Andhra Pradesh: ఏపీలో సలహాదారుల నియామకాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఇలాగే వదిలేస్తే భవిష్యత్లో కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, తహసీల్దార్లకు కూడా సలహాదారులను నియమిస్తారా అంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. సలహాదారుల నియామకానికి అంతు ఎక్కడ ఉందని మండిపడింది. ముఖ్యమంత్రి, మంత్రులకు సలహాదారులను నియమిస్తే అర్ధం చేసుకోగలం కానీ.. ప్రభుత్వ శాఖలకు సలహాదారులను నియమించడం ఏంటని హైకోర్టు నిలదీసింది. సలహాదారుల నియామకం రాజ్యాంగ బద్దమో కాదో తేలుస్తామని స్పష్టం చేసింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను…
Gorantla Buchaiah Chowdary: ఏపీలో వైసీపీ సర్కారు తెచ్చిన జీవోపై టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గోరంట్ల సుబ్బయ్య చౌదరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నూతన సంవత్సర కానుకగా వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కుల్ని హరిస్తూ చీకటి జీవో తెచ్చిందని వ్యంగ్యంగా అన్నారు. బ్రిటీష్ పాలకులు అమలుచేసిన 1861 పోలీస్ యాక్ట్ను ఆధారం చేసుకుని ప్రభుత్వం జీవో నెం.1 తీసుకొచ్చిందని వివరించారు. జగన్ రెడ్డి తీసుకొచ్చింది ముమ్మాటికీ రాజ్యాంగ వ్యతిరేక జీవో అని పేర్కొన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన…
Sajjala Ramakrishna Reddy: రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించడాన్ని నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన జీవోపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.. విపక్షాలను కట్టడి చేయాలన్న ఉద్దేశంతోనే దురుద్దేశంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని ఆరోపిస్తున్నారు.. అయితే, ఆ జీవో వెనుక రాజకీయ ఉద్దేశాలు లేవు.. విపక్షాలే రాజకీయం చేయాలని చూస్తున్నాయని వ్యాఖ్యానించారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. దానిని చీకటి జీవో అనటంలో అర్ధంలేదన్నారు.. జీవోలోని నిబంధనలు ప్రతిపక్ష…
ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది.. రోడ్లపై సభలు, ర్యాలీలను నిషేధించింది.. ప్రజల భద్రత దృష్ట్యా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.. జాతీయ, రాష్ట్ర, పంచాయతీ రాజ్, మున్సిపల్ రోడ్లపై ఈ నిబంధనలు వర్తించనున్నాయి. ప్రత్యామ్నాయ ప్రదేశాలు ఎంపిక చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది వైఎస్ జగన్ ప్రభుత్వం.. రోడ్లకు దూరంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండే ప్రదేశాలు ఎంపిక చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. ఎంపిక చేసిన ప్రదేశాల్లోనే సభలకు షరతులతో కూడిన అనుమతి…
Ramakrishna: ఏపీలో ర్యాలీలు, సభలు, సమావేశాలు, రోడ్ షోలు జరపకూడదని ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడాన్ని తప్పుబట్టారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. ఇది చాలా దుర్మార్గం అన్నారు.. వైఎస్ జగన్ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని విమర్శించిన ఆయన.. కందుకూరు, గుంటూరు ప్రమాద ఘటనలను సాకుగా చూపి వైఎస్ జగన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం నిరంకుశమైనది మండిపడ్డారు.. రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణాలు మానుకుంటారా..? అని ప్రశ్నించారు. ప్రజా ఉద్యమాలను, ప్రశ్నించే గొంతుకలను, ప్రతిపక్షాలను అణచివేసే…
Big Breaking: ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది.. రోడ్లపై సభలు, ర్యాలీలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.. ప్రజల భద్రత దృష్ట్యా ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం.. ఇక, జాతీయ, రాష్ట్ర, పంచాయతీ రాజ్, మున్సిపల్, మార్జిన్లకు నిబంధనలు వర్తింపజేయనున్నారు.. ప్రత్యామ్నాయ ప్రదేశాలు ఎంపిక చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం.. రోడ్లకు దూరంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండే…
Budda Venkanna: మాజీ మంత్రి కొడాలి నానిపై టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడాలి నానికి టిక్కెట్ ఇచ్చి చంద్రబాబు చారిత్రాత్మకమైన తప్పు చేశారని.. చంద్రబాబు యాత్రను తప్పు పట్టే స్ధాయి కొడాలి నానిది కాదన్నారు. రాష్ట్రాన్ని బాగు చేయాలంటే చంద్రబాబు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని.. రాష్ట్రానికి శని ఎవరో డిబేట్కు తాను రెడీ అని.. కొడాలి నాని వస్తే ప్రజల్లో తేల్చుకుంటామన్నారు. గుడివాడలో ఓడిపోతామనే కొడాలి నాని ఫ్రస్ట్రేషన్లో…
Bhuma Akhila Priya: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ.. నంద్యాలలో మీడియాతో మాట్లాడిన ఆమె.. ఏపీలో బతకడం కన్నా పక్క రాష్ట్రాల్లో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని బతకోచ్చు అనే స్థాయికి ప్రభుత్వం తీసుకొచ్చిందని ఆరోపణలు గుప్పించారు.. వైసీపీ నాయకులు ఎన్నో హామీలు ఇచ్చి మభ్యపెట్టి, అధికారంలోకి వచ్చారు.. తీరా, అధికారం వచ్చిన తర్వాత ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని విమర్శించారు. ఉద్యోగాలు ఇస్తామని హామీలు ఇచ్చిన వైఎస్…
Andhra Pradesh: వైసీపీ ప్రభుత్వంపై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ సర్కారుపై ప్రభుత్వ ఉపాధ్యాయులు అసంతృప్తిగా ఉన్నారని ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. పీఆర్సీ, జీతభత్యాల విషయంలో వైసీపీ ప్రభుత్వం పట్ల ఉపాధ్యాయులు కొద్దిగా అవిశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నారని ఆయన చెప్పారు. అయితే ప్రభుత్వంపై అసంతృప్తి ఉన్నా కూడా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని ఎమ్మెల్యే తెలిపారు. వ్యక్తిగత ధర్మం కంటే వృత్తి ధర్మం గొప్పదన్నారు. ఉపాధ్యాయుల సంఖ్య స్వల్పమని.. లక్షల…