Perni Nani: షర్మిల కాంగ్రెస్‌లో చేరికపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. రాజకీయ నాయకులు పార్టీలు మారడానికి అలవాటు పడ్డారని.. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆమె ఇష్టమన్నారు. చంద్రబాబు రా కదలి రా అని సభ పెట్టారని.. ఎవరు కదలి రావాలి? ఎందుకు రావాలని ఆయన ప్రశ్నించారు. పగవాడికి కూడా చంద్రబాబుకి పట్టిన దుర్గతి పట్టదన్నారు. కనిగిరిలో హైదరాబాద్, బెంగుళూరులో కలిగే అవకాశాలు కల్పిస్తామని అంటున్నారన్నారు. 2014-2019 మధ్య ఎందుకు అవకాశం ఎందుకు కల్పించలేదన్నారు. పవన్, చంద్రబాబుకి పిచ్చి మాటలు చెప్పే అలవాటు ఉందన్నారు. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో నిత్యావసరాల ధరలు తగ్గించారా అంటూ ప్రశ్నలు గుప్పించారు.
Read Also: APSRTC: సంక్రాంతికి సొంత ఊళ్లకు వెళ్లేవారికి ఏపీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్
పవన్, చంద్రబాబు 2014లో ఇంటికో ఉద్యోగం అన్నారని.. ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నలు గుప్పించారు. చంద్రబాబు బీసీలకు ఏం చేశారని.. ఓట్లు వచ్చినప్పుడు జయహో బీసీ అనాలని ఎద్దేవా చేశారు. మైనార్టీల ఓట్లు కావాలి.. కానీ ఐదేళ్లలో మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వలేదన్నారు. చంద్రబాబుకి హరికృష్ణ, ఎన్టీఆర్ వ్యతిరేకం కాదా అంటూ ప్రశ్నించారు. పురంధేశ్వరి వ్యతిరేకం కాదా?.. చంద్రబాబు సొంత తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు కాంగ్రెస్ లో చేరి పని చేశారా లేదా?.. తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు చంద్రబాబు మీద పుస్తకం రాయలేదా? అంటూ ప్రశ్నలు గుప్పించారు. కాపు రామచంద్రారెడ్డి వైసీపీ తరపున రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారని.. కాపు రామచంద్రారెడ్డి వైసీపీ జెండా లేకుండా ఎమ్మెల్యే కాగలరా అంటూ విమర్శించారు. ఎన్ని డబ్బులు ఉన్నా ఎమ్మెల్యే అవుతారా అంటూ ప్రశ్నించారు.
Read Also: Kapu Ramachandra Reddy: ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేస్తా.. వైసీపీకి ఎమ్మెల్యే గుడ్‌బై!
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. పవన్ చెప్తున్న కాపు పెద్దలు ఎవరని.. మేము ఎవరిని రెచ్చగొట్టామని ఆయన ప్రశ్నించారు. 2014లో కాపులకు రిజ్వేషన్ హామీ ఇచ్చారు కనుక చంద్రబాబు, పవన్‌లను ముద్రగడ అడిగారన్నారు. ఇప్పుడు పోటీకి ఎవరూ లేక వాకిలి తెరిచి ఉందని అంటున్నాడన్నారు. చంద్రబాబు ఇచ్చే 20 సీట్లకు పోటీ చేసే వారే పవన్ దగ్గర లేరన్నారు. అవసరాల కోసం వచ్చిన వాళ్ళే బయటకి వెళ్తారని.. పార్టీపై, ప్రజలపై ప్రేమ ఉన్న వారు పార్టీలో ఉంటారన్నారు.