వైసీపీకి మరో షాక్.. రాజకీయాలకు మాజీ ఐఏఎస్ గుడ్‌బై..
వైసీపీ మరో షాక్ తగిలినట్టు అయ్యింది.. మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ వైసీపీకి రాజీనామా చేశారు.. అంటే, ఆయన కేవలం వైసీపీకి మాత్రమే కాదు.. మొత్తం రాజకీయాలకే గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించారు.. గత ఎన్నికల్లో కర్నూల్ జిల్లా నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఇంతియాజ్.. ఓటమి పాలయ్యారు.. అయితే, ఇప్పుడు ఇంతియాజ్ రాజీనామా లేఖ విడుదల చేశారు.. రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు.. ఇక, మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఇంతియాజ్ విడుదల చేసిన రాజీనామా లేఖను ఓసారి పరిశీలిస్తే..”అందరికీ నమస్కారం.. కొన్ని నెలల క్రితం ప్రజాసేవే ధ్యేయంగా, ముఖ్యంగా కర్నూలు నగరంలో ఉన్న పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఐఏఎస్ సర్వీస్ నుండి వీఆర్ఎస్ తీసుకొని రాజకీయాల్లోకి రావడం జరిగింది. కర్నూలు నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం, ఎన్నికల ఫలితాలు మీ అందరికీ తెలిసిందే.. గత కొంత కాలంగా బంధుమిత్రులు మరియు శ్రేయోభిలాషులతో చర్చించ ఒక నిర్ణయానికి రావడం జరిగింది.. అదేమిటంటే.. రాజకీయ రంగం నుడి దూరంగా జరగటం.. రాజకీయాలకు దూరం అవుతున్నాను.. కానీ ప్రజసేవ రంగానికి కాదు” అని పేర్కొన్నారు..
ఏపీలో భూముల ధరల పెంపు..! క్లారిటీ వచ్చేది అప్పుడే..
ఆంధ్రప్రదేశ్‌లో భూముల మార్కెట్ ధరలు పెరుగుతున్నాయని బాగా ప్రచారం జరుగుతోంది.. మార్కెట్ రేట్ పెరిగితే ఆటోమాటిక్ గా రిజిస్ట్రేషన్ చార్జీలు కూడా పెరుగుతాయి.. దీంతో కొంతమంది ప్రజలు కూడా ఈ నెలాఖరులోగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి కొన్ని ప్రాంతాల్లో తొందర పడుతున్నారు. అయితే, భూముల మార్కెట్ ధరలు పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉండడంతో కొన్ని వర్గాల నుంచి ఒత్తిడి బాగా వచ్చినట్టు సమాచారం.. ప్రధానంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు. ఇతర ప్రజా సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. అసలే రియల్ వ్యాపారాలు సరిగ్గా లేని సమయంలో మార్కెట్ రేట్ పెరిగితే మరిన్ని ఇబ్బందులు తప్పవంటూన్నారు. ప్రస్తుతం ఏపీలో రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి.. ఈ నెలాఖరు వరకు కొనసాగనున్నాయి.. భూ సమస్యలు ఎన్నో ఉన్నాయి.. ఎంతోమంది ఈ సదస్సులో వారి సమస్యలు చెబుతున్నాఉ.. దీంతో, ఈ టైంలో భూముల మార్కెట్ విలువ పెరిగితే ఇబ్బంది అని ప్రభుత్వం కూడా వెనకడుగు వేస్తోంది. అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకుని ధరలు పెంచాలని నిర్ణయానికి వచ్చింది ప్రభుత్వం. ఇక, ప్రభుత్వానికి ఆదాయం పెంచడానికి ఆర్ధిక శాఖ. రెవెన్యూశాఖ అధికారులు భూముల మార్కెట్ ధరలు పెంచాలని ఒత్తిడి తెస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 14 వేల కోట్ల రెవెన్యూ వస్తుందని సమాచారం. అయితే, సీఎం కూడా ఈ ప్రతిపాదన అమలుకు పూర్తిస్థాయిలో సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది.. మొదట అంగీకరించినా తర్వాత వస్తున్న వ్యతిరేకత దృష్టిలో పెట్టుకుని సీఎం కూడా అధికారులను నివేదిక సిద్ధం చెయ్యమన్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ నెల 30వ తేదీన సీసీఎల్‌ఏలో కీలక సమావేశం జరగనుంది. జోనల్ రెవెన్యూ సమావేశంలో కొన్ని ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటారు. భూముల మార్కెట్ ధరలపై చర్చిస్తారు. అయితే, ఇప్పటికే జాయింట్ కలెక్టర్ల నేతృత్వంలో నివేదిక సిద్ధం అయ్యింది.. ప్రభుత్వం నుంచి సరైన స్పష్టత లేకపోవడంతో భూముల మార్కెట్ ధర పెంచాలా వద్ద అనే విషయంలో గందరగోళం ఏర్పడింది. 30న జరిగే సమావేశంలో భూముల మార్కెట్ ధరల పెంపు విషయంలో అధికారులు చర్చించిన తర్వాత నివేదిక సిద్ధం చేస్తారు. నివేదిక సీఎంకు అందించిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సీఎం మళ్లీ సమగ్రంగా చర్చించిన తర్వాత భూముల ధరలు పెంచడంపై దృష్టి పెట్టనున్నారు.. ఇప్పటికే ఒక వైపు విద్యుత్తు ఛార్జీలపై ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది..
ఈఎంఐ చెల్లించలేదని సాఫ్ట్‌వేర్ ఉద్యోగినికి న్యూడ్ ఫొటోలు..! ట్విస్ట్ ఏంటంటే..?
లోన్ యాప్‌ల వేధింపులు అంతా ఇంతా కాకుండా పోతున్నాయి.. లోన్ తీసుకోవాలంటూ వేధింపులు ఓవైపు.. మరోసారి లోన్ తీసుకున్న తర్వాత కట్టడం లేదంటూ మరో రకమైన టార్చర్.. ఆ లోన్ యాప్‌ల వేధింపులతో ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు విడిచారు.. మరెంతో మంది వేధింపులతో తీవ్రమైన మానసికక్షోభ అనుభవిస్తున్నారు.. అయితే, ఈఎంఐ డబ్బులు చెల్లించకపోవడంతో న్యూడ్ ఫొటోలు పంపించిన రికవరీ ఏజెంట్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలైన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఫిర్యాదు మేరకు ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు పోలీసులు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సూళ్లూరుపేటకు చెందిన యువతి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తూ ఆరు నెలల కిందట ఫినబుల్ యాప్‌లో లోన్ తీసుకుంది. ఈ క్రమంలో సమయానికి ఈఎంఐ చెల్లించకపోవడంతో ఆమె ఫొటోలను అసభ్యకరంగా మార్చి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తామని రికవరీ ఏజెంట్లు బెదిరింపులకు పాల్పడ్డారు. అంతేకాకుండా బాధితురాలి తల్లిదండ్రులు, బంధువులకు ఫోన్ చేసి వేధించారు. లోన్ తాలూకూ డబ్బులు చెల్లించడం లేదంటూ దూషించారు. అంతటితో ఆగకుండా ఆమె సోదరుడికి మార్ఫింగ్ చేసిన కొన్ని న్యూడ్ ఫొటోలు కూడా పంపించడంతో యువతి తీవ్ర మనస్తాపానికి గురైంది. ఎంత వారించినా ఏజెంట్లు వినకపోవడం, బెదిరింపులు పెరుగుతుండడంతో ఏజెంట్ల వేధింపులు తాళలేక పోలీసులను ఆశ్రయించింది. దీంతో సకాలంలో స్పందించిన పోలీసులు.. ఇద్దరు ఏజెంట్లను అరెస్టు చేశారు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల వద్ద రుణాలు తీసుకొనే సమయంలో జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ సుబ్బారాయుడు ఈ సందర్భంగా సూచించారు. ప్రజలు సైబర్ నేరాలు.. లోన్ యాప్ బెదిరింపులపై అప్రమత్తంగా వ్యవహరించాలని పేర్కొన్నారు.. ఇక, యువతిని వేధించిన ఫినబుల్ లోన్ యాప్‌పై సైబర్ క్రైమ్ కేసు నమోదు చేశామని తెలిపారు ఎస్పీ సుబ్బారాయుడు..
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. ఏపీ రాజధాని రెడీ..
2024కి బైబై చెప్పేసి.. 2025కి స్వాగతం పలికేందుకు ప్రపంచం మొత్తం సిద్ధం అవుతోంది.. ఇక, కొత్త సంవత్సర వేడుకలకు ఏపీ రాజధాని అమరావతి ప్రాంతం కూడా రెడీ అవుతోంది.. ధూంధామ్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు.. మెలోడీ బ్రహ్మ మణిశర్మతో పాటు ప్రఖ్యాత సింగర్లు, నటి నటులతో ఈవెంట్స్ అదరగొట్టేందుకు సిద్ధం అవుతున్నారు.. అమరావతిలో భారీ సెట్లలో నాలుగు గ్రాండ్ ఈవెంట్స్ జరగబోతున్నాయి.. విజయవాడ, అమరావతి పరిసర ప్రాంతాల్లో అప్పుడే ఈ ఈవెంట్స్ జోరు స్పష్టంగా కనిపిస్తోంది.. 2025 న్యూ ఇయర్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు అమరావతి సిద్ధం అవుతుంది.. అమరావతిలో ఈ ఏడాది మొత్తం నాలుగు భారీ ఈవెంట్లు నిర్వహిస్తున్నారు..ఇందుకోసం పలు ప్రైవేట్ వేదికలను అంగరంగ వైభవంగా ముస్తాబు చేస్తున్నారు నిర్వాహకులు.. విజయవాడ, గుంటూరులో భారీ ఈవెంట్లతో డిసెంబర్ 31st నైట్ జరగబోతోంది.. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ, సింగర్స్ గీత మాధురి, మధు ప్రియ, నటి ముమైత్ ఖాన్ తో పాటు మరి కొందరు సినీ సెలబ్రిటీలు ఈ ఈవెంట్లలో ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నారు.. పాత ఏడాది బైబై చెప్పేసి.. నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు కొత్త ఉత్సాహంతో పార్టీలు చేసుకునేందుకు సిద్ధం అయ్యారు. పబ్‌లు, రిసార్ట్‌లు, ఫామ్‌హౌస్ లు.. ఇలా ఎక్కడైతేనేం న్యూ ఇయర్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు సిద్ధం అయ్యారు.. ఈవెంట్ మేనేజర్లు కూడా కొత్త ఏడాదికి వేడుకలను భారీ ఎత్తున సిద్ధం చేస్తున్నారు. పాపులర్ సింగర్స్, డీజేలు, మ్యూజిక్ డైరెక్టర్లు, సినిమా సెలబ్రెటీలతో ఈవెంట్లు, విందులు, వినోదాలు.. సంస్కృత కార్యక్రమాలు వంటి అనేక ఏర్పాట్లతో సెలబ్రేషన్స్ నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారు.. డిమాండ్‌ను బట్టి పార్టీ వేడుకలకు ఒక్కో టికెట్ ధర రూ.5 వేల నుంచి రూ.50 వేల పైనే పలుకుతోందని చెబుతున్నారు..
తీర్పు రిజర్వ్.. పేర్ని నాని సతీమణి ముందస్తు బెయిల్‌పై ఉత్కంఠ..!
పేర్ని నాని భార్య కేసులో ఏ1 జయసుధ తరఫు న్యాయవాదులు తమ వాదన వినిపిస్తూ.. గోడౌన్‌లో బస్తాల షార్టేజ్ వచ్చినట్లు గుర్తించి.. నవంబర్ 27వ తేదీన ప్రభుత్వానికి లేఖ రాశామన్నారు.. అయితే, డిసెంబర్ 3, 4 తేదీల్లో గోడౌన్లో తనిఖీలు నిర్వహించి.. 10వ తేదీన డిమాండ్ నోటీసు ఇచ్చారని కోర్టుకు వివరించారు. అనంతరం డిసెంబర్ 12వ తేదీన కేసు నమోదు చేశారని కోర్టుకు విన్నవించారు. బియ్యం తగ్గిన విషయం తామే ముందు గుర్తించి ప్రభుత్వానికి చెప్పామని తెలిపారు.. గోడౌన్‌లో బస్తాల షార్టేజ్ వచ్చినట్లు గుర్తించి.. నవంబర్ 27వ తేదీన ప్రభుత్వానికి లేఖ రాశామన్నారు. బియ్యం మాయం అయినట్లు నేరుగా వారే అంగీకరించడం.. ఆ క్రమంలో నోటీసుల జారీ చేసిన నేపథ్యంలో రూ. కోటి 70 లక్షలు ప్రభుత్వానికి చెక్కు ద్వారా చెల్లించారని కోర్టుకు గుర్తు చేశారు. నేరం చేసి.. నగదు చెల్లించామని.. దీంతో కేసు మాఫీ చేయాలంటూ కోరుతున్నట్లుగా జయసుధ తరఫు న్యాయవాదులు చెబుతున్నట్లుగా ఉందని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు తమ వాదనల్లో పేర్కొన్నారు.. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు. తీర్పును రిజర్వు చేస్తున్నమని ఈ నెల 30న తీర్పు ఇస్తామని పేర్కొంది.. కాగా, ఈ కేసు వెలుగు చూసిన తర్వాత మాజీ మంత్రి పేర్నినాని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన విషయం విదితమే.. అప్పుడప్పుడు పేర్నినాని కనిపిస్తున్నా.. ఆ ఫ్యామిలీ మొత్తం అజ్ఞాతాన్ని వీడడం లేదు.. ఈ నేపథ్యంలో.. ఈ నెల 30వ తేదీన మచిలీపట్నం జిల్లా కోర్టు తీర్పు ఎలా రాబోతోందనే ఉత్కంఠ నెలకొంది..
గంజాయి అమ్ముతూ పట్టుబడిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్..
