AP New CS Jawahar Reddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కేఎస్ జవహర్ రెడ్డిని నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది… ఈ నెల 30వ తేదీన ప్రస్తుత సీఎస్ సమీర్ శర్మ రిటైర్ కానుండగా.. ఆ వెంటనే జవహర్ రెడ్డి బాధ్యత స్వీకరిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అయితే, వాస్తవానికి ఈ ఏడాది మే నెలలోనే సమీర్ శర్మ పదవీకాలం ముగిసిపోయింది.. కానీ, ప్రభుత్వం ఆయన పదవి కాలనీ పొడిగించింది.. మరోసారి ఆ దిశగా ప్రయత్నాలు చేసినా.. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో.. ఆయన రిటైర్మెంట్ తప్పనిపరిస్థితి ఏర్పడింది.. దీంతో, ఆయన స్థానంలో కేఎస్ జవహర్ రెడ్డి ఛీఫ్ సెక్రటరీగా నియమితులయ్యారు. రేపు ఆయన బాధ్యతలు స్వీకరించబోతున్నారు.. ఇక, గతంలో ఆయన సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా పనిచేసిన జవహర్‌రెడ్డి.. ప్రస్తుతం ఏపీ వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు.. రేపు ఏపీ సీఎస్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నారు.
Read Also: YS Viveka Case: వివేకా హత్య కేసులో న్యాయం జరగాలి.. ఎక్కడ విచారణ జరిగినా అభ్యంతరం లేదు..