వైఎస్ షర్మిలకు పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటాయని అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ ఆరోపించారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిక కుట్రతో కూడినదని ఆయన వ్యాఖానించారు. ఒక రాష్ట్రంలో చెల్లని నాణెం ఇంకో రాష్ట్రంలో ఎలా చెల్లుతుందని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బతికించే నాయకులు లేరా అని ప్రశ్నించారు.
చంద్రబాబు సభలో జనం లేక, ఖాళీ కుర్చీలను చూసి పిచ్చిపట్టి మాట్లాడుతున్నారని మంత్రి దాడిశెట్టి రాజా ఎద్దేవా చేశారు. చంద్రబాబు 'రా కదలిరా' బహిరంగ సభ అట్టర్‌ప్లాప్ అయ్యిందన్నారు. ప్రజలు చంద్రబాబు మాటలను నమ్మడం లేదని ఆయన అన్నారు.
ఏపీలో కులగణన ప్రక్రియ షెడ్యూలులో మార్పులు చేర్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జనవరి 19 తేదీ నుంచి 28 తేదీలోగా కులగణన ప్రక్రియ పూర్తి చేయాలని సర్కారు ఆదేశాలు జారీ చేసింది.
ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం అంబటి రాయుడికి పవన్ కళ్యాణ్ వినాయకుడి వెండి ప్రతిమను బహూకరించారు. ఇదిలా ఉండగా.. ఈ సమావేశం వివరాల గురించి అంబటి రాయుడు తన ఎక్స్(ట్విట్టర్) హ్యాండిల్‌లో తెలిపారు.
ముఖ్యమంత్రి పదవి కోసం, పవన్‌కు అధికారము కోసం ఈ పోరాటం కాదని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. తునిలో 'రా కదలిరా' బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. రాష్ట్రంలో రాజకీయం మారిపోయిందని ఆయన అన్నారు. జగన్ పని అయిపోయిందని.. జీవితంలో పోటీ చేసే పరిస్థితి లేదన్నారు.
ఏపీలో మున్సిపల్ కార్మికులు సమ్మె విరమించారు. కార్మిక సంఘాలతో బుధవారం సాయంత్రం మంత్రివర్గ ఉపసంఘం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం కాగానే కార్మిక సంఘాలు సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించాయి.
విజయవాడ ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు కేశినేని నాని ప్రకటించారు. తన రాజీనామాను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు మెయిల్ ద్వారా పంపించారు. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేసిన కేశినేని నాని.. తన రాజీనామాను తక్షణమే ఆమోదించాలని స్పీకర్‌ను కోరారు.
కేశినేని నానిపై ప్రెస్ మీట్ పెట్టమని చంద్రబాబు చెప్పలేదంటూ తన మనవళ్లపై టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న ప్రమాణం చేశారు. కేశినేని నానిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏంట్రా నాని అంటూ తీవ్రంగా మండిపడ్డారు. క్యారెక్టర్ లెస్ కేశినేని నాని ఏదేదో మాట్లాడాడని.. చంద్రబాబు రెండు సార్లు కేశినేని నానిని ఎంపీ చేశారని బుద్దా వెంకన్న చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కసరత్తు జరుగుతోంది. రాష్ట్రంలో మూడు రోజుల పాటు ఈసీ బృందం పర్యటించిన సంగతి తెలిసిందే. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు, రాష్ట్ర ఉన్నతాధికారులతో ఈసీ సమావేశాలు, సమీక్షలు కూడా చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్‌కుమార్ విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు.