Stray Dog Attacks: వీధి కుక్కలు పెట్రేగి పోతున్నాయి.. ఊరు.. వాడ.. పల్లె.. పట్నం అని తేడా లేకుండా.. వీధిలోకి వస్తే చాలు.. అవే దర్శనమిస్తున్నాయి.. ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తాయో అని.. కుక్కలు కనిపిస్తేనే హడలిపోతున్నారు.. తాజాగా, పార్వతీపురం మన్యం జిల్లా జీఎం వలస మండలం వెంకటాపురం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. వీధికుక్కల దాడిలో కుండెన పారమ్మ అనే వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది. బహిర్భూమికి వెళ్లిన 80 ఏళ్ల వృద్ధురాలిపై కుక్కలు దాడి చేసి పొలాల్లోనే చంపేశాయి.
Read Also: Minister Ponnam Prabhakar: ఫుడ్ పాయిజన్ ఘటనలపై మంత్రి పొన్నం సీరియస్
అయితే, వెంకటాపురం, బాసంగి గ్రామాలలో ఈ ఏడాదిలోనే కుక్కలు కరిచి ముగ్గురు మృతి చెందారు.. ఇప్పటి వరకు ఇద్దరు వృద్ధులు, ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయారు. అంతేకాదు.. వందల మంది ప్రజలు తీవ్రగాయాలకు గురయ్యారని స్థానికులు చెబుతున్నారు.. కుక్కల బెడదతో.. పొలాల్లోనికి వెళ్లాలంటేనే గ్రామ ప్రజలు, రైతులు భయాందోళనకు గురవుతున్నారు.. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ గ్రామాలను కుక్కల బారి నుండి రక్షించాలని అక్కడ ప్రజలు కోరుతున్నారు.