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గంజాయి అమ్ముతూ పట్టుబడ్డాడు. కూకట్‌పల్లి ప్రాంతంలోని వసంత నగర్ బస్ స్టాప్‌లో భరత్ రమేష్ బాబు అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గంజాయి అమ్ముతూ ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులకు శుక్రవారం దొరికాడు. నిందితుడి నుంచి 1.1 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం ప్రాంతానికి చెందిన సంతోష అనే వ్యక్తి తరచూ అక్కడి నుంచి గంజాయిని తీసుకువచ్చి రమేష్ బాబుకి ఇచ్చి అమ్మకాలు జరిపిస్తూ ఉంటాడు. శుక్రవారం కూడా ఖమ్మం నుంచి తీసుకువచ్చిన గంజాయిని రమేష్ బాబుకి ఇస్తున్న సమయంలో ఎస్టీఎఫ్ పోలీసులు పట్టుకున్నారు. సంతోష్ మాత్రం గంజాయి ఇచ్చి దొరక్కుండా పరారయ్యాడు. గంజాయి అమ్మకాలను చేపడుతున్న భరత్ రమేష్ బాబు మాత్రం ఎస్టీఎఫ్ సీఐ నాగరాజు, సిబ్బంది పట్టుకున్నారు. నిందితుడి వద్ద 1.1 కేజీల గంజాయితో పాటు ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న వారిలో సీఐ నాగరాజు తోపాటు ఎస్ఐ జ్యోతి, హెడ్ కానిస్టేబుల్ అలీమ్, కానిస్టేబుళ్లు శశికిరణ్ కార్తీక్ ఉన్నారు. ఈ టీంను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వివి కమలాసన్ రెడ్డి, ఎస్టీఎఫ్ డీఎస్సీ తిరుపతి యాదవ్ అభినందించారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలి
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి డిమాండ్ చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం భారతదేశ ప్రజలకు తీర్చలేనటువంటి లోటన్నారు. 1991లో పీవీ నరసింహారావు ప్రధాని మంత్రిగా ఉన్నప్పుడు మొట్ట మొదటిసారిగా మన్మోహన్ సింగ్‌ను ఆర్థిక శాఖ మంత్రి నియమించారని గుర్తు చేశారు. 15 టన్నుల బంగారాన్ని కుదవపెట్టి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చారన్నారు. భారతదేశ ఆర్థిక పరిస్థితి కుదేలైన సమయంలో ప్రధానిగా పీవీ నరసింహారావు, ఆర్థిక శాఖ మంత్రిగా మన్మోహన్ సింగ్ వచ్చారని వెల్లడించారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి గల ముఖ్య కారకుడు మన్మోహన్ సింగ్ అని మల్లు రవి కొనియాడారు. ఆ ఐదు సంవత్సరాలు ఆర్థిక ఇబ్బందులను బయటపడి ప్రగతి పథంలో ముందుకు వెళ్ళిందన్నారు. మన్మోహన్ సింగ్ అంటేనే సంస్కరణలకు పెట్టింది పేరని.. దేశం ఒక మహా నేతను కోల్పోయిందన్నారు. మన్మోహన్ సింగ్ తీసుకువచ్చిన సంస్కరణల అడుగుజాడల్లోనే తదుపరి వచ్చిన ప్రధాన మంత్రులు నడుచుకున్నారని స్పష్టం చేశారు. ఆయనను గొప్ప ప్రధానిగా గుర్తించి సేవలను అందరూ తలచుకుంటున్నారన్నారు.
మన్మోహన్ సింగ్ మృతిపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సంతాప తీర్మానం
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సంతాప తీర్మానం చేసింది. ఏఐసీసీ కార్యాలయంలో సీడబ్ల్యూసీ సభ్యులు సమావేశమై సంతాప తీర్మానం చేశారు. శనివారం జరిగే మన్మోహన్‌సింగ్ అంతిమసంస్కారాల నిర్వహణపై కూడా చర్చించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, సోనియా, రాహుల్ గాంధీ, ప్రియాంక, తదితర నేతలంతా పాల్గొన్నారు. మన్మోహన్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తామని సీడబ్ల్యూసీ తీర్మానం చేసింది. ఆయన నిజమైన రాజనీతిజ్ఞుడని, దేశం కోసమే తన జీవితాన్ని దారపోశారని గుర్తు చేసుకున్నారు. భారతదేశ రాజకీయ, ఆర్థిక రంగంలో మన్మోహన్ ఒక మహోన్నత వ్యక్తి అని, ఆయన చేసిన కృషి దేశాన్ని మార్చివేసిందని తెలిపింది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఆయనకు గౌరవాన్ని తెచ్చిపెట్టిందని గుర్తుచేసుకున్నారు. 1990 ప్రారంభంలో ఆర్థిక మంత్రిగా భారతదేశ ఆర్థిక సరళీకరణకు రూపశిల్పి అని కొనియాడారు. అసమానమైన దూరదృష్టితో వరుస సంస్కరణలను ప్రారంభించారన్నారు. దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి రక్షించడమే కాకుండా ప్రపంచ మార్కెట్లకు కూడా తలుపులు తెరిచాయని స్మరణచేసుకున్నారు. నియంత్రణ సడలింపు, ప్రైవేటీకరణ మరియు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహం వంటి విధానాల ద్వారా భారతదేశం వేగవంతమైన ఆర్థిక వృద్ధికి పునాది వేశారని నేతలు నెమరువేసుకున్నారు. ఆయన నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉద్భవించిందని కొనియాడారు. ఇది ఆయన ప్రతిభ, దార్శనికతకు నిదర్శనం అని సీడబ్ల్యూసీ పేర్కొంది. నిజమైన రాజనీతిజ్ఞుడు మన్మోహన్ సింగ్ అని పేర్కొంది.
మన్మోహన్‌లో ఉన్న ఆ లక్షణాలే భారతీయుల జీవితాలను మార్చేసింది
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల కాంగ్రెస్ అగ్రనేత, రాజ్యసభ ఎంపీ సోనియాగాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. జ్ఞానం, గొప్పతనం, వినయం యొక్క ప్రతిరూపమైన నాయకుడ్ని కోల్పోయినట్లు తెలిపారు. దేశానికి హృదయపూర్వకంగా, మంచి మనస్సుతో సేవ చేశారని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ప్రకాశవంతమైన, ప్రియమైన మార్గదర్శక కాంతి అని కొనియాడారు. కరుణ మరియు దార్శనికత లక్షలాది మంది భారతీయుల జీవితాలను మార్చివేసిందని తెలిపారు. స్వచ్ఛమైన హృదయం, చక్కటి మనసు కారణంగానే భారత ప్రజలు ఆయనను ప్రేమించారని చెప్పారు. ఆయన సలహాలు. అభిప్రాయాలు దేశంలోని రాజకీయ వర్ణపటంలో లోతుగా నాటుకున్నాయన్నారు అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా నాయకులు, పండితులు గౌరవించారని.. అలాగే ఆరాధించారని పేర్కొన్నారు. అపారమైన జ్ఞానం, స్థాయి కలిగిన రాజనీతిజ్ఞుడిగా ప్రశంసించారు. మన్మోహన్ నిర్వహించిన ప్రతి ఉన్నత పదవికి ప్రకాశం మరియు ప్రత్యేకతను తెచ్చిపెట్టిందని వెల్లడించారు. భారతదేశానికి గర్వం మరియు గౌరవాన్ని తెచ్చిపెట్టారని సోనియా గాంధీ కొనియాడారు. ఇదిలా ఉంటే శుక్రవారం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సంతాప తీర్మానం చేసింది. ఏఐసీసీ కార్యాలయంలో సీడబ్ల్యూసీ సభ్యులు సమావేశమై సంతాప తీర్మానం చేశారు. శనివారం జరిగే మన్మోహన్‌సింగ్ అంతిమసంస్కారాల నిర్వహణపై కూడా చర్చించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, సోనియా, రాహుల్ గాంధీ, ప్రియాంక, తదితర నేతలంతా పాల్గొన్నారు. మన్మోహన్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తామని సీడబ్ల్యూసీ తీర్మానం చేసింది. ఆయన నిజమైన రాజనీతిజ్ఞుడని, దేశం కోసమే తన జీవితాన్ని దారపోశారని గుర్తు చేసుకున్నారు.
జీపీఎస్ జామింగ్.. కజకిస్తాన్‌లో విమానం కూలేలా చేశారా..?
అజర్‌బైజాన్ ఎయిర్ లైన్స్‌కి చెందిన ఎంబ్రేయిర్-190 విమానం రష్యాకు వెళ్తూ కజకిస్తాన్‌లో కుప్పకూలింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారియి. బాకు నుంచి రష్యాలోని చెచన్యాలోని గ్రోజీకి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పొగమంచు కారణంగా గ్రోజీలో విమానం ల్యాండింగ్ తిరస్కరించిన క్రమంలో కాస్పియన్ సముద్రం వైపుగా మళ్లీంచబడింది. చివరకు కజకిస్తాన్ అక్టౌ నగరంలో కూలిపోయింది.న ఈ ప్రమాదంలో 38 మంది మరణించగా, 29 మంది ప్రాణాలతో బయటపడ్డారు. అయితే, ఈ విమానం ప్రమాదంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నారు. రష్యా ఉపరితలం నుంచి ఏదైనా క్షిపణి ఢీకొట్టడం వల్లే క్రాష్ అయినట్లు అనుమానిస్తున్నారు. ప్రమాదవశాత్తు మిస్సైల్ ఫైర్ చేయడం వల్ల ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోయిందనే రిపోర్టులు వెలువడుతున్నాయి. అయితే, రష్యా మాత్రం దీనిని కొట్టిపారేసింది. దీనిపై దర్యాప్తు జరుగుతోంది. అయితే, అజర్ బైజాన్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే వెబ్‌సైట్ కాలిబన్ నివేదిక ప్రకారం.. పాంసీర్-ఎస్ వైమానికి రక్షణ వ్యవస్థ నుంచి వచ్చిన క్షిపణి విమానాన్ని కూల్చిందని పేర్కొంది.
