ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇవాళ( శుక్రవారం ) ఉదయం 9.20 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి- అమలాపురం మండలం జనుపల్లి బహిరంగ సభలో పాల్గొననున్నారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగించనున్నారు. అనంతరం వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం లబ్దిదారులకు నిధులను విడుదల చేయనున్నారు.
Read Also: Friday Money Tips: శుక్రవారం ఈ పరిహారాలు చేస్తే.. కోటీశ్వరులు అవడం పక్కా!
ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సున్నావడ్డీ పథకం నాలుగో విడత నిధులను విడుదల చేయనున్నారు. 9.48 లక్షల డ్వాక్రా గ్రూపులకు దాదాపు రూ. 1358.78 కోట్లను మహిళల ఖాతాల్లో ఏపీ సీఎం జమ చేయనున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అర్హత గల 9.48 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 1,05, 13, 365 మంది మహిళలకు ఈ లబ్ది పొందుతారు. అనంతరం జనుపల్లి బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించనున్నారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కాగా, వైఎఎస్ఆర్ సున్నావడ్డీ నిధులు ఇవాళ విడుదల చేయడం వరుసగా ఇది నాలుగో ఏడాది కావడం విశేషం.
Read Also: Mancherial: ఇంత దారుణమా.. ఎడ్లు పెరట్లో మేశాయని రైతుపై దాడి
ఈ క్రమంలో బ్యాంకు రుణాలు సకాలంలో చెల్లించిన పొదుపు సంఘాల్లోని పేదింటి అక్కచెల్లెమ్మల మీద వడ్డీ భారం పడకుండా వారి తరపున ఆ భారాన్నీ ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద నేరుగా పొదుపు సంఘాల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. రాష్ట్రంలోని మహిళలు వారి కాళ్ల మీద వారు నిలబడేలా.. వారి జీవనోపాధి మెరుగుపడేలా బహుళజాతి దిగ్గజ కంపెనీలు, బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుని వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ కాపు నేస్తం, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాలతో సుస్థిర ఆర్థికాభివృద్ధికి జగన్ సర్కార్ బాటలు వేసింది.