Good News To Students: విద్యార్థులకు సీఎం జగన్ గుడ్‌న్యూస్.. 21 నుంచి ట్యాబ్‌ల పంపిణీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విద్యార్థులకు మరో శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. విద్యార్థులను డిజిటల్ దిశగా నడిపించడంతోపాటు కరోనా వంటి విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు అభ్యసనాన్ని కొనసాగించేందుకు వీలుగా జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతోన్న విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేయాలని నిర్ణయించిన విషయం విదితమే కాగా.. ఈ నెల 21న ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు.. 21వ తేదీన బాపట్ల జిల్లాలో ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఇప్పటికే బైజూస్‌తో ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న విషయం విదితమే కాగా.. విద్యార్థులకు పంపిణీ చేసే ట్యాబ్‌లలోనే బైజూస్ కంటెంట్ అప్ లోడ్ చేసి ఇవ్వనున్నారు.
Read Also: Minister KTR : మన్సుఖ్ మాండవీయ తెలంగాణ ప్రజలను బాధించారు
Also Read
- Deputy CM Pawan Kalyan: గురువాయూరప్ప సన్నిధిలో ఏపీ డిప్యూటీ సీఎం.. ప్రత్యేక పూజలు చేసిన పవన్..
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
- AP Weather Alert: 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
- Mangapatnam Train Accident: దేశంలోనే తొలి రైలు ప్రమాదం.. 71 మంది మృతి.. కడపలో 124 ఏళ్ల నాటి విషాదం
మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల 18 ట్యాబ్‌లను పంపిణీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది వైఎస్ జగన్ సర్కార్.. ఈ నెల 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు మండల కేంద్రాల్లో విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నారు.. మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేల నేతృత్వంలో ఈ కార్యక్రమం జరగనుంది.. రాష్ట్ర వ్యాప్తంగా 676 మండలాల్లో ట్యాబ్‌ల పంపిణీ కేంద్రాల ద్వారా ఈ పంపిణీ జరగనుంది.. జిల్లాల్లో కలెక్టర్లు, స్థానిక ఎమ్మెల్యేల సహకారంతో తగిన ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లాయి.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఈ కార్యక్రమానికి ఈ నెల 21న సీఎం జగన్ శ్రీకారం చుట్టనుండగా.. మరుసటి రోజు అంటే.. 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు విద్యార్థులకు ట్యాబల్ పంపిణీ జరగనుంది. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు జగన్ సర్కార్ శ్రీకారం చుడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ దిశగా పలుకీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా విద్యా విధానాలు బాగుంటేనే భవిష్యత్ తరాలు బాగుంటాయని సీఎం జగన్ ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. ఈ విషయాన్నే పలు సందర్భాల్లో వెల్లడించారు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.
తాజావార్తలు
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రామ్ప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
TFTDDA Dispute: డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదంలో కీలక మలుపు.. సెప్టెంబర్ 13 సమావేశంపై కోర్టు స్టే!
-
Explainer: సిక్కులపై అమెరికా పగ పట్టిందా?
-
Xi Jinping: భారత్‌లో అడుగు పెట్టిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్.. మోడీతో భేటీపై అందరి చూపు..
-
MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
ట్రెండింగ్
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..