హైదరాబాద్‌లో “స్విగ్గీ ఇన్‌స్టామార్ట్” హవా.. 2024లో ఎక్కువగా ఏం ఆర్డర్ చేశారంటే?
హైదరాబాద్‌లో ఆన్ లైన్ మార్కెట్ స్థాయి విపరీతంగా పెరిగింది. ప్రజలందరూ కూరగాయల నుంచి బ్యూటీ ప్రొడక్ట్స్ వరకు అన్నీ ఆన్లైన్‌లోనే ఆర్డర్ చేస్తున్నారు. పని ఒత్తిడి, ట్రాఫిక్, పలు కారణాలతో బయటకు వెళ్ల లేక ఆన్లైన్ షాపింగ్‌కి అలవాటు పడుతున్నారు. వస్తువులపై అనేక ఆఫర్లు ప్రకటించడం, డెలివరీ చేశాకే డబ్బులు చెల్లించే అవకాశం ఉండడంతో ఆన్ లైన్ వ్యాపారం మూడు పువ్వులు, ఆరుకాయలుగా సాగిపోతోంది. ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌లో ‘స్విగ్గీ’ హవా సృష్టించింది. ఫుడ్ డెలివరీ సంస్థగా ప్రారంభమైన ఈ సంస్థ నేడు పండ్లు, కూరగాయలతోపాటు గృహోపకరణాలను కూడా డెలివరీ చేస్తోంది. హైదరాబాద్‌లో వేగవంతమైన డెలివరీలు చేస్తూ కస్టమర్లను ఆకర్శిస్తోంది. భాగ్యనగరంలో 1.8 కిమీ దూరాన్ని కేవలం 96 సెకన్లలో చేరుకుంటోంది. అయితే హైదరాబాద్‌లో ఈ ఏడాది డెలివరీ చేసిన వస్తువుల వివరాలు వెల్లడిస్తూ.. కంపెనీ ఓ ప్రకటన విడుదల చేసింది. కూరగాయలతో పాటు చిప్స్, కండోమ్‌లు, ఐస్‌క్రీమ్, మ్యాగీ, పాలు ఎక్కువగా ఆర్డర్ చేసినట్లు కంపెనీ పేర్కొంది. 2024లో దాదాపు 2 కోట్ల చిప్స్ ప్యాకెట్లను ఆర్డర్ చేసినట్లు కంపెనీ తెలిపింది. పాల కోసం 19 లక్షలకు పైగా ఆర్డర్‌లను పొందింది. బ్రెడ్, గుడ్ల కోసం రూ.1.54 కోట్ల విలువైన ఆర్డర్‌లకు స్వీకరించింది. లోదుస్తుల కోసం 18,000, కండోమ్‌ల కోసం దాదాపు 2 లక్షల ఆర్డర్‌లను స్విగ్గీ తీసుకుంది. ఈ ఏడాది వినియోగదారులు 25 లక్షల మ్యాగీ ప్యాకెట్లను ఆర్డర్ చేశారట. హైదరాబాద్ టూత్ బ్రష్‌ల కోసం ఈ ఏడాది రూ. 2.3 కోట్లకు పైగా ఖర్చు చేసింది. నగరవాసులు కేవలం ఐస్‌క్రీమ్‌లకే దాదాపు రూ.31 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ డబ్బుతో కొత్త ఏకంగా ప్రైవేట్ జట్ నే కొనుగోలు చేయవచ్చట. దీంతో పాటు రూ.15 కోట్ల విలువ చేసే బ్యూటీ ప్రోడక్ట్‌లు కొనుగోలు చేసినట్లు కంపెనీ పేర్కొంది. నగరంలో ఆర్డర్ చేసిన టాప్ 5 కూరగాయల్లో.. పాలు, టమోటాలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి ఉన్నాయి.
