Kesineni Nani: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. సీఎం జగన్‌తో కీలక భేటీ అనంతరం కేశినాని నాని మీడియా సమావేశంలో మాట్లాడారు. తనను టీడీపీలో తీవ్రంగా అవమానించారని, తన రాజీనామాను ఆమోదించిన అనంతరం వైసీపీలో చేరతానని ఆయన తెలిపారు. టీడీపీ కోసం ఎంతో కష్టపడ్డానని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పార్టీ గెలుపు కోసం పని చేశానని, చంద్రబాబు చెబితే కొందరికి నెల వారీ జీతాలు కూడా ఇచ్చానన్నారు. 2014కు ముందు టీడీపీలో చేరతానంటే.. చాలా మంది మా సామాజిక వర్గం వాళ్లే నన్ను మందలించి చేరొద్దన్నారని కేశినేని నాని పేర్కొన్నారు. రాజకీయాల కోసం రూ. 2 వేల కోట్ల ఆస్తులను అమ్ముకున్నానని ఆయన వెల్లడించారు. చంద్రబాబు తీరుతో వ్యాపారాన్ని కూడా ఆపేశానన్నారు.
Read Also: Daggubati Venkateshwara Rao: ఎన్నికల్లో టికెట్లు రాని వారు అదృష్టవంతులు.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు
2019 ఎన్నికల్లో లోకేష్ ఓడిపోయారని.. నేను గెలిచానని కేశినేని నాని వ్యాఖ్యానించారు. చంద్రబాబు చెప్పారనే టాటా ట్రస్టులో పని చేస్తున్న నా కుమార్తె శ్వేతను రాజకీయాల్లోకి తెచ్చానన్నారు. ఎంపీగా ఉన్న కేశినేని నానిని చెప్పుతో కొడతానని.. మరో నేత తనను గొట్టం గాడు అన్నారని.. అయినా కూడా పార్టీ అధినేత స్పందించలేదన్నారు.పార్టీ చెల్లాచెదురైందని.. కార్పొరేషన్ ఎన్నికల్లో నేను లేకుండానే చంద్రబాబు ప్రచారం చేశారన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు తానే ఫండింగ్ చేశానన్నారు. ప్రోటోకాల్‌కు విరుద్దంగా పార్టీ అధ్యక్షుడే తనను ప్రచారానికి రావద్దన్నాడని ఈ సందర్భంగా చెప్పారు. పార్టీలో ఎన్నో అవమానాలు భరించానని కేశినేని నాని తెలిపారు. విజయవాడ ఎంపీ స్థానాన్ని తన కుటుంబ సభ్యుడికి ఇవ్వాలని అనుకున్నారన్నారు. ఏపీలో ఆరు కమ్మ ఎంపీ స్థానాలు ఉన్నాయని.. వాటిల్లో కాదని.. బెజవాడ సీటివ్వడం దేనికి అంటూ ప్రశ్నించారు. తిరువూరులో రౌడీ మూకలతో కొట్టించాలని చూశారన్నారు. చంద్రబాబు మోసగాడని తెలుసు కానీ.. పచ్చి మోసగాడని అనుకోలేదన్నారు. ఇప్పుడు తాను ఫ్రీ బర్డ్ అంటూ నాని చెప్పుకొచ్చారు.
Read Also:Andhrapradesh: మున్సిపల్ కార్మిక సంఘాలను మరోసారి చర్చలకు పిలిచిన ప్రభుత్వం
కేశినేని నాని మాట్లాడుతూ.. “జగన్ పేదల పక్షపాతి.. నిరుపేదల పక్షపాతి. రూ. 2 లక్షల కోట్లు పేదలకు పంచారు. జగన్ నచ్చారు. జగనుతో నేను కలిసి పని చేస్తా. ఎంపీ పదవి రాజీనామా చేస్తా.. దానికి ఆమోదం పొందగానే.. త్వరలో వైసీపీలో చేరతాను. తాజ్ మహల్ షాజహాన్ కట్టాడని.. చంద్రబాబు అమరావతి కట్టాలని అనుకున్నారు. విజయవాడను అభివృద్ధి చేయండి.. అమరావతి వద్దని చెప్పాను. ఎన్టీఆర్ జిల్లాలో 60 శాతం టీడీపీ ఖాళీ కాబోతోంది. బోండా ఉమ భార్యను కార్పోరేషన్ ఛైర్ పర్సన్ అభ్యర్థిగా నిలబెడితే చాలా డేంజర్ అని చంద్రబాబే చెప్పారు. లోకేష్ పాదయాత్ర ఏ హోదాలో చేస్తున్నారు. ఓడిపోయిన లోకేష్‌కు నేనొచ్చి జీ హూజూర్ అనాలా..? లోకేష్ అఫ్ట్రాల్ ఓడిపోయిన వ్యక్తి. ఏం హక్కు ఉందని లోకేష్ పార్టీలో సీనియర్లను శాసిస్తున్నారు. పార్టీ కోసం నాలాగా ఆస్తులు అమ్నుకున్నారా..” అని కేశినేని నాని పేర్కొన్నారు.