ఇరిగేషన్ శాఖలో పలు ప్రాజెక్టులపై, ప్రధానంగా పోలవరంపై సీఎం రివ్యూ నిర్వహించారని తెలిపారు మంత్రి నిమ్మల రామానాయుడు.. పోలవరాన్ని యజ్ఞం లాగా పునర్నిర్మాణం చేయాలని చర్చించాం.. ఈ నెల 2వ వారం సీఎం చంద్రబాబు పోలవరం పర్యటన ఉంటుంది.. ఈ పర్యటనలోనే పోలవరం నిర్మాణం షెడ్యూల్ ను సీఎం ప్రకటిస్తారని వెల్లడించారు..
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రెండు రోజులు మద్యం షాపులు మూతపడనున్నాయి.. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ సాయంత్రం 4 గంటల నుంచి వైన్స్‌లు, బార్లు ఇతర మద్యం షాపులు మూసివేశారు. ఈనెల 5వ తేదీ సాయంత్రం వరకు మద్యం షాపులు మూసివేయనున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలు మేరకు మద్యం షాపులు మూసివేశారు నిర్వహకులు..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. సమావేశం ముగిసిన తర్వాత కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వివరించారు మంత్రి కొలుసు పార్థసారథి.. రాష్ట్ర ఆర్ధిక స్ధితి మెరుగు పరచడానికి కావాల్సిన పాలసీలు ఆమోదించారు.. గ్లోబల్ కాంపిటీటివ్ సెంటర్స్ పాలసీని కేబినెట్ ఆమోదించింది.. రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి, ఎకానమీ, స్కిల్డ్ వర్క్ ఫోర్స్ అభివృద్ధి కి గ్లోబల్ కాంపిటీటివ్ సెంటర్స్ పాలసీ ఉపయోగపడుతుందన్నారు.
మంత్రివర్గ సమావేశం అనంతరం సీఎం వివిధ అంశాలపై మంత్రులతో చర్చించారు.. బియ్యం, భూ దురాక్రమణ మాఫీయా ప్రభుత్వానికి సవాల్ విసురుతోందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. అన్నింటినీ అరికాడతామని స్పష్టం చేశారు.. కాకినాడ పోర్ట్ ను బలవంతంగా లాక్కొనారు.. కాకినాడ సెజ్ కూడా లాగేసుకున్నారు.. పోర్ట్ లాగేసుకుని 41 శాతం కేవీ రావుకు ఇచ్చేసి 59 శాతం అరబిందో వాళ్లు లాక్కొన్నారని ఆరోపించారు.. ఆస్తులను లాగసుకోవడం రాష్ట్రంలో కొత్త ట్రెండ్... ఇంతకు ముందు మనం ఎప్పుడూ చూడలేదన్నారు…
రాజధాని అమరావతి పునర్నిర్మాణం వైపు వడివడిగా అడుగులు వేస్తోంది ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం.. ఇదే సమయంలో.. అమరావతి నిర్మాణానికి విరాళాలు కూడా స్వీకరిస్తున్నారు.. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఇందుపల్లికి చెందిన కోగంటి ఇందిరాదేవి కుమార్తె పి విజయలక్ష్మి రాష్ట్ర ప్రభుత్వానికి రూ. కోటి విరాళంగా అందించారు.
భూ దందాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు అని వార్నింగ్ ఇచ్చారు మంత్రి అనగాని సత్యప్రసాద్.. భూదందాలపై ఉక్కు పాదం మోపుతామంటూ ఓ ప్రకటనలో హెచ్చరించారు.. ఇప్పటికే భూదురాక్రమణ (నిరోధక) చట్టం 2024ను తీసుకొచ్చాం.. వైఎస్ జగన్ రెడ్డి అరాచకపాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. ప్రజల ఆస్తులను లాక్కున్నారని ఆరోపించారు..
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమైంది.. ఇప్పటికే ఎన్నో ప్రతిష్టాత్మక ప్రయోగాలను విజయవంతం చేసిన ఇస్రో.. ఇటు కమర్షియల్ రాకెట్ ప్రయోగాలపై కూడా దృష్టిసారించింది.. ఇప్పటికే పలు దేశాలకు చెందిన ఉపగ్రహాలను.. ఇతర సంస్థలకు చెందిన ఉపగ్రహాలను సైతం కక్ష్యలోకి చేర్చి సత్తా చాటింది..
మరో కీలక సమావేశం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. రేపు వైసీపీ రాష్ట్ర స్థాయి సమావేశం జరగనుంది.. తాడేపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో వైఎస్ జగన్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి పార్టీ అన్ని జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర రీజినల్ కో ఆర్డినేటర్లు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు హాజరుకానున్నారు.. పార్టీ బలోపేతం, పార్టీ నిర్మాణంపై దృష్టి సారించనున్నారు వైఎస్ జగన్.. పార్టీ పరంగా కమిటీల ఏర్పాటు, వాటి భర్తీపై…
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పలు కీలక అంశాలకు ఆమోదం లభించింది. జలవనరుల శాఖలో జీవో 62 అమలుపై కేబినెట్లో చర్చ జరిగింది. గిరిజన ప్రాంతాల్లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గిరిజన గృహ పథకం అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.