AP High Court: వైద్య కళాశాలలను పీపీపీ మోడల్ కి ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ దాఖలైంది. వైద్య కళాశాలను పీపీపీకి ఇవ్వటం ద్వారా థర్డ్ పార్టీకి హక్కులు కల్పించకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తెలిపింది. అది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం.. చట్ట విరుద్ధమైతే తప్ప జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం పేర్కొనింది.
Read Also: CM Revanth Reddy : మొంథాపై కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ..
అలాగే, టెండరు ప్రక్రియ ఆగేలా ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. కౌంటర్ దాఖలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సమయం ఇస్తూ విచారణను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వం కౌంటర్ వేసిన తర్వాత అన్ని అంశాలు పరిశీలన చేస్తాం.. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు వెల్లడించింది.