ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. సీఎం జగన్‌తో కీలక భేటీ అనంతరం కేశినాని నాని మీడియా సమావేశంలో మాట్లాడారు. తనను టీడీపీలో తీవ్రంగా అవమానించారని, తన రాజీనామాను ఆమోదించిన అనంతరం వైసీపీలో చేరతానని ఆయన తెలిపారు.
వైసీపీకి మరో నేత గుడ్‌బై చెప్పారు. కర్నూలు ఎంపీ పదవికి, వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి డా.సంజీవ్‌కుమార్ రాజీనామా చేశారు. ఎంపీ టికెట్ లేదని తేలడంతో ఎంపీ సంజీవ్ కుమార్ రాజీనామాకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఎన్నికలపై సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. డబ్బుంటేనే ఎన్నికలలో పోటీ చేయాలి అన్నట్లు వ్యవస్థ మారిపోయిందన్నారు. ప్రస్తుత రాజకీయాలు గౌరవప్రదంగా లేవన్నారు.
విజయవాడ ఎంపీ కేశినేని రాజకీయ భవిష్యత్‌పై స్పష్టత వచ్చింది. కుమార్తె శ్వేతతో పాటు కేశినేని నాని వైసీపీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో విజయవాడ ఎంపీ కేశినేని నాని భేటీ అయ్యారు.
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఒకేసారి మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.
ఎమ్మెల్యేలు, ఎంపీలకు ట్రాన్స్ ఫర్‌లు ఉంటాయని తానెప్పుడూ ఊహించలేదని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ఒక ఊరిలో పనికి రాని చెత్త మరో ఊరిలో వేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కనిగిరి బహిరంగ సభలో టీడీపీ అధినేత ప్రసంగించారు. కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ కాదు...మినీ సూధన్ అంటూ విమర్శించారు.
వైఎస్సార్‌సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సుయాత్ర 40వ రోజుకు చేరుకుంది. ఈ బస్సుయాత్ర డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు నియోజకవర్గంలో సాగింది. యాత్ర అనంతరం మల్కిపురం ప్రధాన సెంటర్‌లో బహిరంగ సభ నిర్వహించారు.
షర్మిల కాంగ్రెస్‌లో చేరికపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. రాజకీయ నాయకులు పార్టీలు మారడానికి అలవాటు పడ్డారని.. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆమె ఇష్టమన్నారు. చంద్రబాబు రా కదలి రా అని సభ పెట్టారని.. ఎవరు కదలి రావాలి? ఎందుకు రావాలని ఆయన ప్రశ్నించారు.
సంక్రాంతి పండుగకు సొంత ప్రాంతాలకు వెళ్లేవారికి ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఈ సంక్రాంతికి ఆర్టీసీ అధికారులు అదనపు ఛార్జీల్లేకుండా ప్రత్యేక బస్సులను సిద్ధం చేశారు. ఈ ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలే ఆర్టీసీ వసూలు చేయనుంది.
విజయవాడ ఎంపీ కేశినేని నాని మరోసారి సొంతపార్టీ, అధినేతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరిలో నా నిర్ణయం ప్రకటిస్తానని ఆయన తెలిపారు. శుక్రవారం విజయవాడలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీలో కొనసాగాలా ? వద్దా ? అనే విషయంపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు.