ఉద్యోగ సంఘాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షాకిచ్చింది.. సాధారణ బదిలీల్లో మినహాయింపు కోరుతూ ఉద్యోగ సంఘాలు జారీ చేసే ఆఫీస్ బేరర్ల లేఖల నిలుపుదలకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.
ఆంధ్రప్రదేశ్లో 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను వైఎస్సార్ బీమా పథకం నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 7వ తేదీ వరకు ఇది కొనసాగనుంది. ఈ పథకం ద్వారా 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న కుటుంబ పెద్ద ప్రమాదవశాత్తూ మరణిస్తే కుటుంబసభ్యులకు ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్ధిక సాయం అందిస్తుంది.
ఏపీలోని రైతులకు జగన్ సర్కార్ గుడ్న్యూస్ చెప్పింది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వైఎస్సార్ రైతు భరోసా పథకం నిధులను ముఖ్యమంత్రి జగన్ విడుదల చేయనున్నారు. అన్నదాతలకు తొలి విడత పెట్టుబడి సాయం అందించనుంది. అలాగే ఇటీవలి అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ పంపిణీ చేయనున్నారు.
రెవెన్యూ డెఫిషీట్ గ్రాంట్ ద్వారా రూ.10వేల 400కోట్లు ఇచ్చి ఏపీ మీద తనకు ఉన్న అభిమానాన్ని మోడీ చాటుకున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. కేంద్రం నిధులు ఇస్తే ఎందుకు అని అడగడం విడ్డూరంగా, విచిత్రంగా ఉందన్నారు.
సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్ లభించింది. అమరావతిలో పేదలకు ఇంటి స్థలాల కేటాయింపు వ్యవహారం కొంత కాలంగా న్యాయపరమైన వివాదంగా మారింది. ఆర్ 5 జోన్ ఏర్పాటు పైన స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
చంద్రబాబుకు భారీ షాక్ తగిలింది. ఉండవల్లి కరకట్టపై ఆయన గెస్ట్హౌస్ను ఏపీ ప్రభుత్వం అటాచ్ చేసింది. క్రిమినల్ లా అమెండ్మెంట్ 1944 చట్టం ప్రకారం అధికారులు చర్యలు తీసుకున్నారు. స్థానిక జడ్జికి సమాచారమచ్చి లింగమనేని గెస్ట్హౌస్ను సర్కారు అటాచ్ చేసింది.
Bosta Satyanarayana: అకాల వర్షాలతో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో పంట నష్టం జరిగింది.. ఆ నష్టాన్ని అంచనా వేసే పనిలో పడిపోయింది ప్రభుత్వం.. మరోవైపు.. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందంటూ విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను పరామర్శిస్తూ.. వారిని ఆదుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు విపక్ష నేతలు.. అయితే, ప్రభుత్వం ప్రతీ రైతుకు న్యాయం చేస్తుందని స్పష్టం చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీ అధినేత చంద్రబాబుపై…
Vishnu Vardhan Reddy: ఆంధ్రప్రదేశ్లో ఉద్యమానికి సిద్ధం అవుతోంది భారతీయ జనతా పార్టీ.. గుంటూరులో జరిగిన బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశం వివరాలను వెల్లడించారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ రాజు.. రాష్ట్ర ప్రభుత్వ దోపిడీని చార్జిషీట్ల రూపంలో ప్రజలకు వివరిస్తాం అన్నారు. మే 5వ తేదీ నుంచి ప్రజా చార్జ్ షీట్ల కార్యక్రమం నిర్వహిస్తాం అని ప్రకటించారు. రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు.. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు వైసీపీ ప్రభుత్వ స్టిక్కర్లు…
APPSC Group 1 and Group 2: ప్రభుత్వ ఉద్యోగాల్లోని ఖాళీల భర్తీపై కసరత్తు ప్రారంభించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల భర్తీకి ప్రణాళికలు రూపొందిస్తున్నారు.. ఏయే శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయోననే సమాచారాన్ని ఏపీ సర్కార్ సేకరిస్తోంది.. ఇప్పటి వరకు గ్రూప్-1 కింద 140 పోస్టులు, గ్రూప్-2 కింద 1082 పోస్టులున్నట్టు గుర్తించారు సంబంధిత అధికారులు.. 12 శాఖల పరిధిలో గ్రూప్-1 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తేల్చింది. హెచ్వోడీలతో…