Central Government: ఆర్థిక లోటుతో సతమతం అవుతున్న ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం మంగళవారం నాడు గుడ్ న్యూస్ అందించింది. రెవెన్యూ లోటు భర్తీ కింద రాష్ట్రానికి రూ.879 కోట్లను కేంద్రం విడుదల చేసింది. ఇప్పటికే పలు విడతల కింద ఏపీకి కేంద్రం రెవెన్యూ లోటు నిధులను విడుదల చేసింది. తాజాగా దేశంలోని 14 రాష్ట్రాలకు రెవెన్యూ లోటు నిధులను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం ఏపీకి రూ.879 కోట్ల నిధులను విడుదల చేస్తున్నట్లు ఆర్ధిక శాఖ…
Andhra Pradesh: ఏపీలోని జగన్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ముస్లిం దూదేకులు, మోహతార్ ముస్లింలకు కూడా వైఎస్ఆర్ షాదీ తోఫా పథకం వర్తిస్తుందని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. వైఎస్ఆర్ షాదీ తోఫా పథకానికి ముస్లిం దూదేకులు, మెహతార్ ముస్లింలు అర్హులేనని మైనారిటీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏఎండీ ఇంతియాజ్ వెల్లడించారు. ఈ మేరకు అన్ని జిల్లాల మైనారిటీ, సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమ శాఖల అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా…
Amaravathi: అమరావతి రాజధాని అంశంపై దాఖలైన పిటిషన్లపై మంగళవారం నాడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని నిర్ణయించే అధికారం లేదన్న హైకోర్టు తీర్పును సవాల్ చేసిన ఏపీ ప్రభుత్వం.. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని పిటిషన్లో కోరింది. ఈ పిటిషన్లో కీలక అంశాలను ప్రస్తావించిన ఏపీ ప్రభుత్వం హైకోర్టు తీర్పుపై ఉపశమనం ఇవ్వాలని అభిప్రాయపడింది. అయితే అమరావతి రాజధాని అంశంపై రైతులు, ఏపీ ప్రభుత్వం వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై విచారణకు సుప్రీంకోర్టు ప్రధాన…
Andhra Pradesh: ఏపీలోని జగన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. కల్లు గీత కార్మికులు మరణిస్తే… వారి కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని ఏపీ ప్రభుత్వం రెండింతలు చేసింది. ఈ మేరకు రానున్న ఐదేళ్లకు (2022-27) కల్లు గీత నూతన విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. ప్రస్తుతం కల్లు గీత కార్మికులు మరణిస్తే.. వారి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం అందజేస్తోంది. నూతన కల్లు గీత విధానం ద్వారా ఈ పరిహారాన్ని రూ.5 లక్షల…
Andhra Pradesh: ఏపీలో జగన్ ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఈ మేరకు ప్రజల నుంచి డైరెక్ట్ ఫీడ్ బ్యాక్ కోసం ‘జగనన్నకు చెబుదాం’ పేరుతో కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు జగన్ సర్కారు కసరత్తు చేస్తోంది. తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం విధివిధానాలపై సీఎం జగన్ పార్టీ ముఖ్య నేతలతో సోమవారం నాడు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం…
Pawan Kalyan: ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో వైసీపీ మంత్రులపై దాడి చేశారన్న ఆరోపణలతో 9 మంది జనసేన నేతలను పోలీసులను అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో స్థానిక కోర్టు వారికి బెయిల్ నిరాకరించగా.. ఏపీ హైకోర్టును ఆశ్రయించిన పార్టీ తమ నేతలకు బెయిల్ వచ్చేలా చర్యలు తీసుకుంది. ఈ మేరకు జైలు నుంచి విడుదలైన తమ పార్టీ నేతలను శనివారం మంగళగిరిలోని జనసేన…