Fishing Ban: సముద్రంలో చేపలవేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చింది.. ఆంధ్రప్రదేశ్లోని ప్రాదేశిక సముద్ర జలాల్లో చేపల వేట 61 రోజులపాటు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.. ఈ విషయాన్ని రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్ కె. కన్నబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాదేశిక సముద్ర జలాల్లో యాంత్రిక పడవలు అనగా మెకనైజ్డ్ మరియు మోటారు బోట్ల ద్వారా నిర్వహించే అన్ని రకాల చేపల వేటను ఏప్రిల్ 15వ తేదీ నుండి జూన్…
Covid Ex-Gratia: కోవిడ్ బాధితులకు పరిహారాన్ని అందజేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు.. కోవిడ్ నష్టపరిహారాన్ని బాధిత కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం అందజేయకపోవడం అంశంపై సుప్రీం కోర్టులో ఈ రోజు విచారణ జరిగింది.. అయితే, వీలైనంత త్వరగా మొత్తం బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందజేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది అత్యున్నత న్యాయస్థానం.. ఇదే సమయంలో.. నష్టపరిహారం అందజేయని విషయాన్ని పరిశీలించాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ ఎయిడ్ సర్వీసెస్ అధారిటీని సుప్రీంకోర్టు ఆదేశించింది.. కాగా, కోవిడ్…
AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ముందుకు గురువారం రోజు ఏడు కీలక బిల్లులు రాబోతున్నాయి.. రేపు ఉదయం 9 గంటలకు సమావేశం కానుంది ఏపీ అసెంబ్లీ.. ప్రశ్నోత్తరాలతో బడ్జెట్ సమావేశాలను ప్రారంభించనున్నారు స్పీకర్.. ఇక, డిమాండ్స్ కి గ్రాంట్స్ పై ఓటింగ్ జరగనుంది.. సభలో ఏడు బిల్లులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం.. ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల బిల్లు, ఏపీ ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ సవరణ బిల్లు, ఏపీ ఎస్సీ కమిషన్ సవరణ…
R 5 zone: రాజధానిలో ఆర్-5 జోన్ విషయంలో ముందడుగు వేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఆర్-5 జోన్ ఏర్పాటు చేస్తూ గెజిట్ జారీ చేసింది సర్కార్.. 900 ఎకరాల భూముల్ని ఆర్-5 జోన్ పరిధిలోకి తెచ్చారు.. అమరావతిలో స్థానికేతరులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేసన్ విడుదల చేసింది. విజయవాడ, గుంటూరు నగరాలకు చెందిన పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ప్రత్యేక జోన్ ఏర్పాటు చేసింది. ఆ ఎంపిక చేసిన భూముల ప్రాంతాన్ని ఆర్-5…
Budget 2023-24: బడ్జెట్లో సంక్షేమం, విద్యా, వైద్యానికి పెద్ద పీట వేసింది వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం.. మొత్తం బడ్జెట్ లో ఆర్ధిక సేవలకు వ్యయం 69, 306 కోట్లుగా ఉంది.. బడ్జెట్ కేటాయింపుల్లో సంక్షేమ రంగానికి ప్రభుత్వం పెద్ద పీట వేసింది.. 51,345 కోట్ల రూపాయలు సంక్షేమానికి కేటాయించారు.. మొత్తం కేటాయింపుల్లో ఇది 27 శాతం.. సాధారణ విద్యకు రెండో ప్రాధాన్యత కేటాయింపులు లభించాయి.. మాధ్యమిక, ఉన్నత విద్యకు 32,198 కోట్లు కేటాయించారు. మొత్తం కేటాయింపుల్లో ఇది…
Server Down: ఇప్పుడంతా డిజిటల్ మయం.. కొద్దిసేపు డిజిటల్ సేవలను నిలిచిపోయినా పని నడవని పరిస్థితి.. అయితే, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు డిజిటల్ సేవలకు బ్రేక్ పడింది.. ఏపీలో స్టేట్ డేటా సెంటర్ సర్వర్ డౌన్ అయ్యింది.. ఎస్డీసీ సర్వర్ డౌన్ వడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఐటీ సేవలు నిలిచిపోయాయి.. దీంతో.. ఉద్యోగుల అటెండెన్స్ యాప్, ఇతర వెబ్ సర్వీసులకు కూడా బ్రేక్ పడింది.. డేటా సెంటర్లో అంతరాయం ఏర్పడడం వల్ల డిజిటల్ సేవలకు అంతరాయం ఏర్పడింది.. ఓవైపు…
AP JAC Amaravati: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధులతో చర్చలు ముగిసిన తర్వాత.. చల్లబడినట్టే కనిపించిన ఉద్యోగ సంఘాలు మళ్లీ ఉద్యమానికి సిద్ధం అవుతున్నాయి.. ఏపీ జేఏసీ అమరావతి అత్యవసర కార్యవర్గ సమావేశం ముగిసింది.. ఉద్యమ కార్యాచరణ కొనసాగింపుపై చర్చించి ఓ నిర్ణయానికి వచ్చారు.. మొత్తంగా ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది ఏపీ జేఏసీ అమరావతి. ఉద్యమాన్ని కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది.. మినిట్స్ కాపీలు ఇచ్చిన తర్వాత కూడా ఉద్యమం కొనసాగించాలని అభిప్రాయపడింది అత్యవసర కార్యవర్గం. ఆ తర్వాత ఉద్యమ…
Employees: పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాస్. 16 వేల కోట్ల పెండింగ్ బిల్లులు ఉంటే.. అందులో 3 వేల కోట్ల బిల్స్ చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు ముగిశాయి.. అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం.. అందరూ కలిస్తేనే.. ప్రభుత్వ లక్ష్యాలను సాధించడం సాధ్యం అనే స్పృహతోనే ఉన్నాం అన్నారు.. కోవిడ్…