Buddha Venkanna Counter: కేశినేని నానిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ బుద్దా వెంకన్న
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Buddha Venkanna Counter: కేశినేని నానిపై ప్రెస్ మీట్ పెట్టమని చంద్రబాబు చెప్పలేదంటూ తన మనవళ్లపై టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న ప్రమాణం చేశారు. కేశినేని నానిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏంట్రా నాని అంటూ తీవ్రంగా మండిపడ్డారు. క్యారెక్టర్ లెస్ కేశినేని నాని ఏదేదో మాట్లాడాడని.. చంద్రబాబు రెండు సార్లు కేశినేని నానిని ఎంపీ చేశారని బుద్దా వెంకన్న చెప్పారు. కేశినేని నానిని తిట్టమని చంద్రబాబు ఆదేశించ లేదని.. వాస్తవానికి నానిపై విమర్శలు చేస్తే చంద్రబాబు మందలించారన్నారు. చంద్రబాబు చెప్పారు కాబట్టే ఇన్నాళ్లూ ఆగానన్నారు. విజయసాయితో కేశినేని నానికి ఎప్పటి నుంచో పరిచయం ఉందని.. కేశినేని నాని వైసీపీ కోవర్టు అంటూ ఆరోపించారు. తాను చంద్రబాబు కాళ్లు మొక్కుతానని కేశినేని నాని అంటున్నారని.. ఇవాళ కేశినేని నాని జగన్ కాళ్లు మొక్కాడంటూ బుద్దా వెంకన్న అన్నారు. కేశినేని నాని సినిమా ఇకపై ఉందన్నారు. తమ్ముడు కేశినేని చిన్ని భార్య జానకీ మీద కేసు పెట్టిన శాడిస్టు కేశినేని నాని అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు.
Read Also: Group 2: ఏపీలో గ్రూప్-2 అభ్యర్థులకు ఊరట.. దరఖాస్తు గడువు పొడిగింపు
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
వచ్చే ఎన్నికల్లో కేశినేని నాని గెలుస్తాడా అంటూ ప్రశ్నించారు. కేశినేని నాని గెలిస్తే.. బుద్దా భవన్ ఇచ్తేస్తా.. ఓడితే కేశినేని భవన్ ఇచ్చేస్తారా అంటూ సవాల్ విసిరారు. దున్నపోతులా ఉన్న కేశినేని నాని వల్లభనేని వంశీ, కొడాలి నాని మీద ఒక్క మాటైనా మాట్లాడావా అంటూ ప్రశ్నించారు. బీసీలు సంపాదిస్తే అక్రమార్జనా..? నువ్వు సంపాదిస్తే సక్రమార్జనా అంటూ ప్రశ్నించారు. 90ల్లోనే దుర్గ గుడి మీద షాపుల కోసం రూ. 1.15 కోట్లు కట్టానన్నారు. చంద్రబాబుకు చెప్పకుండానే శ్వేతను కేశినేని నాని మేయర్ పదవికి నిలబెట్టాడని.. చంద్రబాబు ఆనాడే సస్పెండ్ చేసి ఉండాల్సిందన్నారు. కేశినేని నానికి వచ్చిన ప్రొటోకాల్ ఇచ్చిందే చంద్రబాబు అంటూ ఆయన తెలిపారు. చంద్రబాబు బీ-ఫాం ఇస్తేనే కదా నానికి ప్రొటోకాల్ వచ్చిందన్నారు. పార్టీ శత్రువుల మీద కేశినేని నాని ఎప్పుడూ మాట్లాడరన్నారు. వారం రోజుల క్రితం జగన్ మటాష్ అన్నారని.. ఇప్పుడు అదే జగన్ దేవుడయ్యారా అంటూ ప్రశ్నించారు. నాని పేర్లతోనే మాకు ఇబ్బంది వచ్చిందన్నారు. కొడాలి నాని.. కేశినేని నానిలతోనే మాకు ఇన్నాళ్లూ ఇబ్బందన్నారు. ఇవాళ్టీతో మాకు ఆ ఇబ్బంది పోయింది కానీ, ఇవాళ్టీ నుంచి ఆట మొదలైందన్నారు. కేశినేని నానికి ద ఎండ్ కార్డు పడడం ఖాయమన్నారు. పీఆర్పీలో చేరి చిరంజీవిని విమర్శించారని.. చంద్రబాబును ఇప్పుడు విమర్శిస్తున్నారన్నారు. కేశినేని నాని చిట్టా నా దగ్గర ఉందన్నారు బుద్దా వెంకన్న.
Read Also: Kesineni Nani: జగన్ నిరుపేదల పక్షపాతి.. త్వరలో వైసీపీలో జాయిన్ అవుతా..
బుద్దా వెంకన్న మాట్లాడుతూ.. “60 శాతం టీడీపీ ఖాళీ అవుతుందా..?. ఎవరిది ఖాళీ అవుతుందో చూస్తాం. వినేవాడు ఉంటే ఇందిరా గాంధీ మా మామ్మ అంటాడు. అంతా తానే చేశానని కేశినేని నాని గొప్పలు చెప్పుకుంటున్నారు. చంద్రబాబు మోసగాడైతే.. లోకేషుకు అర్హత లేకుంటే ఇన్నాళ్లూ కేశినేని నాని ఎందుకు చెప్పలేదు..?. కాళ్లు పట్టుకోవడం కేశినేని నానికి అలవాటే.. ఇప్పుడు కాళ్లు మారాయంతే. ఐపీఎస్ మీద గొడవకు కేశినేని నాని వెళ్లి మమ్మల్ని ఇరికించారు. కేశినేని నాని అప్పులు ఎగ్గొట్టాడు.. కబ్జాలు చేశాడు. కేశినేని నాని ఏదో లావుగా ఉన్నానని తనకేదో ఆకారం ఉందని అనుకుంటున్నాడు. కేశినేని నానిది ఆకారం కాదు.. వికారం. కమ్మ సామాజిక వర్గంలో కొడాలి, కేశినేని నానిలు చీడ పురుగులు. నా ఎదుగుదలకు కమ్మ సామాజిక వర్గం వాళ్లు చాలా మంది ఉన్నారు. కాపుల స్థలాన్ని.. కమ్మొళ్ల స్థలాన్ని.. బీసీ అయిన నన్ను.. ఎస్సీ అయిన దేవదత్ మీద కేశినేని నాని దాడులు చేశారు. చంద్రబాబు ఛాంబర్ గెడ పెట్టి మరీ కేశినేని నాని ఆయన కాళ్ల మీద పడ్డారు. చంద్రబాబు తిట్టిన వాళ్లను నేను తిట్టకుండా ఆగను.. చంద్రబాబు ఆగమన్నా ఆగను.” అని ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!