CM YS Jagan: మహిళా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త వినిపించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. వారికి ప్రత్యేక సెలవులు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఆంధ్ర ప్రదేశ్ సచివాలయ సంఘం అధ్యక్షుడు కాకర్ల వెంకటరామి రెడ్డి తెలిపారు.. ప్రభుత్వం మహిళల ప్రత్యేక ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా మహిళలకు 5 ప్రత్యేక సాధారణ సెలవులు మంజూరు చేసింది.. అయితే, ఈ సౌకర్యం ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు మాత్రం లేదు.. కానీ, ఇప్పుడు వారికి గుడ్‌న్యూస్ చెప్పింది సర్కార్.. ఈ సౌకర్యాన్ని ఔట్‌సోర్సింగ్ మహిళా ఉద్యోగులకు కూడా కల్పించాలని ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు విజ్ఞప్తి చేశారు..
Read Also: YS Viveka Murder Case: వివేకాపై సంచలన ఆరోపణలు.. అందుకే హత్య..!
ఇక, ముఖ్యమంత్రి మా విజ్ఞప్తిని మన్నించి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కూడా సంవత్సరానికి 5 ప్రత్యేక సాధారణ సెలవులు మంజూరు చేయడానికి అంగీకరించారని తెలిపారు కాకర్ల వెంకటరామిరెడ్డి.. ప్రభుత్వం జీవో ఎంఎస్ నెంబర్ 39 తేదీ. 11-04-2023 ద్వారా ఔట్‌సోర్సింగ్ మహిళా ఉద్యోగులకు ఐదు ప్రత్యేక సాధారణ సెలవులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.. ఔట్‌సోర్సింగ్ మహిళా ఉద్యోగులకు ఐదు ప్రత్యేక సాధారణ సెలవులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్‌కు.. ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు కాకర్ల వెంకటరామి రెడ్డి.