Chandrababu: అంబేద్కర్ కంటే జగన్ గొప్పవాడా? అన్ని కులాలు నా కులాలే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu: గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు సమక్షంలో పలువురు వైసీపీ నేతలు టీడీపీ కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా తెనాలికి చెందిన వైసీపీ నేత గుదిబండ గోవర్ధన్‌రెడ్డి తన అనుచరులతో పాటు టీడీపీలో చేరారు. దుగ్గిరాల మాజీ ఎమ్మెల్యే వెంకటరెడ్డి సోదరుడి కుమారుడే గోవర్ధన్ రెడ్డి. పదేళ్ల పాటు వైసీపీలో కొనసాగిన ఆయన తాజాగా టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. జగన్ మళ్లీ సీఎం అయితే రాష్ట్రానికి భవిష్యత్ ఉండదన్న భావనలో ప్రజలు ఉన్నారని.. ఓ స్పష్టమైన లక్ష్యంతోనే తాను టీడీపీలో చేరుతున్నానని ప్రకటించారు.
Read Also: Ys Sharmila: ఉప ఎన్నికలతో అభివృద్ధా? …సిగ్గుచేటు
Also Read
అటు టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. గత మూడేళ్లు వైసీపీ ప్రభుత్వం అరాచకాలతో పాలన సాగిస్తోందని.. వైసీపీ పాలన పట్ల ప్రజలు విసుగు, ఆవేదన చెందుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఇందుకు నిదర్శనమే గోవర్ధన్ రెడ్డి ఆ పార్టీని వీడటమే అని చెప్పారు. మనసున్న కార్యకర్తలు వైసీపీలో కొనసాగేందుకు ఇష్టపడటం లేదన్నారు. వైసీపీ నేతలు సెటిల్ మెంట్ రాజకీయాలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని.. దీంతో చాలా మంది తాము సంపాదించుకున్న సొమ్మును వైసీపీ నేతలు ధారాదత్తం చేస్తున్నారని.. ప్రాణం కంటే ఆస్తి ఎక్కువ కాదని ప్రజలు వదులుకుంటున్న పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని చంద్రబాబు విమర్శలు చేశారు. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని.. నిరసనలు చేపడుతుంటే ఇంటి ముందు తాళ్లు కట్టి తమను అడ్డుకుంటున్నారని.. ఈ తాళ్లే వైసీపీ వాళ్లకు ఉరితాళ్లుగా మారతాయని చంద్రబాబు హెచ్చరించారు. జీవితంలో తాను భయపడే ప్రసక్తే లేదన్నారు. వైసీపీ అరాచకాలతో ప్రజలు భయపడుతుంటే తనకు ఎంతో బాధ కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
అంబేద్కర్ కంటే జగన్ గొప్పవాడా అని చంద్రబాబు ప్రశ్నించారు. విదేశీ విద్యా దీవెనకు అంబేద్కర్ పేరు తీసేసి తన పేరు పెట్టుకుంటారా అని మండిపడ్డారు. దేశంలో ఎవరూ జగన్ తరహాలో అంబేద్కర్‌ను అవమానించలేదన్నారు. చేతకాని వాడే కులాల గురించి మాట్లాడతారని తన అభిప్రాయమని.. అన్ని కులాలు తన కులాలే అని స్పష్టం చేశారు. అనంతపురంలో కియా పెడితే బడుగులకే ఎక్కువ లబ్ది చేకూరిందన్నారు. కుప్పంలో 100 కమ్మ కుటుంబాలు కూడా ఉండవని.. తనకు ఓట్లేసి గెలిపించింది బడుగులే అని తెలిపారు. ఏ కులంలో పేదరికం ఉంటే.. ఆ కులానికే తన ప్రాధాన్యత అన్నారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!