Andhra Pradesh: ఏపీలోని రైతులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. రూ.లక్షలోపు పంట రుణం తీసుకొని సకాలంలో చెల్లించిన రైతులకు వైఎస్ఆర్ సున్నావడ్డీ రాయితీని అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రబీ 2020–21, ఖరీఫ్ 2021 సీజన్‌లకు సంబంధించి అర్హులకు ఈ నెల 29న వడ్డీ రాయితీని రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. మొత్తం 2.54 లక్షల మంది ఖాతాల్లో రూ.45.22 కోట్ల నిధులను అధికారులు జమచేయనున్నారు. రబీ 2020–21 అర్హుల జాబితా సిద్ధంకాగా, వాటిని నేటి నుంచి రైతు భరోసా కేంద్రాల్లో ఉంచనున్నారు. మరోవైపు ఖరీఫ్ 2021 జాబితా ప్రక్రియ తుదిదశకు చేరుకుంది.
Read Also: Nagashaurya Marriage: తాళికట్టిన నాగశౌర్య.. ఫోటోలు వైరల్
కాగా అప్పుల ఊబిలో చిక్కుకోకుండా రైతులకు వడ్డీలేని రుణాలు ఇస్తామంటూ ఇచ్చిన హామీ మేరకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పథకానికి జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా తీసుకున్న రుణాలను గడువులోగా తిరిగి చెల్లించిన రైతులకు వడ్డీ రాయితీ అందిస్తోంది. 2014–19 మధ్య గత ప్రభుత్వం ఎగ్గొట్టిన 38.42 లక్షల మంది రైతులకు రూ.688.25 కోట్లు జమచేయడమే కాక ఖరీఫ్ 2019లో 14.28 లక్షల మందికి రూ.289.68 కోట్లు, రబీ 2019–20లో 5.59 లక్షల మందికి రూ.92.38 కోట్లు, ఖరీఫ్ 2020 సీజన్‌లో 6.67లక్షల మందికి రూ.112.70 కోట్లు జమచేసింది.
Read Also: Jeff Bezos: కార్లు, టీవీలు, ఫ్రిజ్‌లు కొనకండి.. ప్రజలకు అమెజాన్ అధినేత సూచన