Deputy Cm Pawan Kalyan Kadapa Tour: రంగంలోకి పవన్ కల్యాణ్.. రేపు కడపకు డిప్యూటీ సీఎం..
- గాలివీడు ఎంపీడీవో జవహర్‌బాబుపై దాడి..
- సీరియస్‌గా తీసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
- రేపు కడపలో పర్యటించబోతున్న డిప్యూటీ సీఎం..
- కడప రిమ్స్ లో ఎంపీడీవోను పరామర్శించనున్న పవన్ కల్యాణ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy Cm Pawan Kalyan Kadapa Tour: అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీవో జవహర్‌బాబుపై దాడి ఘటనను సీరియస్‌గా తీసుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఆయనే నేరుగా రంగంలోకి దిగనున్నారు.. అందులో భాగంగా.. రేపు కడపలో పర్యటించబోతున్నారు.. వైసీపీ నాయకుల దాడిలో గాయపడి.. కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబును పరామర్శించనున్నారు పవన్ కల్యాణ్.. ఈ రోజు గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబుపై మండల పరిషత్ కార్యాలయంలో వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి, అతని అనుచరులు తీవ్రస్థాయిలో దాడి చేసిన ఘటన కలకలం సృష్టించగా.. ఈ ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సీరియస్ అయ్యారు.. దాడికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు.. నేరుగా వెళ్లి జవహర్ బాబును పరామర్శించి ధైర్యం చెప్పాలని నిర్ణయం తీసుకున్నారు పవన్ కల్యాణ్..
Read Also: Congress: మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం కోసం స్థలాన్ని కోరిన కాంగ్రెస్..
Also Read
మరోవైపు ఈ ఘటనపై కీలక ఆదేశాలు జారీ చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబుపై దాడి ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని, మండల పరిషత్ కార్యాలయంలోకి చొరబడి దాడికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకొంటామని ప్రకటించారు. విధి నిర్వహణలో ఉన్న జవహర్ బాబుపై దాడి చేయడం అప్రజాస్వామిక చర్య అని మండిపడ్డ ఆయన.. ఇటువంటి దౌర్జన్యాలకు, రౌడీ చర్యలకు కూటమి ప్రభుత్వంలో తావు లేదని స్పష్టం చేశారు. గాలివీడు ఎంపీడీవోపై చోటు చేసుకున్న దాడి ఘటన గురించి అధికారులతో పవన్ కల్యాణ్ చర్చించారు. కారకులైన నిందితులపై కఠినంగా వ్యవహరించాలని, బాధిత ఎంపీడీవోకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు పవన్.. ఇక, ఎంపీడీవోకు, ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పాలని సూచించారు పవన్ కల్యాణ్.. ఎంపీడీవో జవహర్ బాబుపై దాడి చేసినవారికి రాజ్యాంగం పట్ల, ప్రజాస్వామ్యం పట్ల ఏ మాత్రం గౌరవం లేదని అర్థం అవుతోందని.. దాడి చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా బలమైన సంకేతం ఇవ్వాలని చెప్పారు. మండల పరిషత్ కార్యాలయంలో చోటు చేసుకున్న అప్రజాస్వామిక దాడిపై విచారణ చేయడంతోపాటు ఎంపీడీవో ఆరోగ్యం గురించి వాకబు చేసి నివేదిక ఇవ్వాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించిన విషయం విదితమే..
తాజావార్తలు
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
-
Don’t Trouble The Trouble: రాజమౌళికి బిగ్ షాక్
-
Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి ‘నో’ చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Matsya: పడవ కింద నుంచి వెళ్లిన ‘మిథికల్ ఫిష్’.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ ‘మత్స్య’!
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!