Somu Veerraju: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ నవరత్నాల కంటే ప్రధాని నరేంద్ర మోడీ సంక్షేమమే ఎక్కువ అన్నారు భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు.. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిధిలుగా గుజరాత్ ఎమ్మెల్యే, ఎస్సీ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి శంభు నాథ్ తొండియా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రా శివ న్నారాయణ, సోము వీర్రాజు హాజరయ్యారు.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు వీర్రాజు..…
AP Government Notice: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి నోటీసులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.. అసలు, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో తెలియజేయాలని నోటీసులు ఇచ్చింది జీఏడీ.. దీనికి కోసం వారం రోజులు గడువు పెట్టింది.. వేతనాలు, ఆర్ధిక ప్రయోజనాలపై గవర్నర్ కు ఫిర్యాదు చేయటం రోసా నిబంధనలకు విరుద్ధమని నోటీసులో పేర్కొంది ఏపీ ప్రభుత్వం.. మీడియా, పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా నోటీసు జారీ చేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది.. వేతనాలు,…
Naga Babu: ఏపీ ప్రభుత్వం తమ బకాయిలు చెల్లించడం లేదని ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసి ఈ అంశంపై ఫిర్యాదు చేశారు. తమ సమస్యలను పరిష్కరానికి గవర్నర్ కల్పించుకొని చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తమకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించేలా గవర్నర్ చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాల నేతలు విన్నవించారు. ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం చెల్లించడంలేదంటూ గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించారు.…
GO Number 1: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ.. జీవో నంబర్ 1 విషయంలో ప్రస్తుత పరిస్థితుల్లో జోక్యం చేసుకోలేమని వ్యాఖ్యానించింది భారత అత్యున్నతన్యాయస్థానం సుప్రీంకోర్టు.. ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లపై సభలు, రోడ్డుషోలు, సమావేశాలను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 1పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.. అయితే, హైకోర్టు తీర్పుపై ప్రస్తుతం జోక్యం చేసుకోలేమని వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు.. ఈ నెల 23వ తేదీన హైకోర్టులో విచారణ ఉంది.. హైకోర్టు సీజే విచారణ జరపాలని ఆదేశించింది సుప్రీంకోర్టు.. కాగా, బహిరంగ…
Ragi and Sorghum: ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డు దారులకు గుడ్‌న్యూస్ చెప్పింది ప్రభుత్వం.. త్వరలో రేషన్‌కార్డులపై రాగులు, జొన్నలు పంపిణీ చేయనున్నట్టు ప్రకటించింది.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.. గతంలో ఎప్పుడూ లేని విధంగా ధాన్యం సేకరిస్తున్నాం.. రైతులకు మద్దతు ధర ప్రకటించి అమలు చేశామన్నారు.. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి 90శాతం చెల్లింపులు చేశాం.. 21 రోజులల్లోపే ధాన్యం సేకరణకు సంబంధించి సొమ్ములు చెల్లిస్తున్నామని వెల్లడించారు.. ఈ ఏడాది 26…
Sajjala: ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రతిపక్షాలపై మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రతిపక్షం టీడీపీ మాయలమరాఠీగా మీడియా మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకుని అబద్దాలను ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. పరిపాలన ఎలా ఉండాలో మూడున్నర ఏళ్లలో సీఎం వైఎస్ జగన్ ఒక మోడల్‌గా నిలిచారని సజ్జల అన్నారు. ఎస్సీలలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని 2019 వరకు అధికారంలో ఉన్న వ్యక్తి అనలేదా అని ప్రశ్నించారు. ఇపుడు అదే వ్యక్తి తన చంద్రన్న కానుక, విదేశీ…
Andhra Pradesh: ఏపీలో వివాదాస్పదంగా మారిన జీవో నంబర్ 1పై హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయడానికి ముందే జగన్ సర్కారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే జీవో నంబర్ 1పై ప్రతిపక్షాలు టీడీపీ, జనసేన తీవ్ర స్థాయిలో విమర్శలు…
Mudragada Padmanabham: సీఎం జగన్‌కు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరోసారి లేఖ రాశారు. ఈ సందర్భంగా కొన్ని అంశాలను ఆయన లేఖలో ప్రస్తావించారు. బలిజ, తెలగ, ఒంటరి, కాపు కులాలకు రిజర్వేషన్లు పోరాటానికి ముగింపు పలికే దిశగా అడుగులు ఉండాలని సూచించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్ని పార్టీల వారు వారిని ఉపయోగించుకున్నారని.. అందరిలా జగన్ ఉండకూడదని ముద్రగడ పద్మనాభం ఆకాంక్షించారు. అసెంబ్లీలో వీరి కోరిక సమంజసం, న్యాయం అని మీరు అన్నారని విన్నానని..…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేష్ కుమార్‌ను రిలీవ్ చేస్తున్నట్టు పేర్కొన్న కేంద్రం.. ఆయన్ను ఏపీకి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 12వ తేదీలోగా సోమేష్ కుమార్ ఏపీలో రిపోర్టు చేయాలని మంగళవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.. తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన కొన్ని గంటల్లోనే ఈ ప్రక్రియ పూర్తి అయిపోయింది.. అయితే, సోమేష్ కుమార్ ఏపీకి వెళ్లే అవకాశం లేదనే వార్తలు…