CM Chandrababu: 2047 నాటికి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలని ఆకాక్షించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కృష్ణా జిల్లా పోరంలో ఎనర్జీ ఎఫీసెన్సీపై నిర్వహిస్తున్న ఉర్జావీర్ కార్యక్రమoలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, మంత్రి నారాయణ, ఇంధన శాఖ అధికారులు తదితరులతో కలిసి పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మనోహర్ లాల్ ఖట్టర్ రెండు నిముషాలు తెలుగులో మాట్లాడటంతో విజయవాడ ప్రజలకు గుర్తుంటారన్న ఆయన.. ప్రధాని మోడీకి ఎంతో ఇష్టమైన నాయకుడు మనోహర్ లాల్ కావడంతో ప్రధాన డిపార్ట్మెంట్‌లు ఇచ్చారు అని పేర్కొన్నారు. ఇక, ఆన్‌లైన్ లో రిజిస్ట్రేషన్ లు ఎంతో వేగంగా జరుగుతున్నాయి.. EESL లో రిజిష్టర్ చేసుకుని ఇంటి వద్ద నుంచే సంపాదించుకుంటున్నారు.. అంగన్వాడీలు ఇప్పుడు ఇచ్చిన స్టవ్ ల ద్వారా వేగంగా వంటలు చేయగలరు.. 43 వేల స్కూళ్ళలో పేరెంట్స్ కమిటీ మీటింగ్ పెట్టింది ప్రపంచంలోనే మొదటిసారి… ఏ రాష్ట్రంలో అయినా తలసరి విద్యుత్ వినియోగం తలసరి ఆదాయాన్ని చెపుతుంది.. పరిశ్రమలు, వ్యవసాయం, వాహనాలు అన్నిటికీ విద్యుత్ అవసరం అన్నారు..
ఇక, 1998లో విద్యుత్ రంగ సంస్కరణలు తీసుకొచ్చాం.. 2004కి మనం పవర్ వినియోగంలో పొదుపులో ఉన్నాం.. విద్యుత్ రంగంలో ఏపీని మొదటి ర్యాంకు కు తెస్తాం టీడీపీ హయాంలోనే అన్నారు సీఎం చంద్రబాబు.. గత టిడిపి ప్రభుత్వం హయాంలో విద్యుత్ వెలుగులు తెచ్చాం అన్నారు.. ఒక యూనిట్ కరెంట్ ఆదా చేస్తే రెండు యూనిట్ల కరెంటు ఉత్పత్తి చేసినట్టవుతుందన్న ఆయన.. ఒక ఉర్జావీర్ కు 2500 నుంచీ 15 వేలు అదనపు ఆదాయం వస్తుంది… మీ ఇంటి దగ్గరే మీరు డబ్బు సంపాదించే మార్గం చూపించడంలో ఇది మొదటి మెట్టుగా అభివర్ణించారు.. ప్రపంచానికి సేవలు చేసే అవకాశం భారతదేశానికి ఉంది.. కోవర్కింగ్ స్పేస్ లలో కొత్త కంపెనీలు పెడతాం.. 55,700 అంగన్వాడీలకి 2 నెలల్లోగా ఇండక్షన్ స్టవ్ లు ఇస్తాం.. PMAY కింద ఇళ్ళు కట్టుకున్న వారికి కరెంటు, బల్బులు ఇచ్చాం.. ప్రతీ ఇంటికి 20శాతం కరెంటు ఆదా చేసుకునే అవకాశం EESL పరికరాలు వాడితే వస్తుందని వెల్లడించారు..
పవర్ జనరేషన్ ను ప్రజాస్వామ్యం చేయడం వల్ల మీ ఇంటి విద్యుత్ మీరే చేసుకోవచ్చు అని సూచించారు సీఎం చంద్రబాబు.. సోలార్ పవర్ ను వినియోగించుకుంటే.. కరెంటు బిల్లు కట్టక్కర్లేదన్న ఆయన.. సోలార్ పవర్ తయారు చెసుకుని.. అవసరం అయితే 500 యూనిట్లు కరెంటు గ్రిడ్ కి ఇవ్వచ్చు అన్నారు.. ప్రజలకు అవసరమైనపుడు అదే కరెంటు వారికి తిరిగిస్తాం.. వాట్సప్ మెసేజ్ తో పని పూర్తి చేస్తాం.. అలా పూర్తి చేయకపోతే.. యాక్షన్ కూడా తీసుకుంటామని స్పష్టం చేశారు.. గత ప్రభుత్వ పనుల వలన రెవెన్యూ సదస్సులు పెట్టాల్సిన పరిస్ధితి తెచ్చారు.. ఒక రోజులో 12 వేల పిటిషన్లు వచ్చాయన్నారు. విద్యుత్ డిపార్ట్మెంట్ లో గత ప్రభుత్వం చేసిన తప్పులు తప్ప ఇంక తప్పు జరక్కుండా చూసుకుంటాం.. సోలార్, గ్రీన్, పంపుడ్ ఎనర్జీ లను తీసుకొస్తాం.. 40 వేల విద్యుత్ కనెక్షన్లు రైతులకు ఇస్తున్నాం.. 30 కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్ పెట్టాలని నిర్ణయించాం.. ఎనర్జీ మీద ఒక యూనివర్సిటీ పెట్టాలని నిర్ణయించామని వెల్లడించారు.. రాబోయే ఐదేళ్ళలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి.. గత ఐదేళ్ళలో ఏపీ చాలా ఇబ్బందులు పడింది.. PMAY 2.0 తో మేం MoU చేసుకున్నాం.. రాష్ట్రంలో ఎనర్జీ ఇదే విధంగా అధికంగా ఉండాలి.. 2047 నాటికి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఉండాలని ఆకాక్షించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..