Gun Fire : నాటు తుపాకీ మోత ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఎవరితో విభేదాలు లేవంటున్న ఆ కుటుంబం పై ఇక కాల్పులు జరిపింది ఎవరు? ఇదే వెయ్యి డాలర్ల ప్రశ్నగా మిగిలింది. పొద్దు పొద్దున్నే సంచలనం సృష్టించిన మిస్టరీగా రాయచోటి కాల్పులు ఘటన ఘటనలు ఇద్దరు గాయపడ్డారు… అయితే వారిద్దరూ చిక్కు వెంట్రుకలు అమ్ముకుంటూ జీవనం సాగించేవారు. చిక్కు వెంట్రుకలు సేకరిం చే వారిపై కాల్పులు జరపాల్సిన అవసరం ఎవరిది? ఎందుకు జరిపారు…
గతంలో 117 జీఓ తెచ్చి విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేశారని.. 117 జీఓను రద్దు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.జనవరి నుండి ఇంటర్మీడియట్ విద్యలో మధ్యాహ్న భోజనం పథకాన్ని ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. విద్యా కిట్లు ఇస్తున్నామని ఆయన వెల్లడించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనంతో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి.. ఈ నేపథ్యంలో.. తాజా పరిస్థితులపై భారత వాతావరణ శాఖ రిపోర్ట్ విడుదల చేసింది. రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొంది..
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కీలక నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం.. మహిళల ఫ్రీ బస్సు స్కీమ్ అమలులో ఉన్న రాష్ట్రాలలో పర్యటించడానికి మంత్రుల కమిటీ ఏర్పాటు చేసింది.. ఏపీ రవాణా శాఖ మంత్రి చైర్మన్గా.. హోంమంత్రి, మహిళా శిశు సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రులు ఈ కమిటీ సభ్యులుగా చేర్చింది ప్రభుత్వం..
కూటమీ ప్రభుత్వానికి బహిరంగ సవాల్ విసిరారు మాజీ మంత్రి ఆర్కే రోజా.. నేను అవినీతి చేసుంటే నిరూపించండి అని ఛాలెంజ్ చేసిన ఆమె.. ఫైల్స్ అన్ని మీ దగ్గరే ఉన్నాయి.. నా తప్పు ఎంటో నిరూపించండి అన్నారు.. జగన్ పుట్టిన రోజుల ఒక పండుగ రోజులా జరుపుకుంటున్నాం.. జగన్ లాంటి నాయకుడు దేశంలో రాష్ట్రంలోను లేడని పేర్కొన్నారు.
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజును పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా.. ఇతర రాష్ట్రాలు.. దేశాల్లో కూడా ఆయన బర్త్ డే వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు..
ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో పలుచోట్ల స్వల్పంగా భూమి కంపించినట్టు స్థానికులు చెబుతున్నారు.. రెండు మండలాల్లోని పలు గ్రామాల్లో రెండు సెకన్ల పాటు స్వల్పంగా భూమి కంపించిందంటున్నారు.. అయితే, ఈ ఘటనతో భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు ప్రజలు..
అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలపై సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. సీఎంవో అధికారులు ఆయా జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రికి వివరించారు. కలెక్టర్లు, జిల్లా స్థాయిలో అధికారులు తీసుకుంటున్న చర్యలు, అప్రమత్తతపై వివరించారు.
బెజవాడ దుర్గమ్మ ఆలయంలో భవానీ దీక్ష విరమణలు ప్రారంభమయ్యాయి.. ఇవాళ్టి నుంచి ఈ నెల 25వ తేదీ వరకు దీక్షా విరమణలు జరగనున్నాయి.. దీంతో సుమారు రోజుకి 50 వేలకు మంది పైగా భక్తులు వస్తారన్న అంచనా వేస్తున్నారు అధికారులు.. 7 లక్షల మంది భవానీ దీక్షాధారులు ఐదు రోజుల్లో గిరి ప్రదక్షిణ పూర్తి చేసి, ఇరుముడులు మల్లికార్జున మహా మండపంలో సమర్పించే విధంగా ఏర్పాట్లు చేశారు అధికారులు..