ఇవాళ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు జరగనుంది. ఏపీ సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఏపీ సీఆర్డీఏ అథారిటీ ఆమోదించిన 23 అంశాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఇటీవల ఏపీలో వరుసగా కేసులు బుక్ అవుతున్నాయి. గతంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ ఫోటోలను మార్ఫింగ్ చేయడంతో పాటు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడులో టీడీపీ నేత రామలింగం ఫిర్యాదు చేశారు. ఆ మేరకు హైదరాబాద్‌లోని వర్మ నివాసానికి వెళ్లి విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చి వచ్చారు ప్రకాశం పోలీసులు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. ఇప్పటికే పీడీఎస్ బియ్యంపై ఏపీ సర్కారు సీరియస్‌గా ఉన్న సమయంలో వీరిద్దరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ బియ్యం విషయంలో ప్రభుత్వం సీరియస్ అవడంతో తీగ లాగితే డొంకంతా కదులుతోంది.
ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల అధికారుల కమిటీ మంగళగిరిలో సమావేశమై పలు కీలక విషయాలపై చర్చలు జరిపారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల అధ్యక్షతన జరిగిన సమావేశంలో కీలక విభాగాలకు సంబంధించిన ఐఏఎస్ అధికారులు పాల్గొని సుమారు రెండు గంటల పాటు చర్చించారు. పెండింగ్ లో ఉన్న అంశాలపై ఎలా ముందుకు వెళ్లాలో చర్చించారు. పలు అంశాలు ఏటూ తేలక పోవడంతో మరోమారు సమావేశం కావాలని నిర్ణయించి భేటీని ముగించారు. అయితే, తెలుగు రాష్ట్రాల విభజన…
అమరావతిలో 217 చదరపు కిలోమీటర్లలో రోడ్లు, బిల్డింగ్ లకు కొన్నింటికి అథారిటీ మీటింగ్ లో అనుమతులిచ్చాం అన్నారు మంత్రి నారాయణ.. కొన్ని రోడ్లకు 2498 కోట్లతో వేయడానికి అథారిటీ అనుమతిచ్చింది.. 1585 కోట్లతో మూడు వాగులు, మూడు రిజర్వాయర్ల నిర్మాణానికి అథారిటీ అనుమతి లభించిందని వెల్లడించారు.. ఇక, రూ.3,523 కోట్లతో అధికారుల బిల్డింగ్ లకు అనుమతి లభించింది.. జనవరి నుంచి అనుమతులు వచ్చిన పనులు ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు.. అన్ని రకాల వసతులు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో…
ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఈ ఉద్యోగాల భర్తీకి నోటిపికేషన్‌ను ఈ రోజు విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ పరిధిలో మొత్తం 280 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ చేసేందుకు రెడీ అయ్యింది..