ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా జగనన్నే భవిష్యత్తు అంటున్నారు. 175 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం సాగుతోంది. వైఎస్సార్సీపీ మెగా ఉద్యమానికి అనూహ్య స్పందన లభిస్తోంది. క్షేత్రస్థాయిలో ఈ ఉద్యమానికి ఊహించని విధంగా మద్దతు లభిస్తోంది. మూడవరోజు ఈ కార్యక్రమం కొనసాగుతోంది. మొత్తం 28 లక్షల గృహాల్లో ఇది జరుగుతోంది. 20 లక్షల మిస్డ్ కాల్స్ నమోదయ్యాయి. 175 నియోజకవర్గాల్లో 15వేల సచివాలయాల్లో ఈ కార్యక్రమం ముందుకుసాగుతోంది. జగన్ చేపట్టిన సంక్షేమ పథకాలు తమకు అందుతున్నాయని, తాము ఆ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నామని నినదిస్తున్నారు.
46 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన ద్వారా ప్రజలకు చేస్తున్న మేలును వివరించి.. ప్రతిపక్షాలు సాగిస్తున్న దుష్ఫ్రచారాన్ని తిప్పికొట్టడమే లక్ష్యంగా వైయస్ఆర్ సీపీ చేపట్టిన ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని వైసీపీ నేతలు ఆనందపడుతున్నారు.ఏ ఇంటికి వెళ్లినా ఆత్మీయ పలకరింపులు, ప్రభుత్వ పనితీరుపై ఎవరిని కదిపినా హర్షాతిరేకాలు.. మళ్లీ జగనన్నే సీఎం కావాలన్నది తమ ఆకాంక్ష అంటున్నారు. వైయస్ జగన్ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ ఇంటి తలుపు, మొబైల్ ఫోన్‌కు వైఎస్ జగన్ ఫొటోతో కూడిన స్టిక్కర్‌లను ఇష్టంగా అతికించుకున్నారు.82960 82960 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చి మద్దతు తెలిపారు. ఆ వెంటనే ఐవీఆర్‌ఎస్ కాల్ ద్వారా సీఎం వైయస్ జగన్ సందేశం రావడంతో ఆనందపడ్డారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 లక్షల మిస్ట్ కాల్స్ వచ్చాయంటే స్పందన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చంటున్నారు వైసీపీ నేతలు.
Read Also: Minister Niranjan Reddy: జూపల్లి, పొంగులేటిపై మంత్రి నిరంజన్ రెడ్డి మండిపాటు..
గత ప్రభుత్వ హయాంలో కాకుండా.. ఈ ప్రభుత్వం అన్నివర్గాలను ఆదుకుంటోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లోనూ ఇదే సందడి కనిపించింది. తమ బాగోగులు కనుక్కోవడానికి వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, ఇతర ప్రజా ప్రతినిధులు, గృహ సారథులు, కన్వీనర్లు, వలంటీర్లకు ప్రజలు సాదర స్వాగతం పలికారు. దాదాపు నాలుగేళ్లుగా వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం తమ వెంటే ఉందని, తమ బాగోగులు చూసుకుంటోందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి ఇంటికి వెళ్లి బుక్ లెట్, స్టికర్ అందించి సీఎం వైయస్ జగన్ స్టిక్కర్లను ఇళ్ల కు అంటించిన గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు వాలంటీర్లు, వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రజలతో మమేకం అవుతున్నారు. మేనిఫెస్టోలోని హామీలను కూడా జగన్ అమలుచేస్తున్నారని అవ్వాతాత, ముసలీ ముతకా, యువత, అన్నివర్గాలు తమ మద్దతు తెలుపుతున్నాయి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకూ… కడప నుంచి కర్నూలు వరకూ ప్రతి నోట ఒకటే మాట. జగనే మా బాట అంటూ నినదిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు తెలియజేస్తూ, ప్రతి కుటుంబం అనుమతితో మా నమ్మకం నీవే జగనన్న స్టిక్కర్ను అతికించుకుంటూ కొనసాగుతున్న కార్యక్రమం మా నమ్మకం నువ్వే జగనన్న. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవుతున్నారని వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు చెబుతున్నారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు,, ఇన్‌చార్జ్‌లు, సమన్వయకర్తలు, కన్వీనర్లు, గృహ సారథులు, వలంటీర్లు కలసికట్టుగా ఇంటింటికీ వెళ్తున్నారు. జగనన్న ప్రతినిధులుగా వచ్చిన వీరందరినీ.. తమ ఇంటికి బంధువులొచ్చినంత సంబరంగా ప్రజలు చిరునవ్వుతో ఆహ్వానిస్తున్నారు. తమ ఇళ్ల వద్దకు ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తున్నారు. కొన్ని ఊళ్లలో మేళతాళాలతో ఎదురేగి ఘన స్వాగతం పలుకుతూ బ్రహ్మరథం పడుతున్నారు.‘ఎమ్మెల్యే వద్దకు ప్రజలు వెళ్లడం సాధారణంగా జరిగేది. కానీ అందుకు విరుద్దంగా ప్రజల వద్దకే మంత్రులు, ఎమ్మెల్యేలు రావడం అంటే అది కేవలం ఒక్క జగనన్న వల్లే సాధ్యమైంది’ అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నాలుగేళ్లలో చేపట్టిన సంస్కరణలు ఆషామాషీ కాదు. వీటి ఫలితాలు 85–87 శాతం కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తున్నాయి. అందుకే ధైర్యంగా ప్రతి ఇంటికి వెళ్ళగలుగుతున్నామని, స్టిక్కర్లు అతికించగలుగుతున్నామని వైసీపీ నేతలు చెబుతున్నారు. గృహ సారథుల నుంచి వైయస్ జగన్ ఫొటో ఉన్న స్టిక్కర్లను తీసుకుని, ఇంటి తలుపునకు, మొబైల్ ఫోన్‌కు అతికించి.. ‘జగనన్నే మా భవిష్యత్’ అంటూ చాటిచెబుతున్నారు. రాబోయే ఎన్నికల్లో జగన్ ని మంచి మెజారిటీతో గెలిపించుకుంటామని, 14 రోజులపాటు జరిగే ఈ కార్యక్రమం ద్వారా 15,004 సచివాలయాల పరిధిలో 1.60 కోట్ల కుటుంబాలలోని ఐదు కోట్ల మంది ప్రజలను కలుసుకుంటారు.
Read Also: Health Tips: మన ఆరోగ్యం మన చేతుల్లోనే.. ఈ తప్పులు చేయొద్దు!