Ex IAS Officer Imtiaz: ఏపీలో అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతూ వస్తున్నాయి.. ఇప్పటికే సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు.. ప్రజాప్రతినిధులు ఇలా ఎంతో మంది పార్టీని వీడారు.. కూటమి పార్టీలో చేరుతున్నారు.. అయితే, తాజాగా వైసీపీ మరో షాక్ తగిలినట్టు అయ్యింది.. మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ వైసీపీకి రాజీనామా చేశారు.. అంటే, ఆయన కేవలం వైసీపీకి మాత్రమే కాదు.. మొత్తం రాజకీయాలకే గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించారు.. గత ఎన్నికల్లో కర్నూల్ జిల్లా నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఇంతియాజ్.. ఓటమి పాలయ్యారు.. అయితే, ఇప్పుడు ఇంతియాజ్ రాజీనామా లేఖ విడుదల చేశారు.. రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు.. ఇక, మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఇంతియాజ్ విడుదల చేసిన రాజీనామా లేఖను ఓసారి పరిశీలిస్తే..
Read Also: Virat Kohli: ఆస్ట్రేలియా అభిమానులపై గుస్సాయించిన విరాట్ కోహ్లీ.. (వీడియో)
“అందరికీ నమస్కారం.. కొన్ని నెలల క్రితం ప్రజాసేవే ధ్యేయంగా, ముఖ్యంగా కర్నూలు నగరంలో ఉన్న పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఐఏఎస్ సర్వీస్ నుండి వీఆర్ఎస్ తీసుకొని రాజకీయాల్లోకి రావడం జరిగింది. కర్నూలు నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం, ఎన్నికల ఫలితాలు మీ అందరికీ తెలిసిందే.. గత కొంత కాలంగా బంధుమిత్రులు మరియు శ్రేయోభిలాషులతో చర్చించ ఒక నిర్ణయానికి రావడం జరిగింది.. అదేమిటంటే.. రాజకీయ రంగం నుడి దూరంగా జరగటం.. రాజకీయాలకు దూరం అవుతున్నాను.. కానీ ప్రజసేవ రంగానికి కాదు” అని పేర్కొన్నారు..
Read Also: IND Women vs WI Women: దీప్తి శర్మ ఆల్‌రౌండర్ షో.. వెస్టిండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
ఇక, “ఇప్పుడు ఒక రిటైర్డ్ ఏఐఎస్ అధికారిగా, సామాజిక సృహ కలిగిన వ్యక్తిగా మరియు సాహితీవేత్తగా ఒక మెరుగైన సమాజం కోసం, నా వంతు కృషి చేయటానికి సిద్ధంగా ఉన్నాను.. గత ఆరు నెలల కాలంలో నాకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికి.. ముఖ్యంగా కర్నూలు నగర వాసులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.. రాబోయే రోజుల్లో సామాజిక అసమానతలను, రుగ్మతులను రూపుమాసేందుకు, పర్యావరణ కాలుష్యం తగ్గించేందుకు ఆ దిశగా పని చేసే స్వచ్ఛంద సంస్థలతో, వ్యక్తులతో పని చేయాలని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది..” అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్.. అయితే, గతంలోనూ కొందరు నేతలు వైసీపీ రాజీనామా చేసి.. కొంతకాలం సైలెంట్‌గా ఉన్నారు.. ఆ తర్వాత కూటమి పార్టీల్లో చేరారు.. మరి.. ఇంతియాజ్.. రాజకీయాలకు దూరంగానే ఉంటారా? తన మదిలో ఇంకా ఏదైనా ఆలోచనా ఉందా? అనేది వేచిచూడాలి..