Parakamani Theft Case: పరకామణి చోరీ కేసుకు సంబంధించిన విచారణలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్లో తప్పు ఏముంది? అని ప్రశ్నించిన ధర్మాసనం, అది కేవలం ప్రాథమిక అభిప్రాయం మాత్రమేనని స్పష్టం చేసింది. లోక్ అదాలత్ ఇచ్చిన ఉత్తర్వుల చట్టబద్ధతను తేల్చే అధికారం ఈ ధర్మాసనానికే ఉందని పేర్కొన్న హైకోర్టు, దేవాలయాల ప్రయోజనాలను కాపాడే విషయంలో న్యాయస్థానాలే మొదటి సంరక్షులు అని వ్యాఖ్యానించింది. ఇక, రవి కుమార్ దాఖలు చేసిన అప్పీలుపై విచారణను కోర్టు ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది. పరకామణి చోరీ కేసును లోక్ అదాలత్ వద్ద రాజీ చేసుకోవడం చిన్న విషయం కాదని, అప్పటి ఏవిఎస్ఓ సతీష్ కుమార్‌తో ఈ కేసును రాజీ చేసుకునే అవకాశం లేదని మాత్రమే సింగిల్ బెంచ్ జడ్జి పేర్కొన్నారని ధర్మాసనం గుర్తుచేసింది. సింగిల్ బెంచ్ జడ్జి ఉత్తర్వులను సవాలు చేస్తూ రవి కుమార్ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై నేడు చీఫ్ జస్టిస్ ధర్మాసనం విచారణ నిర్వహించింది.
Read Also: Diamond Crossing: దేశంలోని ఏకైక డైమండ్ క్రాసింగ్.. రైళ్లు నాలుగు వైపులా దుసుకెళ్తాయి..