Andhra Pradesh: ఏపీలోని జగన్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ముస్లిం దూదేకులు, మోహతార్ ముస్లింలకు కూడా వైఎస్ఆర్ షాదీ తోఫా పథకం వర్తిస్తుందని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. వైఎస్ఆర్ షాదీ తోఫా పథకానికి ముస్లిం దూదేకులు, మెహతార్ ముస్లింలు అర్హులేనని మైనారిటీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏఎండీ ఇంతియాజ్ వెల్లడించారు. ఈ మేరకు అన్ని జిల్లాల మైనారిటీ, సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమ శాఖల అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు.
కాగా అక్టోబర్ 1 నుంచి ఏపీ వ్యాప్తంగా పేదింటి మైనారిటీల వివాహం కోసం ఆర్ధికంగా సహాయం చేసేందుకు వైఎస్ఆర్ షాదీ తోఫా కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. గ్రామ లేదా వార్డు సచివాలయాల ద్వారా ఈ పథకానికి దరఖాస్తులను స్వీకరిస్తారు. ఈ పథకం కింద రూ.లక్ష ఆర్ధిక సహాయం అందిస్తారు. మైనారిటీల ఆడపిల్లల తల్లిదండ్రులకు ఈ పథకం ఎంతో భరోసా ఇస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Read Also: Wasim Akram: ఆ క్రికెటర్ మనిషి కాదు.. వేరే గ్రహం నుంచి వచ్చిన ఏలియన్
అటు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 లోగోను ఈరోజు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. వచ్చే ఏడాది మార్చి 3, 4 తేదీల్లో విశాఖ కేంద్రంగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరగనుంది. ఈ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. కోవిడ్ పరిస్థితులను దాటుకుని తాము అడుగులు ముందుకు వేస్తున్నామని.. గత మూడేళ్లలో ఇన్వెస్టుమెంట్ సమ్మిట్‌లు నిర్వహించలేకపోయామని.. ఇప్పుడిప్పుడే ఇతర రాష్ట్రాలు సమ్మిట్లు నిర్వహించడం ప్రారంభించాయన్నారు. ఎంఎస్ఎంఈలపైనా తాము దృష్టి పెట్టామని.. రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి మౌలిక వసతులు కల్పి్స్తున్నామని మంత్రి అమర్నాథ్ తెలిపారు. మచిలీపట్నం, భావనపాడు పోర్టులను నిర్మిస్తున్నామని.. విశాఖ, కాకినాడ పోర్టులను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు.