Anantha VenkatRami Reddy:చంద్రబాబు హయాంలో ఈ పథకాలుండేవా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో అమలు జరుగుతున్న పథకాలపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. జగనన్నే భవిష్యత్ అంటూ ఏపీ వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు జనం మధ్య తిరుగుతున్నారు. సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన పట్ల ప్రజల్లో నమ్మకం రెట్టింపు అయ్యిందని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో 98 శాతం అమలు చేశామని, పథకాలు అందుతున్న తీరుపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. అనంతపురంలోని 23వ డివిజన్ పరిధిలో కార్పొరేటర్ హరిత ఆధ్వర్యంలో చేపట్టిన ‘జగనన్నే మా భవిష్యత్’ కార్యక్రమానికి ఎమ్మెల్యే అనంత హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ సీఎం చంద్రబాబునాయుడుపై ఆయన మండిపడ్డారు.
Read Also: IPL 2023 : డేవిడ్ వార్నర్ సరికొత్త రికార్డ్.. కోహ్లీ, ధావన్ తర్వాతే..
Also Read
- Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
- JP Nadda: ఏపీ ఆరోగ్య రంగానికి రూ.64,100 కోట్లు.. జేపీ నడ్డా కీలక ప్రకటన
- CM Chandrababu: 2047 నాటికి భారత్, ఏపీ నంబర్ వన్.. ఆరోగ్య, టెక్నాలజీ రంగాల్లో దూసుకెళ్తాం..
- Deputy CM Pawan Kalyan: గురువాయూరప్ప సన్నిధిలో ఏపీ డిప్యూటీ సీఎం.. ప్రత్యేక పూజలు చేసిన పవన్..
వైసీపీ సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు, పార్టీ శ్రేణులతో కలిసి పలు కుటుంబాలను కలిసి ప్రజల మద్దతు కోరారు. జగనన్నే మా భవిష్యత్‌లో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు పాలనకు, జగన్ పరిపాలనకు మధ్య తేడాను వివరిస్తున్నామని తెలిపారు. ఇదే సమయంలో సంక్షేమ పథకాలు అందుతున్న తీరు, ఇంకా ఏమైనా మార్పులు చేసుకోవాల్సి ఉందా? అని అడుగుతున్నామన్నారు. ప్రజల నుంచి మంచి స్పందన ఉందని, భవిష్యత్‌లోనూ ఈ ప్రభుత్వం కొనసాగాలని ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. ఇప్పుడు అమలు అవుతున్న పథకాలన్నీ ఇలాగే కొనసాగాలని అందరూ కోరుతున్నారన్నారు.
ప్రజలే స్వచ్ఛందంగా జగనన్నే మా భవిష్యత్ స్టిక్కర్లను తమ ఇళ్లకు తగిలించుకుంటున్నారని అనంతవెంకట్రామిరెడ్డి తెలిపారు. ఈనెల 20వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని, నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి తమ పార్టీ గృహ సారథులు, కన్వీనర్లు, ప్రజాప్రతినిధులు వెళ్తారని తెలిపారు. ఇక నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ ప్రసంగిస్తున్న తీరుపై ఎమ్మెల్యే అనంత మండిపడ్డారు. అసత్య ఆరోపణలు చేస్తూ లోకేష్ ముందుకు వెళ్తున్నారన్నారు. లోకేష్ తండ్రి చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేశారని, లోకేష్ మంత్రిగా కూడా ఉన్నారని.. ఇప్పుడు అందిస్తున్నట్లు నిజాయితీగా సంక్షేమ పథకాలను టీడీపీ పాలనలో ఎందుకు ఇవ్వలేదో జవాబు చెప్పాలన్నారు.
తాజావార్తలు
-
Dhee 10 Raju Arrested: లైంగిక వేధింపులు.. ఢీ రాజు అరెస్ట్!
-
Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
-
Debt Trap: అప్పు మీద అప్పు! దాచుకునేది తక్కువ..లోన్లు ఎక్కువ…ఇదే భారతీయుల దుస్థితి!
-
Shah Rukh Khan: సౌత్ దర్శకులే కావాలంటున్న షారుఖ్.. నెక్స్ట్ సినిమాలపై భారీ స్కెచ్!
-
Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్‌లైన్.. భారత్‌కు పెరిగిన కష్టాలు!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!