రైతులకు శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కృష్ణా జిల్లా పర్యటనలో ఆయన రైతుభరోసా కేంద్రం ప్రారంభించారు.. అనంతరం రైసు మిల్లును కూడా పరిశీలించి, ధాన్యం సేకరణపై రైతులతో మాట్లాడారు.. అక్కడ రైతులకు టెక్నాలజీపై ఉన్న అనుభవం అడిగి తెలుసుకున్నారు.. ఫోన్ లో మెసేజ్ లు చదవడం పై రైతుల అవగాహన ఏ పాటిదో అడిగి తెలుసుకున్నారు.. ధాన్యం సేకరణపైన ప్రత్యేక దృష్టి సారించారు..
కలియు ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులకు ముఖ్య గమనిక.. వైకుంఠ ఏకాదశి దర్శన, వసతి కోటా విడుదల తేదీలు ఖరారు చేసిన నేపథ్యంలో.. మార్చి నెల శ్రీవాణి, ఎస్ఈడీ కోటా విడుదల తేదీల్లో మార్పులు చోటు చేసుకున్నాయి..
భూకబ్జాలకు పాల్పడితే తాట తీస్తాం అని హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కృష్ణా జిల్లా ఈడుపుగల్లులో రెవెన్యూ సదస్సుకు హాజరైన సీఎం చంద్రబాబు.. రైతుల నుంచి వినతులు స్వీకరించారు..
పార్వతీపురం మన్యం జిల్లా పర్యటనలో.. తన ఓటమిపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. 2019లో నన్ను గెలిపించలేదు.. పరీక్షించారు.. నిలబడతాడో లేదో అని.. అది మంచిదేనని పేర్కొన్నారు..
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ప్రాంతంలో ఓ దొంగ చేసే చోరీలు వింతగా ఉన్నాయి. వందల సంఖ్యలో దొంగతనాలు చేసిన ఖరీదైన వస్తువుల్ని దోచుకుపోలేదు.. ఇంతకీ ఈ వింత దొంగ చేసిన చోరీలు వింటే మీకే ఆశ్చర్యం కలగక తప్పదు.. ఎందుకంటే అతను చేసిన చోరీలు ఏమిటంటే మహిళలు ఆరవేసిన జాకెట్లు ఎత్తుకుపోవడం.. నరసాపురం మండలంలో గత ఆరు నెలల నుంచి రాత్రి సమయాల్లో మహిళల జాకెట్లు కనిపించకుండా పోతున్నాయి. బాత్రూమ్లో.. బయట ఆరేసిన జాకెట్లను ఎత్తుకెళ్లిపోతుండటంతో గ్రామస్తులు…
పార్వతీపురం మన్యం జిల్లా పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన అభిమానులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.. ఓజీ.. ఓజీ.. అంటూ ఆయన అభిమానులు నినాదాలు చేశారు.. వెంటనే వారికి స్వీట్ వార్నింగ్ ఇచ్చిన ఆయన.. ఓజీ.. ఓజీ.. అని అరవకండి.. నన్ను పని చేసుకోనివ్వండి అని సూచించారు.. నేను డిప్యూటీ సీఎంను అయినా.. ఇంకా సీఎం సీఎం అని అరుస్తున్నారు.. ఇది సరైంది కాదని హితవు చెప్పారు.. ఇక, తిరుబాటును, భాషను నేర్పించిన…
2027లో ఏపీలో జాతీయ క్రీడలు నిర్వహించాలనే సంకల్పంతో ఉన్నాం అన్నారు ఏపీ స్పోర్ట్ అథారిటీ ఛైర్మన్ అనిమిని రవి కుమార్.. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీలో అధునాతన క్రీడా వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు నిర్దేశించారు. ఏపీలో పలు జిల్లాల్లో హాస్టల్ వసతులుతో కూడిన క్రీడా శిక్షణ సంస్థలను ఏర్పాటు చేస్తాం. “ఖేలో ఆంధ్ర ప్రదేశ్” గా ఏపీని తీర్చిదిద్దడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాం అన్నారు.
రాష్ట్రంలో సర్క్యూట్లుగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నాం అన్నారు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్.. విశాఖ పబ్లిక్ లైబ్రరీలో జరిగిన పరావస్తు పద్యపీఠం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన్ను ఆయన.. చిన్నయ్య సూరి పేరిట సత్కారం చేశారు.. ఈ సందర్భంగా కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. తెలుగు భాష ఔన్నత్యం కోసం కృషి చేసిన చిన్నయ్య సూరి పేరిట సత్కారం పాల్గొనడం ఆనందంగా ఉంది అన్నారు..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కోస్తా తీరం వైపు దూసుకొస్తుంది. ఇది బుధవారమే తీవ్ర అల్పపీడనంగా రూపాంతరం చెందింది. రాబోయే 24 గంటల్లో వాయవ్య దిశగా పయనిస్తూ ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాల వైపు వెళ్లనుంది. తర్వాత కోస్తా తీరం వెంబడి కదలనుంది. దీని ప్రభావంతో శుక్రవారం వరకు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాక (ఐఎండీ) పేర్కొంది.