికి వెళ్లి చిక్కుల్లో పడ్డ బన్నీ.. భార్య స్నేహ రెడ్డి వీడియో వైరల్