ప్రభుత్వం వారం వారం సమీక్షల మీద ఉన్న శ్రద్ధ.. ఉద్యోగులకు నిధులు, కనీస సౌకర్యాలు కల్పించడంపై ఉంటే బాగుండేది అని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ ఉద్యోగుల సంఘం అన్నారు. ఎంఆర్ఓ కార్యాలయాలకు సరిపడా సిబ్బంది, నిధులు, కనీస సౌకర్యాలు లేవు.. నూతన జిల్లా, డివిజన్ కార్యాలయాలలో పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉంది అని ఆరోపించారు. అద్దె వాహనాలకు నెలకు 35 వేల రూపాయలకు బదులు పది నుంచి పన్నెండు వేల రూపాయలు మాత్రమే చెల్లింపులపై ప్రభుత్వం కల్పించుకోవాలి అని వారు కోరారు.
Read Also: Leo: లోకేష్ అన్ని సినిమాల్లో ఆ ఎండింగ్ మాములే…
రీ –సర్వే కొరకు లక్షలు ఖర్చు పెట్టాం.. చెల్లింపులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ ఉద్యోగుల సంఘం నేతలు అన్నారు. ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు జిల్లాలకు వస్తే, కనీసం ప్రోటోకాల్ బడ్జెట్ క్రింద ఒక్క రూపాయి లేదు అని వారు ఆరోపిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతున్నా.. నేటికి ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల చెయ్యకపోవడం శోచనీయం అని ఉద్యోగుల సంఘం నేతలు పేర్కొన్నారు. పని భారం, మానసిక ఒత్తిడితో పాటు ఆర్ధిక ఒత్తిడితో రెవిన్యూ ఉద్యోగులు సతమతమవుతున్నారు అని వారు ఆరోపించారు.
Read Also: New Uniform: లక్షద్వీప్ స్కూల్స్ లో కొత్త యూనిఫాం.. నిరసనలకు పిలుపునిచ్చిన కాంగ్రెస్
ఇప్పటికైన ప్రభుత్వం వెంటనే రెవెన్యూ ఉద్యోగులకు కనీస వసతులతో పాటు.. బడ్జెట్ ను విడుదల చేయాలని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ ఉద్యోగుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. లేకపోతే ప్రభుత్వం తీవ్ర పరిణామాలను ఎదుర్కొవాల్సి వస్తుందని ఉద్యోగ సంఘం నేతలు హెచ్చరించారు.