రోజురోజుకి పడిపోతున్న రూపాయి.. దూసుకెళ్తున్న డాలర్
శుక్రవారం (డిసెంబర్ 27) నాడు భారత రూపాయి డాలర్‌తో పోలిస్తే కొత్త కనిష్ట స్థాయి 85.7గా నమోదు చేసింది. ఇది రూపాయి కొత్త రికార్డు కనిష్ట స్థాయి. రూపాయి 85.5 స్థాయిని దాటడం ఇది తొలిసారి. ఈ క్షీణతను నాన్-డెలివరేబుల్ ఫార్వర్డ్ (NDF) మార్కెట్‌లో డాలర్‌కు ఉన్న బలమైన డిమాండ్ కారణంగా చూస్తున్నారు. ఈ పరిస్థితి వరుసగా తొమ్మిదో రోజు రూపాయి క్షీణతను కొనసాగించింది. 2024లో ఇప్పటివరకు, అమెరికా డాలర్‌తో రూపాయి 3% వరకు బలహీనపడింది. ఇది ఒక వరుసగా ఏడవ సంవత్సరం నష్టాలను నమోదు చేయడంలో దారితీసింది. అయితే, ఇతర ఎమర్జింగ్ మార్కెట్ కరెన్సీలతో పోలిస్తే భారత రూపాయి సురక్షితమైన పనితీరు కనబరుస్తోంది. ఇకపోతే, ఏప్రిల్ 2024 నుండి భారత రూపాయి కేవలం 1.2% మాత్రమే బలహీనపడింది. కానీ, దక్షిణ కొరియా విన్ 2.2%, బ్రెజిలియన్ రియల్ 12.7% క్షీణించింది. G20 దేశాల కరెన్సీలతో పోలిస్తే రూపాయి తక్కువ అస్థిరతను చూపిస్తూ ముందుకు సాగుతోంది. రూపాయి విలువ పడిపోవడానికి గల కారణాలలో వాణిజ్య లోటు ఈ సంవత్సరం 37.8 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 3,200 బిలియన్లు) ఒకటి. ఈ కారణంగా రూపాయి నవంబర్‌లో రికార్డు స్థాయికి పడిపోయింది. ప్రపంచ వాణిజ్యంలోని అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు దీనికి ప్రధాన కారణాలు అని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఈ భామలకు పెళ్ళి చేసుకోవాలనే ఆలోచన లేదట
30 ప్లస్ క్రాస్ చేసేయడంతో మాలీవుడ్ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ హడావుడిగా వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. కానీ ఏజ్ దాటినా కొంత మంది కేరళ కుట్టీలు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనే చేయట్లేదు. 30 ప్లస్ అయితే ఏంటీ పెళ్లి చేసుకోవాలని రూల్ ఉందా అంటూ ప్రశ్నిస్తున్నారు. సింగిల్ లైఫ్ బెటర్ దెన్ మింగిల్ అంటున్నారు. 35 క్రాస్ చేసినా పార్వతి తిరువోతు పెళ్లి ఊసేత్తట్లేదు. ఇక వీరి జాబితాలోకి చేరిపోయింది మాలీవుడ్, టాలీవుడ్ బ్యూటీ నిత్యా మీనన్. జీవితంలో అసలు పెళ్లే చేసుకోనంటోంది మరో స్టార్ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ. కొన్ని ఇన్సిడెంట్స్ ఆమెను ఇలా మార్చేశాయి. ఇక వీరి బాటలోనే నడుస్తోంది హనీ రోజ్. పెళ్లి చేసుకొని హనీమూన్‌కు వెళ్లాలన్న ఆలోచనే లేనట్లు కనిపిస్తోంది అమ్మడికి. చేతిలో రాచెల్ తప్ప మరో ప్రాజెక్టు లేదు కానీ పెళ్లి అనే ఊసే లేదు. ఇక మరో మాలీవుడ్ సుందరి మాళవిక మోహనన్‌ది కూడా ఇదే దారి. అమ్మడికి 30 ప్లస్ దాటుతున్న పెళ్లి ధ్యాసే లేదు. మాలీవుడ్, బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్, ఒకప్పటి బ్యూటీ హీరోయిన్ లిజీ కుమార్తె కళ్యాణీ ప్రియదర్శన్ కూడా సోలో లైఫే బెటర్ అంటోంది. ఆ మధ్య మోహన్ లాల్ తనయుడు ప్రణయ్‌తో డేటింగ్ అంటూ వార్తలు వచ్చాయి కానీ జస్ట్ ఫ్రెండిషిష్పే అన్నది టాక్. ఇక నెక్ట్స్ ఇయర్ 30లోకి ఎంటర్ కాబోతుంది 2018 ఫేం తన్వి రామ్. 30 ప్లస్ తర్వాతే బిజీగా మారడం కెరీర్ పై కాన్సంట్రేషన్ చేయడంతో పెళ్లి, పిల్లలు అనే ఊసెత్తడం లేదు ఈ స్టార్ హీరోయిన్స్.
