CM YS Jagan: గొప్పమనసు చాటుకున్న ఏపీ సీఎం.. నేను ఉన్నానంటూ భరోసా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆపదలో ఉన్నాం.. ఆదుకొండి అంటూ వస్తే తాను ఉన్నానంటూ భరోసా కల్పిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. సొంత జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. అనారోగ్య సమస్యలతో సతమతం అవుతూ.. ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉండి.. వైద్యం చేయించుకోవడం కష్టమైన వారికి భరోసా ఇచ్చారు.. అనంతపురం జిల్లా, నార్పల మండలం, గూగుడు గ్రామానికి చెందిన జగన్మోహన్ రెడ్డి అనే రైతు బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్నాడు.. ఈ విషయానికి ఆయన భార్య శివజ్యోతి తమ ముగ్గురు పిల్లలు సౌమ్య, హరిప్రియ, యమినితో కలిసి సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని కలసి అర్జీ సమర్పించారు. నవంబర్ 12వ తేదీ నుండి ఆస్టర్ సి.ఎం.ఈ బెంగళూరు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న నా భర్తకు రూ. 20 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారని సీఎం దృష్టికి తీసుకెళ్లిన ఆమె.. మీరే ఆదుకోవాలంటూ బోరున విలపించింది.. ఇక, తాను ఉన్నానంటూ మాట ఇచ్చిన సీఎం.. తక్షణమే రూ.2లక్షలు మీ అకౌంట్ లోకి వేస్తామని, పూర్తి ఖర్చు ప్రభుత్వమే భరించి చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు..
Read Also: ED Raids: ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో కీలక డాక్యుమెంట్లు స్వాధీనం.. నిధులు పక్కదారి..!
Also Read
- UPI Payments: పెట్రోల్ బంకుల్లో యూపీఐ పేమెంట్స్ బంద్..? డీలర్ల అసోసియేషన్ కీలక నిర్ణయం..
- SIPB: విశాఖపట్నంలో ఉపాధి అవకాశాలు.. దిగ్గజ సంస్థల ఏర్పాటుకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్..
- CM Chandrababu: పేదల సొంతింటి కల సాకారం.. 28,445 కుటుంబాలకు సీఎం గుడ్‌న్యూస్
- Vijayasai Reddy: టీడీపీ, వైసీపీకి మూడో ప్రత్యామ్నాయం మేమే.. విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు
మరోవైపు, పులివెందులలో నివసిస్తున్న కె శివకుమార్, టైలరింగ్ చేసుకుంటూ భార్య జి.వరలక్ష్మి, ఇద్దరు పిల్లలు హైందవ్ (8), కుషల్ (5)తో జీవనం సాగిస్తున్నారు.. అయితే, ఆ ఇద్దరు పిల్లలు తీవ్ర మైన అనిమియా వ్యాధితో బాధపడుతున్నారు.. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.. వారికి రక్తం పెరుగుదలకు ఇంజక్షన్ వాడుతున్నామన్నారు. పిల్లల ఆరోగ్యం కోసం చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు తిరుగుతున్నామని.. ఈ వ్యాధి ఆరోగ్య శ్రీ కిందకు రాదన్నారని ప్రస్తుతం హైదరాబాద్ లోని అమెరికన్ అంకాలజిస్ట్ దగ్గర చికిత్స చేయిస్తున్నామని.. ఇప్పటికే రూ.15 లక్షలు ఖర్చు చేశామని.. సర్వం కోల్పోయాం.. మీరే మమ్మల్ని, మా పిల్లల్ని ఆదుకోవాలని సీఎం జగన్‌కు విన్నవించుకున్నారు.. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిల్లల ఆరోగ్యానికి మెరుగైన చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు.
కాగా, నిన్ననే ఓ బాలుడి లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని.. మీరు నిశ్చితంగా ఉండాలంటూ తన దగ్గరకు వచ్చిన తల్లిదండ్రులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భరోసా ఇచ్చిన విషయం విదితమే.. అనంతపురం జిల్లా ధర్మవరం మండలం చిగిచర్లకు చెందిన దివాకరరెడ్డి దంపతుల కుమారుడు యుగంధర్ రెడ్డి మూడున్నర సంవత్సరాల చిరు ప్రాయంలోనే లివర్ దెబ్బతింది . చాలామంది వైద్యుల వద్దకు తిరిగారు. వైద్యుల సూచనలతో బెంగుళూరులోని సెయింట్ జాన్ ఆస్పత్రికి వెళ్లారు. ఏడు నెలలపాటు తిరిగి అన్ని పరీక్షలు చేయించారు. లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాలని , పెద్ద మొత్తంలో ఖర్చవుతుందని వైద్యులు తెలియజేశారు. పేదలైన దివాకర్ రెడ్డి కుటుంబం అంత పెద్ద మొత్తంలో వెచ్చించలేని పరిస్థితి.. దీంతో, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిని కలిశారు. ఆయన శుక్రవారం లింగాల మండలం పార్నపల్లెకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వద్దకు బాధిత కుటుంబాన్ని తీసుకుని వచ్చారు. దివాకర రెడ్డి దంపతులు తమ కుమారుడి అనారోగ్య పరిస్థితులను ముఖ్యమంత్రికి వివరించారు. వెంటనే స్పందించిన సీఎం జగన్.. వైద్యానికి ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుందని, మీరు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ వారికి భరోసా ఇచ్చారు. తక్షణమే బాలుడికి వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయరామరాజును ఆదేశించారు. దీంతో దివాకర్‌రెడ్డి దంపతులు ఆనంద బాష్పాలతో ముఖ్యమంత్రికి చేతులు జోడించి కృతజ్ఞతలు తెలిపారు.
తాజావార్తలు
-
Smart Phone: 6000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్, 90Hz డిస్ప్లే , 12GB ర్యామ్.. మార్కెట్లోకి కొత్త ఫోన్..
-
Hatha Teaser: కిరణ్ అబ్బవరం బ్యానర్లో కొత్త సినిమా.. ఇంట్రెస్టింగ్గా ‘హతః’ టీజర్! చూశారా
-
BCCI కీలక నిర్ణయాలు.. లైంగిక వేధింపులపై కొత్త కమిటీ, IPL 2027పై ఫోకస్
-
Indonesia: వివాహేతర సంబంధం.. మహిళకు 100 కొరడా దెబ్బలు శిక్ష.. దయ చూపండంటున్నా..
-
Supreme Court: పరీక్షా సంస్కరణలపై సుప్రీంకోర్టు విచారణ.. ఎన్టీఏ ఆఫీస్‌ను సందర్శించే అవకాశం
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..