జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఆరో రోజు వారాహి విజయ యాత్రలో ఆయన పాల్గోనున్నారు. ఫీల్డ్ విజిట్ కోసం భీమిలి(మండలం)ఎర్రమట్టి దిబ్బలను జనసేనాని పరిశీలించనున్నారు. జియో హెరిటేజ్ సైట్ గా అరుదైన గుర్తింపు సాధించిన ఎర్రమట్టి దిబ్బలు.. ఇటీవల రియల్ ఎస్టేట్ వ్యాపారుల కళ్ళు వీటిపై పడ్డాయని జనసేన పార్టీ ఆరోపిస్తుంది. అధికార పార్టీ, ప్రభుత్వంపై జనసేనాని ఆరోపణలు చేస్తున్నాడు. అరుదైన ఎర్రమట్టి దిబ్బల సమీపంలో తవ్వకాలను పవన్ కళ్యాణ్ పరిశీలించనున్నారు.
Read Also: Miheeka Bajaj: మ్యాగజైన్ కవర్ పై రానా భార్య.. హీరోయిన్లు సైతం దిగదుడుపే
అయితే, పవన్ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా ఎర్రమట్టి దిబ్బలు ప్రాంతానికి వెళ్తున్నట్లు జనసేన పార్టీ నేతలు అంటున్నారు. ఎర్రమట్టి దిబ్బలలో సహజసిద్ధ అందాలను ప్రభుత్వం నాశనం చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తుండటంతో జనసేనాని అక్కడకు వెళ్తున్నాడు. రెండున్నర చదరపు కిలో మీటర్ల వైశాల్యంలో వ్యాపించి ఉన్న ఈ అద్భుతమై ఎర్రమట్టి దిబ్బలు.. మన వారసత్వ సహజ సంపదకు నిలయాలు.. భౌగోళిక వారసత్వ సంపదకు పెట్టింది పేరైన ఎర్రమట్టి దిబ్బలకు వైసీపీ ప్రభుత్వం నుంచి ముప్పు ఉందని స్థానికులు ఆరోపించారు.
Read Also: Revolver for women’s safety: మహిళల కోసం సరికొత్త గన్.. ఆసక్తి ఉంటే కొనుక్కోవచ్చు
ఇక, ఎర్రమట్డి దిబ్బలకు ఆనుకుని జరిపిన భూ సేకరణపై ప్రస్తుతం గొడవ జరుగుతుంది. ఎర్రమట్టి దిబ్బల పరిరక్షణ జోన్ కిందకు వచ్చే భాగంలో.. జీడిమామిడి తోటలు, తాటిచెట్ల విధ్వంసంపై విశాఖవాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వీఎమ్ఆర్డీఏ మాస్టర్ ప్లాన్‌లో ఎర్రమట్టి దిబ్బలను ప్రత్యేకంగా గుర్తించాలని జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తున్నారు. దీని పరిరక్షణకు చిత్తశుద్దితో అధికారులు వ్యవహరించాలని.. అన్నింటికన్న ముందు ఎర్రమట్టి దిబ్బలు వ్యాపించి ఉన్న ప్రదేశానికి సరిహద్దులు నిర్ణయించాలని డిమాండ్ చేస్తున్నారు.