చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఎ.రంగంపేట సమీపంలోని శ్రీవిద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్ద కూడా మీడియాపై దాడి జరిగిన విషయం విదితమే.. అయితే, ఈ కేసులో మంచు మోహన్‌బాబు పీఆర్వో, బౌన్సర్లుకు ఊరట దక్కింది.. పీఆర్వో సతీష్‌తో పాటు ఏడుగురికి స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు పోలీసులు..
ఏజెన్సీ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన కొనసాగుతోంది.. నిన్న పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించిన ఆయన.. పలు అభివృద్ధికి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఆయన.. ఈ రోజు అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనకు సిద్ధమయ్యారు.. అనంతగిరి మండలం బల్లగరువు (పినకోట పంచాయతీ)లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన కొనసాగనుంది.. ఈ పర్యటనలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు పవన్.. ఉదయం 10.30 గంటలకు బల్లగరువు ప్రాంతానికి చేరుకోనున్నారు డిప్యూటీ సీఎం…
వర్షాల నేపథ్యంలో నేడు అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్.. వాయుగుండం ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తోన్న దృష్ట్యా.. విద్యార్థుల భద్రత దృష్ట్యా జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించినట్టు వెల్లడించారు జిల్లా కలెక్టర్..
2025 ఫిబ్రవరి 19వ తేదీ నుండి మార్చి 1వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.. 11 రోజులపాటు జరిగే ఈ శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై స్థానిక రెవెన్యూ, పోలీసు, అటవీశాఖ అధికారులతో ఆలయ ఈవో శ్రీనివాసరావు ప్రాథమిక సమావేశం నిర్వహించారు.. జిల్లా యంత్రాంగ సహాయ, సహకారాలతో శివరాత్రి బ్రహ్మోత్సవాలను సమర్థవంతంగా నిర్వహించేలా సిబ్బంది కృషి చేయాలని ఈవో శ్రీనివాసరావు సూచించారు.
శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. మడకశిర మండలంలో జరిగిన ప్రమాదంలో స్పాట్లోనే నలుగురు మృతిచెందినట్టుగా చెబుతున్నారు.. ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా మరో 10 మందికి తీవ్రగాయాలపాలయ్యారు.. వీరిలో మరో నలుగురి పరిస్థితి విషయంగా ఉంది.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీద ఇష్టారీతిన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. అప్పట్లో వాటన్నిటిని భరించిన టీడీపీ శ్రేణులు.... కూటమి అధికారంలోకి వచ్చాక ఓపెనైపోతున్నాయి. వర్మ మా నేతల మీది పిచ్చిపిచ్చి పోస్టుల పెట్టి మనోభావాలు దెబ్బతీశారంటూ రాష్టం నలు మూలల కేసులు పెడుతున్నారు.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం అంతకంతకు బలపడుతోంది. వచ్చే 24 గంటల్లో వాయుగుండంగా మారుతుందని ఐఎండీ ప్రకటించింది. ఏపీ తీరానికి సమాంతరంగా పయనిస్తూ మయన్మార్ వైపు వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావం కాకినాడ నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు తీవ్రంగా ఉండనుంది. తీరం వెంట గంటకు 60 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది.
కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి భరత్ కీలక వ్యాఖ్యలు.. హైకోర్టు బెంచ్ కోసం కర్నూలులో 25 నుండి 30 ఎకరాల స్థలం సేకరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారని తెలిపారు..