Josh Hazlewood: ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. వరల్డ్ కప్కి స్టార్ బౌలర్ దూరం
- రేపటి నుంచి ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్..
- గాయంతో మెగా టోర్నీకి దూరమైన జోష్ హేజిల్‌వుడ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Josh Hazlewood: రేపటి నుంచి ప్రారంభమయ్యే టీ20 వరల్డ్ కప్ కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు బిగ్ షాక్ తగిలింది. కీలక ప్లేయర్ జోష్ హేజిల్‌వుడ్ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో ఈ మెగా టోర్నమెంట్ కు పూర్తిగా దూరమయ్యాడు. దీంతో జోష్ హేజిల్‌వుడ్ స్థానంలో ప్రస్తుతం ఎవరినీ భర్తీ చేయడం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటన చేసింది. గాయం నుంచి కోలుకుని టోర్నమెంట్ మధ్యలో జట్టులో చేరతాడు అనే ఆశలు ఉన్నప్పటికీ, తాజా మెడికల్ రిపోర్ట్స్ ఆ అవకాశాన్ని నిరాకరించాయి.
Read Also: Supreme Court: ప్రశాంత్ కిషోర్‌కు సుప్రీంకోర్టు షాక్.. పిటిషన్ తీరుపై చీవాట్లు
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
కాగా, ఈ విషయంపై సెలక్టర్ టోనీ డోడెమైడ్ మాట్లాడుతూ.. సూపర్- 8 దశ నాటికి హేజిల్‌వుడ్ పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడని మేం అనుకున్నాం.. కానీ తాజా పరిస్థితుల ప్రకారం అతడు కోలుకోవడానికి ఇంకా కొంత టైం పడుతుంది అన్నారు. అతడిని తొందరపెట్టి మైదానంలోకి దింపడం ప్రమాదకరం అని చెప్పారు. ప్రస్తుతం ఉన్న జట్టుతోనే ప్రారంభ మ్యాచ్‌లు ఆడగలం అనే నమ్మకం తమకు ఉందని పేర్కొన్నారు. అవసరం ఉంటే మాత్రమే రీప్లేస్‌మెంట్‌పై తుది నిర్ణయం తీసుకుంటామని టోనీ డోడెమైడ్ తేల్చి చెప్పారు. ఇక, ఆస్ట్రేలియా జట్టు ఫిబ్రవరి 11వ తేదీన ఐర్లాండ్‌తో తమ తొలి మ్యాచ్‌ను ఆడనుంది. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా తమ మొదటి నాలుగు మ్యాచ్‌లను శ్రీలంకలోని పల్లెకెలె, కొలంబో వేదికలలో ఆడనుంది.
అయితే, టీ20 ప్రపంచకప్ 2026 రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 7వ తేదీన అట్టహాసంగా స్టార్ట్ కానున్న ఈ మెగా టోర్నమెంట్, మార్చి 8వ తేదీన జరిగే ఫైనల్‌తో ముగియనుంది. ఈసారి ప్రపంచకప్ టైటిల్ కోసం మొత్తం 20 జట్లు బరిలో ఉండగా, 55 మ్యాచ్‌లు జరగనున్నాయి.
తాజావార్తలు
-
Radha: 46 కోట్లు కొట్టేశారు.. సొంత అక్కపై పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ రాధ!
-
Iran-Trump: ఇరాన్ ‘100’ కోడ్ జారీ.. క్యాంప్ నుంచి ఒక్కరోజు ముందే వచ్చేసిన ట్రంప్.. పశ్చిమాసియా మళ్లీ అట్టుడకనుందా?
-
The Paradise Censor Cuts: నాని ‘ది ప్యారడైజ్’ పై సెన్సార్ కత్తెర.. ఏకంగా 21 కట్స్!
-
AP Heavy Rain Alert: భారీ నుంచి అతిభారీ వర్షాలు.. అధికారులకు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు
-
Bihar: బీహార్‌లో దారుణం.. నడిరోడ్డుపై బాలికపై లైంగిక వేధింపులు.. ముగ్గురు అరెస్ట్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!