స్టార్ హీరోయిన్లతో మిస్ బిహేవియర్‌పై వరుణ్ ధావన్ వివరణ
బేబీ జాన్ అంటూ క్రిస్మస్ బరిలో దిగిన బాలీవుడ్ యంగ్ స్టార్ వరుణ్ ధావన్ ఎట్టకేలకు తనపై వస్తున్న విమర్శలపై స్పందించాడు. స్టార్ హీరోయిన్లతో మిస్ బిహేవియర్‌పై తనను సోషల్ మీడియాలో తిట్టిపోస్తున్న నెటిజన్లకు క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. వరుణ్ ధావన్ సినిమాలతోనే కాదు, అప్పుడప్పుడు కాంట్రవర్సీల్లో చిక్కుకుంటాడు. హీరోయిన్లతో క్లోజ్‌గా ఉంటూ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. రీసెంట్లీ కూడా బేబీ జాన్ ప్రమోషన్ల సమయంలో కూడా హీరోయిన్లు కీర్తి సురేష్, వామికా గబ్బీలతో ఓవర్‌గా బిహేవ్ చేస్తూ అవసరమా అనిపించేట్లు బిహేవ్ చేశాడు. ఇప్పుడే కాదు గతంలో కూడా స్టార్ హీరోయిన్లు అలియా భట్‌ను అసభ్యకరంగా తాకడం, కియారా అద్వానీని అందరిలో ముద్దు పెట్టుకోవడంతో విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. దీంతో అతడిపై కాస్తంత నెగిటివిటీ నెలకొంది. అయితే తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చాడు హీరో శుభంకర్ మిశ్రా పోడ్‌కాస్ట్‌లో మాట్లాడిన వరుణ్ ‘నేను నా కో యాక్టర్స్ అందరితో ఓకేలా ఉంటా. సరదాగా ఉండటం నాకో అలవాటు. నేనెవరితోనూ తప్పుగా ప్రవర్తించలేదు, నేను అందరి ముందు కియారాను కిస్ చేయలేదు. ఓ మ్యాగజైన్ ఫోటో కోసం ఇలా చేశాం. ఆ ఫోటోని నాతో పాటు కియారా కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇదంతా ఇద్దరం అనుకుని చేసింది. దాన్ని ఎలా తప్పుబడతారు అంటూ తిరిగి ప్రశ్నించాడు వరుణ్ ధావన్. ఇక ఆలియా గురించి మాట్లాడూతూ ఆమె నాకు మంచి స్నేహితురాలు. సరాదాగా అలా చేశానంతే కావాలని చేయలేదు. అది సరసం కాదు. ఇప్పటికీ మేం మంచి స్నేహితులమే అంటూ తన తప్పు ఏమీ లేదన్నట్లుగా కవర్ చేసుకునేందుకు ప్రయత్నించాడు.
నేపాల్ లో కూడా జెండా ఎగరేసిన పుష్పరాజ్
మీరు నమ్మరు మల్లు అర్జున్ కాబట్టి మళయాళంలో ఆడుద్దేమో, ఇది నా తెలుగు సినిమా, నేను తెలుగు కోసం తనకి లుంగీ కట్టించాను, అన్నీ చేయించాను, తెలుగు సినిమా ఆడుద్ది అని అనుకున్నాను. కానీ నేపాల్ కాపీ వెళ్లిపోవాలి, నేపాల్ కాపీ వెళ్లి పోవాలని అందరూ కంగారు పడుతున్నారు. అరె నేపాల్ కాపీ ఏంట్రా, ఎందుకెళ్తదిరా? అసలు యూపీ, బీహార్, అస్సాం ఏంట్రా? అంటూ తనలో తాను నవ్వుకున్నానని, వేరే భాషల్లో పుష్ప2 ఆడుతుందనే నమ్మకం తనకు లేదని, అల్లు అర్జున్‌ని తక్కువ అంచనా వేశానని, కానీ కట్ చేస్తే.. పార్ట్ 1 ఫిగర్స్ అదిరిపోయాయని ఫస్ట్ పార్ట్ సక్సెస్ మీట్‌లో చెప్పుకొచ్చాడు సుకుమార్. ఇక ఆ తర్వాత పెరిగిన అంచనాలకు మించి పుష్ప 2 చేసి రూ. 1700 కోట్లతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇక నేపాల్‌లో అయితే పుష్పరాజ్ దుమ్ముదులిపేస్తున్నాడు. పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా ఇంటర్నేషనల్ అంటూ నేపాల్‌లోను ఓ రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు పుష్పరాజ్. 20 రోజుల్లోనే నేపాల్‌లో రూ. 24.75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది పుష్ప – 2. దీంతో నేపాల్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన తొలి విదేశీ చిత్రంగా నిలిచింది. అంతేకాకుండా నేపాల్ బాక్సాఫీస్ వద్ద ఆల్‌టైమ్ రికార్డ్ వసూళ్లు సాధించిన చిత్రాల్లో టాప్-3లో చోటు దక్కించుకుంది. ఈ విషయాన్ని పుష్ప టీమ్ అధికారికంగా వెల్లడించింది. విదేశాల్లో పుష్పగాడి క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా నేపాల్ బాక్సాఫీస్ దగ్గర పుష్ప – 2 ఈ రేంజ్ హిట్ అవుతుందని సుకుమార్ ముందుగా అస్సలు ఊహించలేదనే చెప్పాలి. మరి లాంగ్ రన్‌లో పుష్ప2 ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.