పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక సందర్భంగా పోలింగ్ బూతుల వ్యవహారం తీవ్ర వివాదంగా మారింది.. రాష్ట్ర ఎన్నికల కమిషన్, కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. అయితే, ఈ వ్యవహారం ఇప్పుడు హైకోర్టు వరకు వెళ్లింది.. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా పోలింగ్ బూతుల మార్పును సవాలు చేస్తూ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది వైసీపీ.. ఈ రోజు వైసీపీ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణ…
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత తురకా కిషోర్ అరెస్ట్ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.. తురకా కిషోర్‌ను వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.. నిబంధనలకు విరుద్ధంగా కిషోర్ ను అరెస్టు చేశారని పేర్కొంది.. తురకా కిషోర్ రిమాండ్ రిపోర్టును రిజెక్ట్ చేసింది.
ఆంధ్రప్రదేశ్ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌కు సుప్రీంకోర్టులో బిగ్ షాక్ తగిలింది.. సంజయ్ బెయిల్ రద్దు చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది.. ఏపీ హై కోర్టు ఉత్తర్వులను కొట్టేసింది సుప్రీంకోర్టు.. గత ప్రభుత్వంలో అగ్ని మాపక శాఖలో ఎన్వోసీ ఆన్ లైన్ లో జారీకి సంబంధించి.. కాంటాక్ట్ విషయంలో సంజయ్ పై కేసు నమోదు అయింది..
ఏపీ హైకోర్టులో వైసీపీ నేతలకు రిలీఫ్ లభించింది. మచిలీపట్నం పోలీసులు కొడాలి నాని పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని కొడాలి నానిపై కేసు నమోదైంది. కేసు క్వాష్ చేయాలని కొడాలి నాని పిటిషన్ దాఖలు చేశారు. కేసు విచారణపై న్యాయస్థానం స్టే ఇచ్చింది. గుంటూరు మిర్చి యార్డులో పర్యటనలో ఎమ్మెల్సీ కోడ్ ఉల్లంఘించారని వైసీపీ ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, అప్పిరెడ్డి పై కేసు నమోదు కాగా... హైకోర్టులో క్వాష్ పిటిషన్…
ముందస్తు బెయిల్ ఇచ్చే సందర్భంలో విధించిన షరతుల్లో సడలింపు ఇవ్వాలని ఈ సారి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు వంశీ.. ఇక, వల్లభనేని వంశీ పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టనుంది న్యాయస్థానం..
మాజీ మంత్రి పేర్ని నానికి మరోసారి కోర్టులో ఊరట లభించింది.. ఈ నెల 31వ తేదీ వరకు పేర్ని నానిపై ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులు పొడిగించింది.. కాగా, మాజీ మంత్రి పేర్ని నాని ఇటీవల రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై కేసులు నమోదు అయ్యాయి.. దీంతో, ముందస్తు రక్షణ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు నాని..
తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై తీవ్ర దుమారమే రేగింది.. అయితే, ఈ వ్యవహారంలో వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిపై ఏపీ హైకోర్టు సీరియస్ అయ్యింది..
రాజంపేట లోక్‌సభ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు షాకిచ్చింది.. ఏపీలో సంచలనంగా మారిన మద్యం స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి.. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.. అయితే, మిథున్‌రెడ్డి పిటిషన్‌పై ఇవాళ విచారణ చేపట్టిన హైకోర్టు.. మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది..
AP High Court: ఏపీ హైకోర్టు మెజిస్ట్రేట్ కోర్టులకు ఒక కీలకమైన సర్కులర్ జారీ చేసింది. 7 సంవత్సరాల లోపు శిక్ష పడే నేరాలకు సంబంధించిన కేసుల్లో, ముఖ్యంగా సోషల్ మీడియా పోస్టులపై వివిధ పోలీస్ స్టేషన్లలో అనేక కేసులు నమోదవుతున్నాయి.