ఎకో ఇండియా సంస్థతో ప్రభుత్వం ఎంవోయూ చేసుకున్నట్లు వెల్లడించారు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు.. ఎకో ప్రాజెక్ట్ ద్వారా రోగులకు మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. ఈ సంస్ధ పలు వైద్య కార్యక్రమాలపై వైద్య సిబ్బందికి శిక్షణ ఇస్తుందని తెలిపారు.. ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని విజయవంతం చేయడానికి వైద్య సిబ్బందికి శిక్షణ ఇస్తామని, ప్రతీ 6 నెలలకి ఒకసారి శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు చెప్పారు. మీ అందరి ప్రార్థనలు సఫలం కావాలని ఆకాంక్షించారు. ఆ దేవుని చల్లని ఆశీస్సులతో అందరూ బాగుండాలని సీఎం జగన్ తెలిపారు. రాష్టాభివృద్ది కోసం అందరూ ప్రార్థించాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు.
Kiran Kumar Reddy: బీజేపీ తీర్థం పుచ్చుకున్న మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డి.. ఏపీలో రాజకీయ పరిస్థితులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. నేను సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దాడులు చేసిన సంస్కృతి లేదు.. నేను ఏ ఒక్క రాజకీయ పార్టీని ఉద్దేశించి మాట్లాడడం లేదు.. అన్ని ప్రాంతీయ పార్టీలు ఒకేలా ఉన్నాయన్నారు.. బీజేపీలో చేరిన తర్వాత తొలిసారి రాష్ట్రానికి వచ్చిన ఆయన.. విజయవాడలో మీడియాతో మాట్లాడారు.. బీజేపీలో ఎందుకు చేరానో…
CM YS Jagan: మహిళా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త వినిపించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. వారికి ప్రత్యేక సెలవులు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఆంధ్ర ప్రదేశ్ సచివాలయ సంఘం అధ్యక్షుడు కాకర్ల వెంకటరామి రెడ్డి తెలిపారు.. ప్రభుత్వం మహిళల ప్రత్యేక ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా మహిళలకు 5 ప్రత్యేక సాధారణ సెలవులు మంజూరు చేసింది.. అయితే, ఈ సౌకర్యం ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు మాత్రం లేదు.. కానీ, ఇప్పుడు వారికి గుడ్న్యూస్ చెప్పింది…
Fishing Ban: సముద్రంలో చేపలవేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చింది.. ఆంధ్రప్రదేశ్లోని ప్రాదేశిక సముద్ర జలాల్లో చేపల వేట 61 రోజులపాటు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.. ఈ విషయాన్ని రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్ కె. కన్నబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాదేశిక సముద్ర జలాల్లో యాంత్రిక పడవలు అనగా మెకనైజ్డ్ మరియు మోటారు బోట్ల ద్వారా నిర్వహించే అన్ని రకాల చేపల వేటను ఏప్రిల్ 15వ తేదీ నుండి జూన్…
Covid Ex-Gratia: కోవిడ్ బాధితులకు పరిహారాన్ని అందజేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు.. కోవిడ్ నష్టపరిహారాన్ని బాధిత కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం అందజేయకపోవడం అంశంపై సుప్రీం కోర్టులో ఈ రోజు విచారణ జరిగింది.. అయితే, వీలైనంత త్వరగా మొత్తం బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందజేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది అత్యున్నత న్యాయస్థానం.. ఇదే సమయంలో.. నష్టపరిహారం అందజేయని విషయాన్ని పరిశీలించాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ ఎయిడ్ సర్వీసెస్ అధారిటీని సుప్రీంకోర్టు ఆదేశించింది.. కాగా, కోవిడ్…
AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ముందుకు గురువారం రోజు ఏడు కీలక బిల్లులు రాబోతున్నాయి.. రేపు ఉదయం 9 గంటలకు సమావేశం కానుంది ఏపీ అసెంబ్లీ.. ప్రశ్నోత్తరాలతో బడ్జెట్ సమావేశాలను ప్రారంభించనున్నారు స్పీకర్.. ఇక, డిమాండ్స్ కి గ్రాంట్స్ పై ఓటింగ్ జరగనుంది.. సభలో ఏడు బిల్లులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం.. ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల బిల్లు, ఏపీ ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ సవరణ బిల్లు, ఏపీ ఎస్సీ కమిషన్ సవరణ…
R 5 zone: రాజధానిలో ఆర్-5 జోన్ విషయంలో ముందడుగు వేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఆర్-5 జోన్ ఏర్పాటు చేస్తూ గెజిట్ జారీ చేసింది సర్కార్.. 900 ఎకరాల భూముల్ని ఆర్-5 జోన్ పరిధిలోకి తెచ్చారు.. అమరావతిలో స్థానికేతరులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేసన్ విడుదల చేసింది. విజయవాడ, గుంటూరు నగరాలకు చెందిన పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ప్రత్యేక జోన్ ఏర్పాటు చేసింది. ఆ ఎంపిక చేసిన భూముల ప్రాంతాన్ని ఆర్-5…