Tomota Prices: ఏపీలో టమోటా రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో టమోటాకు కిలో రూపాయి మాత్రమే పలుకుతోంది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. టమాటా దిగుబడి ఎక్కువగా ఉండటం, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి ఎక్కువగా ఉండటంతో టమటా ధర దారుణంగా పడిపోయింది. చిత్తూరు జిల్లా మదనపల్లి మార్కెట్లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. అయితే ఏపీ నుంచి దిగుమతి అవుతున్న టమోటాలను తెలంగాణలో మాత్రం పలు ప్రాంతాల్లో కిలోకు 15 నుంచి…
Andhra Pradesh: ఏపీలోని ప్రభుత్వం ఉద్యోగులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ సచివాలయం, అసెంబ్లీలోని ఉద్యోగులు అంతా కలిసి ఏపీ సచివాలయ సీపీఎస్ అసోసియేషన్‌గా ఉద్యోగులు ఏర్పడ్డారు. ఈ సందర్భంగా ఏపీ సెక్రటేరియట్ సీపీఎస్ అసోసియేషన్ మాట్లాడుతూ… పాత పెన్షన్ విధానం పునరుద్ధరిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి అమలు చేయలేదని ఆరోపించింది. కనీసం సీపీఎస్ విధానాన్ని కూడా ప్రభుత్వం సరిగ్గా అమలు చేయడం లేదని తెలిపింది. ప్రభుత్వ తీరుతో సీపీఎస్ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి, అసహనంతో ఉన్నారని…
Andhra Pradesh: ఏపీలోని రైతులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. రూ.లక్షలోపు పంట రుణం తీసుకొని సకాలంలో చెల్లించిన రైతులకు వైఎస్ఆర్ సున్నావడ్డీ రాయితీని అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రబీ 2020–21, ఖరీఫ్ 2021 సీజన్లకు సంబంధించి అర్హులకు ఈ నెల 29న వడ్డీ రాయితీని రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. మొత్తం 2.54 లక్షల మంది ఖాతాల్లో రూ.45.22 కోట్ల నిధులను అధికారులు జమచేయనున్నారు. రబీ 2020–21 అర్హుల జాబితా సిద్ధంకాగా, వాటిని నేటి నుంచి…
Andhra Pradesh: ఏపీ వ్యాప్తంగా చర్చిల అభివృద్ధికి రూ.175 కోట్ల నిధులను ప్రభుత్వం ఖర్చు చేయనుంది. ఈ నిధులను చర్చిల నిర్మాణం, మరమ్మతులు, ఇతర పనులకు ప్రభుత్వం వినియోగించనుంది. ఈ మేరకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.కోటి మేర అందించనుంది. కొత్త చర్చిల నిర్మాణం, పాత చర్చిల పునర్నిర్మాణం, మరమ్మతులు, చర్చి నిర్వహించే సంస్థలు, స్మశాన వాటికల ఆధునీకరణకు ఈ నిధులు వెచ్చించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కేంద్రాలలో అదనంగా మరో రూ.కోటి విలువైన…
Central Government: ఆర్థిక లోటుతో సతమతం అవుతున్న ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం మంగళవారం నాడు గుడ్ న్యూస్ అందించింది. రెవెన్యూ లోటు భర్తీ కింద రాష్ట్రానికి రూ.879 కోట్లను కేంద్రం విడుదల చేసింది. ఇప్పటికే పలు విడతల కింద ఏపీకి కేంద్రం రెవెన్యూ లోటు నిధులను విడుదల చేసింది. తాజాగా దేశంలోని 14 రాష్ట్రాలకు రెవెన్యూ లోటు నిధులను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం ఏపీకి రూ.879 కోట్ల నిధులను విడుదల చేస్తున్నట్లు ఆర్ధిక శాఖ…
Andhra Pradesh: ఏపీలోని జగన్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ముస్లిం దూదేకులు, మోహతార్ ముస్లింలకు కూడా వైఎస్ఆర్ షాదీ తోఫా పథకం వర్తిస్తుందని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. వైఎస్ఆర్ షాదీ తోఫా పథకానికి ముస్లిం దూదేకులు, మెహతార్ ముస్లింలు అర్హులేనని మైనారిటీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏఎండీ ఇంతియాజ్ వెల్లడించారు. ఈ మేరకు అన్ని జిల్లాల మైనారిటీ, సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమ శాఖల అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా…
Amaravathi: అమరావతి రాజధాని అంశంపై దాఖలైన పిటిషన్లపై మంగళవారం నాడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని నిర్ణయించే అధికారం లేదన్న హైకోర్టు తీర్పును సవాల్ చేసిన ఏపీ ప్రభుత్వం.. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని పిటిషన్లో కోరింది. ఈ పిటిషన్లో కీలక అంశాలను ప్రస్తావించిన ఏపీ ప్రభుత్వం హైకోర్టు తీర్పుపై ఉపశమనం ఇవ్వాలని అభిప్రాయపడింది. అయితే అమరావతి రాజధాని అంశంపై రైతులు, ఏపీ ప్రభుత్వం వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై విచారణకు సుప్రీంకోర్టు ప్రధాన…