వైఎస్ జగన్ భద్రత వ్యవహారంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది వైసీపీ.. వైఎస్ జగన్ నెల్లూరు జిల్లా పర్యటనలో జడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించేటట్లు ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ హైకోర్టులో వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్ వేసింది.. జగన్ నెల్లూరు పర్యటనలో హెలిపాడ్ అనుమతి పిటిషన్ కూడా దాఖలు కాగా.. దీనిపై విచారణ చేపట్టింది హైకోర్టు.. పిటిషనర్ తరఫున వాదనలు వినిపించారు మాజీ ఏజీ శ్రీరాం.. హెలిప్యాడ్‌కు అనుమతి ఇవ్వడం లేదని కోర్టులో పిటిషన్ వేసిన వెంటనే…
గత వారం సింగయ్య కేసులో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిటిషన్ ను అనుమతించిన వ్యవహారంలో జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగిన వ్యవహారంపై స్పందించిన ఆయన.. ఈ రోజు తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి ఉపయోగించే కల్తీ నెయ్యి కేసులో నిందితులకు బెయిల్ ఇచ్చిన తర్వాత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జస్టిస్ శ్రీనివాస్‌రెడ్డి.. నన్ను గత రెండు రోజులు నుంచి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.. సారీ స్టేట్ ఆఫ్ అఫ్ఫైర్స్…
వైఎస్ జగన్ భద్రత వ్యవహారంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది వైసీపీ.. వైఎస్ జగన్ నెల్లూరు జిల్లా పర్యటనలో జడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించేటట్లు ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ హైకోర్టులో వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్ వేసింది.. ఈ లంచ్ మోషన్ పిటిషన్ ను వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి దాఖలు చేశారు..
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు ఏపీ హైకోర్టులో తాత్కాలికంగా ఊరట లభించింది. సింగయ్య మృతి కేసులో వైఎస్ జగన్‌ను పోలీసులు విచారించకుండా.. న్యాయస్థానం స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. కౌంటర్ దాఖలుకు ఏజీ 2 వారాల గడువు కోరగా.. విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. దాంతో పోలీసులకు, కూటమి ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. Also Read: PVN Madhav: బీజేపీని…
ఆయేషా మీరా హత్య కేసుపై సీబీఐ నివేదిక ఇవ్వాలని ఆయేషా తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టు జరిపింది. బాధితులుగా ఉన్న ఆయేషా తల్లిదండ్రులకు సీబీఐ తుది నివేదిక ఇవ్వాలని ఆయేషా మీరా తల్లిదండ్రుల తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. సీబీఐ కోర్టులో ఉన్న నివేదికను తీసుకోవచ్చు కదా అని న్యాయస్థానం పేర్కొంది. ఇప్పటి వరకు 18 ఏళ్ళుగా కోర్టుల చుట్టూ తిరిగారని మళ్ళీ నివేదిక కోసం కోర్టుకు వెళ్లాల్సిన పరిస్తితి వస్తోందని పిటిషనర్…
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ కు ఊరట లభించింది. గుంటూరు జిల్లా జగన్ పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి మృతి చెందటంతో నమోదైన కేసులో జగన్ క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా.. విచారణ జరిపిన న్యాయస్థానం ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇక, తదుపరి విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.
హైకోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది ఏపీ హైకోర్టు.. ఎయిడెడ్ విద్యాసంస్థలలో నియామకాలపై విద్యాశాఖ కమిషనర్‌ను వ్యక్తిగత హాజరుకు ఆదేశించింది హైకోర్టు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆయేషా మీరా తల్లిదండ్రులు పిటిషన్ దాఖలు చేశారు.. ఆయేషా మీరా హత్యపై సీబీఐ ఏం విచారణ చేసిందో తుది నివేదిక పరిశీలించాలని.. ఆ పిటిషన్లో హైకోర్టుకు విన్నవించారు ఆయేషా తల్లి శంషాద్ బేగం.. అదే విధంగా సీబీఐ విచారణ తుది నివేదికను ఆయేషా మీరా తల్లిదండ్రులకు ఇచ్చేలా సీబీఐని ఆదేశించాలని కూడా పిటిషన్లో పేర్కొన్నారు.
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ క్వాష్ పిటిషన్‌పై నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరగనుంది. పల్నాడు జిల్లా పర్యటన సందర్భంగా వాహనం ఢీకొని చీలి సింగయ్య మృతి చెందిన కేసులో జగన్ రెండో నిందితుడిగా ఉన్నారు. తనపై నల్లపాడు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని బుధవారం క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. గురువారం హైకోర్టు క్వాష్ పిటిషన్‌పై విచారణ చేపట్టనుంది. ఈ కేసులో వైఎస్ జగన్ పిటిషన్‌తో పాటు ఆయన వ్యక్తిగత కార్యదర్శి…
సంచలనం సృష్టించిన ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముగిసింది.. దీంతో, తుది నివేదికను సీల్డ్ కవర్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సమర్పించారు సీబీఐ అధికారులు.. ఇక, ఈ కేసు విచారణ సందర్భంగా.. సీబీఐ కోర్టులోనూ ఆయేషా మీరా కేసుకు సంబంధించిన నివేదిక కాపీని అందించాలని.. సీబీఐ అధికారులను ఆదేశించింది హైకోర్టు.. మరోవైపు, ఈ కేసులో తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేశారు హైకోర్టు న్యాయమూర్తి..