CBN: సైకో పాలన భూస్థాపితం చేసేవరకు.. రాష్ట్రాన్ని బాగు చేసేవరకు ఉంటా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరోసారి ఆంధ్రప్రదేశ్ పోలీసులపై సెటైర్లు వేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఎంపీ రఘురామకృష్ణంరాజు, అయ్యన పాత్రుడు విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుకి వారికి భారత రత్న ఇవ్వాలంటూ ఎద్దేవా చేశారు.. తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని కాపాడుకోవడనికి టీడీపీ కార్యకర్తలు సైన్యంలా పనిచేయాలని పిలుపునిచ్చారు.. కానీ, పదవులకోసం పాకులాడకూడదని హితవుపలికారు.. కార్యకర్తలకు సొంత ఎజెండాలు వద్దు అని హెచ్చరించారు.. ఇక, రాష్ట్రానికి పరిశ్రమలు రావడం లేదు.. దేశవ్యాప్తంగా పేరుతెచ్చుకున్న నారాయణ విద్యా సంస్థల మీద కేసులపై కేసులు పెట్టారని విమర్శించారు.. 2014లో గెలిపించారు.. పోలవరం ప్రాజెక్ట్ నేను నాటిన మొక్క.. నా ప్రాణం పోలవరం.. 28 సార్లు పోలవరం వెళ్లా.. 82 సార్లు సమీక్షలు చేశా.. 72 శాతం పనులు పూర్తి చేశాం.. దేని కోసం.. మన రైతుల కోసం.. దూరదృష్టితో పనిచేశా.. కానీ, ఇప్పుడు నేను పోలవరం వెళ్తే అడ్డుకున్నారని మండిపడ్డారు..
Read Also: LIC launches its WhatsApp Services: గుడ్‌న్యూస్ చెప్పిన ఎల్‌ఐసీ.. ఇక, అన్ని సేవలు వాట్సాప్‌లోనే..!
Also Read
- Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
- Polavaram District: పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం.. పురాతన బావిలో మృతదేహం..
- Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం..
- CM Chandrababu: రాజముద్ర వేసి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం.. మిగిలిన వారికి కూడా ఇస్తాం..
ఇక, తెలంగాణలో ఉన్న 7 ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లోకి తెచ్చిన ఘనత నాదే.. అప్పుడు బీజేపీతో ఉన్న సంబంధాలను ఉపయోగించి ఆ మండలాలను తీసుకొచ్చా.. ఏడు మండలాలను ఏపీకి ఇస్తేనే.. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తానని చెప్పా.. లేకపోతే నాకు పదవి అవసరం లేదని చెప్పానని.. దీంతో, ఆర్డినెన్స్‌తో ఆ పని పూర్తిఅయ్యిందన్నారు.. అది అంతా రాష్ట్ర ప్రజలపై ఉన్న ప్రేమతోనే చేశానని తెలిపారు చంద్రబాబు.. మరోవైపు, ఇదే నాకు చివరి ఎన్నిక అంటున్నారు.. సైకో పాలన భూస్థాపితం చేసేవరకు ఉంటా.. రాష్ట్రాన్ని బాగు చేసేవరకు ఉంటానని వ్యాఖ్యానించారు చంద్రబాబు నాయుడు.. అసలు, సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీయేనన్న ఆయన.. రెండు రూపాయల కిలో బియ్యం, వ్యవసాయ మోటర్లకి మీటర్లు తీసేసిన ఘనత స్వర్గీయ ఎన్టీఆర్‌కే దక్కుతుందన్నారు.. కానీ, ఇప్పుడు అన్న క్యాంటీన్లు మూసేశారు, టిడ్కో ఇళ్ళను ఇవ్వలేకపోయారు.. ఎస్సీ, బీసీ, మైనార్టీలకు ఎన్నో పథకాలు పెట్టాం.. ఈ ప్రభుత్వంలో వాళ్ళకీ ఒక్క రూపాయి అందలేదని ఆరోపించారు.. ఇప్పటి నుంచి ప్రజలు అప్రమత్తంగా వుండకపోతే పోలీసుల చేతుల్లో మనం బలైపోతాం అంటూ కార్యకర్తలను అప్రమత్తం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.
తాజావార్తలు
-
CJP: ‘‘ రాజులు కాదు’’.. ABVP విజయంపై కాక్రోచ్ పార్టీ స్పందన.
-
Kejriwal: ‘ఇదెలా సాధ్యం?’ నోటీసులు ఇచ్చినందుకు ఈసీపై ఆప్ ఫైర్
-
Praful Hinge: SRH పేసర్ ప్రఫుల్ హింగేకు అరుదైన అవకాశం.. భారత్ ‘ఏ’ జట్టులోకి ఎంట్రీ..
-
Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
-
No UPI-Only Cash: నో యూపీఐ ఓన్లీ క్యాష్.. దుకాణాల ముందు ప్రత్యక్షమవుతున్న బోర్డులు..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!