Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో భూముల మార్కెట్ ధరలు పెరుగుతున్నాయని బాగా ప్రచారం జరుగుతోంది.. మార్కెట్ రేట్ పెరిగితే ఆటోమాటిక్ గా రిజిస్ట్రేషన్ చార్జీలు కూడా పెరుగుతాయి.. దీంతో కొంతమంది ప్రజలు కూడా ఈ నెలాఖరులోగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి కొన్ని ప్రాంతాల్లో తొందర పడుతున్నారు. అయితే, భూముల మార్కెట్ ధరలు పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉండడంతో కొన్ని వర్గాల నుంచి ఒత్తిడి బాగా వచ్చినట్టు సమాచారం.. ప్రధానంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు. ఇతర ప్రజా సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. అసలే రియల్ వ్యాపారాలు సరిగ్గా లేని సమయంలో మార్కెట్ రేట్ పెరిగితే మరిన్ని ఇబ్బందులు తప్పవంటూన్నారు.
Read Also: Wedding: పెళ్లిలో బంధువులు అత్యుత్సాహం.. కోపంతో పూజారి ఏం చేశాడంటే..! వీడియో వైరల్
ప్రస్తుతం ఏపీలో రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి.. ఈ నెలాఖరు వరకు కొనసాగనున్నాయి.. భూ సమస్యలు ఎన్నో ఉన్నాయి.. ఎంతోమంది ఈ సదస్సులో వారి సమస్యలు చెబుతున్నాఉ.. దీంతో, ఈ టైంలో భూముల మార్కెట్ విలువ పెరిగితే ఇబ్బంది అని ప్రభుత్వం కూడా వెనకడుగు వేస్తోంది. అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకుని ధరలు పెంచాలని నిర్ణయానికి వచ్చింది ప్రభుత్వం. ఇక, ప్రభుత్వానికి ఆదాయం పెంచడానికి ఆర్ధిక శాఖ. రెవెన్యూశాఖ అధికారులు భూముల మార్కెట్ ధరలు పెంచాలని ఒత్తిడి తెస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 14 వేల కోట్ల రెవెన్యూ వస్తుందని సమాచారం. అయితే, సీఎం కూడా ఈ ప్రతిపాదన అమలుకు పూర్తిస్థాయిలో సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది.. మొదట అంగీకరించినా తర్వాత వస్తున్న వ్యతిరేకత దృష్టిలో పెట్టుకుని సీఎం కూడా అధికారులను నివేదిక సిద్ధం చెయ్యమన్నట్టు తెలుస్తోంది.
Read Also: Virat Kohli: ఆస్ట్రేలియా అభిమానులపై గుస్సాయించిన విరాట్ కోహ్లీ.. (వీడియో)
అయితే, ఈ నెల 30వ తేదీన సీసీఎల్‌ఏలో కీలక సమావేశం జరగనుంది. జోనల్ రెవెన్యూ సమావేశంలో కొన్ని ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటారు. భూముల మార్కెట్ ధరలపై చర్చిస్తారు. అయితే, ఇప్పటికే జాయింట్ కలెక్టర్ల నేతృత్వంలో నివేదిక సిద్ధం అయ్యింది.. ప్రభుత్వం నుంచి సరైన స్పష్టత లేకపోవడంతో భూముల మార్కెట్ ధర పెంచాలా వద్ద అనే విషయంలో గందరగోళం ఏర్పడింది. 30న జరిగే సమావేశంలో భూముల మార్కెట్ ధరల పెంపు విషయంలో అధికారులు చర్చించిన తర్వాత నివేదిక సిద్ధం చేస్తారు. నివేదిక సీఎంకు అందించిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సీఎం మళ్లీ సమగ్రంగా చర్చించిన తర్వాత భూముల ధరలు పెంచడంపై దృష్టి పెట్టనున్నారు.. ఇప్పటికే ఒక వైపు విద్యుత్తు ఛార్జీలపై ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది..