Atchannaidu Allegations on AP Government: ఏపీ ప్రభుత్వంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. గత మూడేళ్లలో ఏపీలో ఎన్నో అరాచకాలు జరిగాయని.. దళితులపై దాడులు, ఆడపిల్లలపై అత్యాచారాలు, కల్తీ మద్యం, ప్రతిపక్షాల నాయకులు, కార్యకర్తలపై డాడులు జరిగాయని అచ్చెన్నాయుడు ఆరోపించారు. భూ కబ్జాలు, మైనింగ్ మాఫియా, శ్యాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, మట్టి మాఫియా, కోర్టు ధిక్కారాలు, చెత్త రోడ్లు ఇలా జగన్ పాలన సాగుతోందన్నారు. అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందన్నారు. లక్షల కోట్లలో ప్రభుత్వం విచ్చలవిడిగా చేస్తున్న అప్పులు, అధికార పార్టీ నేతల ఆగడాలు చూసి చూసి, సామాన్య ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయిపోయారని.. ఈసారి ఖచ్చితంగా చంద్రబాబే ఏపీకి సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అచ్చెన్నాయుడు అభిప్రాయపడ్డారు. కేవలం మూడంటే మూడేళ్ళలో సొంత పార్టీ కార్యకర్తలు, అభిమానులకు కూడా జగన్ రెడ్డి నైజం, ఆయన అసమర్థ పాలన గురించి అర్థమైపోయిందన్నారు. బహిరంగంగా తమ అసంతృప్తి వెళ్లగక్కడమే కాదు, ఈసారి తమ పార్టీ గెలిచే పరిస్థితి లేనే లేదని వారే స్వయంగా చెబుతున్నారన్నారని అచ్చెన్నాయుడు ట్వీట్ చేశారు.
విచ్చలవిడిగా చేస్తున్న అప్పులు, అధికార పార్టీ నేతల ఆగడాలు చూసి చూసి, సామాన్య ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయిపోయారు ఈసారి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే ఏపీకి సీఎం కావాలి అని.
కానీ కేవలం మూడంటే మూడేళ్ళలో సొంత పార్టీ కార్యకర్తలు, అభిమానులకు కూడా జగన్ రెడ్డి నైజం, అతని అసమర్థ
(2/3) pic.twitter.com/n4BiaIyK5m— Kinjarapu Atchannaidu (@katchannaidu) August 2, 2022
మరోవైపు బీసీలపై జగన్‌రెడ్డి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం పూలకుంటలో రజకులపై వైసీపీ నేత నరసింహారెడ్డి కక్ష సాధింపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. డబ్బులివ్వకండా బట్టలు ఉతకాలంటూ వేధింపులకు దిగడం అమానుషమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుల అహంకారంతో నరసింహారెడ్డి వ్యవహరిస్తున్నారని.. ఆయన చర్యతో రజక వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నాయని అచ్చెన్నాయుడు విమర్శించారు. తక్షణమే నరసింహారెడ్డిపై చర్యలు తీసుకోవాలని.. రజకులకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.