Chandrababu: ఎమ్మెల్యేలు, ఎంపీలకు ట్రాన్స్ ఫర్‌లు ఉంటాయని తానెప్పుడూ ఊహించలేదని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ఒక ఊరిలో పనికి రాని చెత్త మరో ఊరిలో వేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రకాశం జిల్లాలో కనిగిరి బహిరంగ సభలో టీడీపీ అధినేత ప్రసంగించారు. కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ కాదు…మినీ సూధన్ అంటూ విమర్శించారు. ఎర్రగొండపాలెం పనికి రాని మంత్రి ఆదిమూలపు సురేష్‌ని కొండపి పంపారని.. మార్కాపురంలో ఎమ్మెల్యే, ఆయన తమ్ముడు చోటా నయీమ్‌లు అంటూ విమర్శలు గుప్పించారు. ఒంగోలులో బాలినేని అడ్రస్ గల్లంతు అయ్యిందన్నారు. వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేలకి టిక్కెట్లు కావాలంటే నన్ను, లోకేష్, పవన్ కళ్యాణ్‌ని తిట్టాలని కండిషన్ పెడుతున్నారన్నారు.
Read Also: Samajika Sadhikara Yatra: రాజోలులో జైత్రయాత్రగా సాగిన సామాజిక సాధికార యాత్ర
జీవితంలో ఎప్పుడూ బాధపడ లేదని.. నా భార్యని అసెంబ్లీలో తిట్టిన రోజు బాధపడ్డానని ఆయన చెప్పారు. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తరువాతే అసెంబ్లీలోకి వస్తానని శపథం చేశానన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ.. “నాపై బాంబు దాడి జరిగినప్పుడు కూడా భయపడలేదు…వెంకటేశ్వర స్వామే నన్ను కాపాడారు. మహిళల కోసం మహాశక్తి పథకం తీసుకువచ్చాం. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం. ప్రతి ఆడ బిడ్డకి 15,000 ఇస్తాం. ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. జగన్ ప్రభుత్వంలో రైతులు దిక్కు తోచని స్థితిలో ఆత్మహత్య చేసుకుంటున్నారు. రైతులకి వ్యవసాయ ఖర్చుల కోసం 25వేలు ఇస్తాం. నిరుద్యోగులకు 3 వేలు ఇస్తాం. సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. జాబ్ క్యాలెండర్ ఇచ్చి తెలుగు యువతని ఆదుకుంటాం. నేను సైకోకి భయపడను. సైకో పోవాలి…. సైకిల్ రావాలి. పులివెందుల నుండి వచ్చి చీమకుర్తి గ్రానైట్ దోచుకుంటున్నారు. కనిగిరి ప్రాంత ప్రజలు పేదరికంలో ఉన్నా….ఇతర ప్రాంతాల వలస వెళ్ళి స్థిరపడుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కనిగిరి రూపురేఖలు మారుస్తా. అభివృద్ధి, సంక్షేమం టీడీపీ నినాదం. దేశంలో మొదటి సారి రెండు రూపాయలకే ఎన్టీఆర్ బియ్యం ఇచ్చారు. ప్రజలకి 10రూపాయలు ఇచ్చి 100 దోచుకుంటున్నారు.” అని ఆయన పేర్కొన్నారు.
Read Also: MP Kesineni Nani: ఇండిపెండెంట్‌గా పోటీ చేసినా గెలుస్తా.. మూడోసారి ఎంపీని నేనే..
జగన్ ప్రభుత్వానికి సంపద సృష్టించడం తెలియదు… ఉద్యోగాలు ఇవ్వడం తెలియదన్నారు. జాతీయ స్థాయిలో జరిగిన సర్వేలో నిరుద్యోగంలో ఏపీ మొదటి స్థానంలో ఉందన్నారు. 2019లో ఒక్క ఛాన్స్ ఇచ్చారని…. ఇప్పుడు మోసపోయామని చెబుతున్నారని చంద్రబాబు తెలిపారు. ఎన్నికల సమయంలో ముద్దులు పెట్టి ఇప్పుడు పిడి గుద్దులు గుద్దుతున్నారన్నారు. రాష్ట్రాన్ని సైకో చేతిలో పెడితే ఐదేళ్ళలో ఐదు కోట్ల మంది బాధితులు అయ్యారన్నారు. టీడీపీ ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇస్తే.. జగన్ గంజాయి ఇస్తున్నాడని విమర్శలు గుప్పించారు. దేశంలో పెట్రోల్, డీజిల్, విద్యుత్ ఛార్జీలు ఏపీలోనే ఎక్కువగా ఉన్నాయన్నారు. జగన్ దోపిడీ వలన విద్యుత్ బిల్లులు పెరిగాయన్నారు.
Read Also: KA Paul: రాజారెడ్డి, వైఎస్సార్ ఆత్మలతో మాట్లాడతా.. కేఏ పాల్ వివాదాస్పద వ్యాఖ్యలు
చంద్రబాబు ప్రసంగిస్తూ.. ” చెత్త నుండి సంపద సృష్టించాలని మేం ప్రయత్నించాం. చెత్త మీద పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి జగన్. రాష్ట్రాన్ని 30 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళాడు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కుంభకోణాలు జరుగుతున్నాయి. టీడీపీ ప్రభుత్వం లో ఇసుక ఉచితంగా ఇస్తే జగన్ ట్రాక్టర్ ఇసుక కి 5000 వేలు వసూలు చేస్తున్నాడు. జగన్ నాసిరకం మద్యం అమ్మి పేదల రక్తం తాగుతున్నాడు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నాణ్యమైన మద్యం నాణ్యమైన ధరకి ఇస్తాం. వెలుగొండ ప్రాజెక్టుకి నేనే శ్రీకారం చుట్టాను… టీడీపీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో వెలుగొండ పూర్తి చేస్తాం. జయహో బీసీ ద్వారా బీసీల రుణం తీర్చుకుంటా. ముస్లింలకు రంజాన్ తోఫా కూడా ఇవ్వలేదు. వైసీపీ ఎమ్మెల్సీ దళిత డ్రైవర్‌ను చంపి డోర్ డెలివరీ చేశారు. వాలంటీర్లకి ఉన్న గౌరవం కూడా సర్పంచ్‌లకి లేదు. టీడీపీ అధికారంలో సర్పంచ్‌లను గ్రామ మొదటి పౌరుడిగా గౌరవిస్తాం” అని ఆయన స్పష్టం చేశారు.