AP Elections 2024: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నిల ప్రణాళికలపై స్పీడ్ పెంచింది భారతీయ జనతా పార్టీ.. 50 అసెంబ్లీ నియోజకవర్గాలలో క్షేత్రస్ధాయి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు బీజేపీ నేతలు.. 251 మండలాలలో రెండేసి స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లకు రంగం సిద్ధం చేశారు.. మొత్తం 500 కు పైగా స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించారు.. స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ల నిర్వహణకు ఇంఛార్జిగా విష్ణువర్ధన్ రెడ్డిని నియమించింది బీజేపీ.. కేంద్ర ప్రభుత్వ పాలన, ప్రజలకు అందిన సంక్షేమంపై క్షేత్ర స్ధాయిలో నిర్వహించే మీటింగ్‌లలో వివరించనున్నారు.. ప్రతీ బూత్ స్ధాయిలో 20 మంది కార్యకర్తలను గుర్తించి వారితో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలకు రంగం సిద్ధం చేశారు. రాష్ట్రంలో ఎన్డీఏ గెలుపు దిశగా ప్రణాళిలలో తలమునకలౌతున్న రాష్ట్ర నాయకత్వం.. ఇప్పటికే అన్ని జిల్లాలతో సమావేశం అవుతున్నారు ఎన్నికల కన్వీనర్లు.. కాగా, ఈ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన పార్టీలతో కలిసి బీజేపీ బరిలోకి దిగిన విషయం విదితమే. ఇక, ఎన్నికల ప్రచారంలో భాగంగా.. మూడు పార్టీల నేతలు కలసి ప్రచారం నిర్వహిస్తున్నారు.. మంగళవారం రోజు మూడు పార్టీలకు చెందిన నేతలు కలిసి ఉమ్మడి మేనిఫెస్టోను సైతం విడుదల చేసిన విషయం విదితమే.
Read Also: Indraja Shakar: పెళ్ళైన నెల రోజులకే విడాకులు.. నటి సంచలన వ్యాఖ్యలు!
ఉమ్మడి మేనిఫెస్టో చంద్రబాబు, పవన్ కల్యాణ్, సిద్జార్థ్ నాథ్ సింగ్‌లు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మూడు పార్టీలకు చెందిన పలువురు నేతలు పాల్గొన్నారు. ఎన్డీయే హామీల్లో ముఖ్యమైన హామీలు పరిశీలస్తే.. 20 లక్షల మంది యువతకు ఉపాధి, మెగా డీఎస్సీ మీదే తొలి సంతకం, మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం, దీపం పథకం కింద 3 సిలిండర్లు ఉచితం, ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు అందజేత, నెలకు రూ. 3 వేలు చొప్పున నిరుద్యోగ భృతప్రతి ఇంటికీ ఉచిత కుళాయి కనెక్షన్. స్వచ్ఛమైన తాగునీటి సరఫరా, ‘తల్లికి వందనం’ కింద చదువుకుంటున్న పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం, ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దు, బీసీ సబ్ ప్లాన్ ద్వారా ఐదేళ్లల్లో రూ. 1.50 లక్షల కోట్లు ఖర్చు, బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్లు, బీసీ కార్పోరేషన్లను ఆర్థికంగా బలోపేతం, బీసీల స్వయం ఉపాధి కోసం ఏడాదికి రూ. 10 వేల కోట్లు, ఆధునిక పని ముట్లతో ఆదరణ పథకం అమలు, పవర్ లూం, హ్యాండ్ లూంలకు కొంత మేర ఉచిత విద్యుత్, డ్వాక్రా మహిళలకు రూ. 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు, ఆడపిల్లల విద్యకు కలలకు రెక్కలు పథకం.. వడ్డీ లేని రుణాలు లాంటివి ప్రకటించిన విషయం విదితమే.