Vangalapudi Anitha: ఇటీవల విశాఖ పర్యటనలో సీఎం జగన్ రాష్ట్ర వ్యాప్తంగా ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని.. విశాఖ నుంచే ఈ నిషేధం ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. 2027 నాటికి ఏపీని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మార్చాలన్నదే తమ లక్ష్యమని ప్రకటించారు. అయితే ప్లాస్టిక్ నిషేధంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత స్పందించారు. ఈ ప్లాస్టిక్ బ్యానర్లు, ఫ్లెక్సీలపై నిషేధం కూడా సినిమా టికెట్ రేట్ల వ్యవహారంలానే అవుతుందా అని ఆమె ప్రశ్నించారు.
Read Also: అసలు ట్విన్ టవర్స్ వివాదం ఏంటి?
గతంలో పవన్ కళ్యాణ్ సినిమా విడుదలయ్యే వరకు తగ్గిన సినిమా టిక్కెట్లు.. ఆ తర్వాత పెరిగినట్లు.. ఇప్పుడు ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం కూడా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వరకే వర్తిస్తుందా అని వంగలపూడి అనిత అనుమానం వ్యక్తం చేశారు. పరిస్థితులు చూస్తుంటే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అయిన సెప్టెంబర్ 2 వరకే ప్లాస్టిక్ ఫ్లెక్సీల నిషేధం ఉంటుందేమోనని సందేహం వస్తోందన్నారు. అటు రాష్ట్రంలో ప్లాస్టిక్ కంటే ముందు జగన్‌ను బ్యాన్ చేయాలని, లేదంటే ఏపీనే బ్యాన్ అయ్యే పరిస్థితి వస్తుందని వంగలపూడి అనిత మరో ట్వీట్ ద్వారా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
ఈ ప్లాస్టిక్ బ్యానర్లు, ఫ్లెక్సీల బ్యాన్ కూడా సినిమా టికెట్ రేట్ల వ్యవహారం లానేనా? పవన్ కళ్యాణ్ సినిమా విడుదల వరకూ తగ్గిన టికెట్ రేట్లు ఆ తర్వాత మళ్ళీ పెరిగినట్లు, ప్లాస్టిక్ ఫ్లెక్సీలు, బ్యానర్ల మీద బ్యాన్ కూడా @PawanKalyan గారి పుట్టినరోజు వరకూ ఉండి ఆ తర్వాత మాయమవుతుందా?
— Anitha Vangalapudi (@Anitha_TDP) August 28, 2022