బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని.. ముఖ్యంగా కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది విశాఖ వాతావరణ కేంద్రం.. నైరుతి బంగాళాఖాతం దాన్ని అనుకోని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని.. రానున్న 24 గంటల్లో వాయువ్య దిశగా పయనిస్తోందని.. దీని ప్రభావంతో నెల్లూరు నుంచి విజయనగరం జిల్లా వరకు కోస్తా అంతటా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు, నష్టాలు ఉంటాయి.. కేసులుకూడా పెడతారు, జైళ్లలో కూడా పెడతారన్న జగన్.. ప్రతి కష్టానికి ఫలితం ఉంటుంది, చీకటి తర్వాత వెలుగు కూడా వస్తుంది.. ఏ కష్టం ఎవరికి ఎప్పుడు వచ్చినా.. నావైపు చూడండి.. 16 నెలలు నన్ను జైళ్లో పెట్టారు.. నా భార్య కనీసంగా 20 సార్లు బెయిల్ పిటిషన్ పెట్టి ఉంటుంది.. కింద కాంగ్రెస్, పైన కాంగ్రెస్.. ఇన్ని కష్టాలు పెట్టినా.. నేను ముఖ్యమంత్రిని కాలేదా? ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని…
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజవర్గంలో 500 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిన నిర్మించాలంటూ మంత్రి నిమ్మల రామానాయుడుకి, ఎంపీ శ్రీనివాస్ వర్మకు మాజీ మంత్రి, కాపు బలిజ సంక్షేమ సేన అధ్యక్షులు హరి రామ జోగయ్య బహిరంగ లేఖ రాశారు.
గుడివాడ అమర్నాథ్... ఏపీ మాజీమంత్రి. వైసీపీలో ఫైర్ బ్రాండ్ కమ్ జగన్ వీర విధేయత ముద్ర ఉన్న నాయకుడు. అప్పుడు మంత్రి పదవికైనా, ఇప్పుడు విశాఖ జిల్లా పార్టీ అధ్యక్ష పదవికైనా... ఈ ఫార్ములానే వర్కౌట్ అయిందన్నది ఒక అభిప్రాయం. అదంతా డిఫరెంట్ స్టోరీ. కానీ... పార్టీ అధిష్టానం దగ్గర ఎంత పలుకుబడి ఉన్నా... ఏ పదవులు నిర్వహించినా... ఈ మాజీ మంత్రికి ఓ కేరాఫ్ అడ్రస్ లేకుండా పోయిందన్న అసంతృప్తి మాత్రం ఉందట ఆయనకు. గత…
రాజమండ్రి నగరంలోని దానవాయిపేటలో ఒక బడా బిర్యాని రెస్టారెంట్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రస్తుత ఎమ్మెల్యే తో పాటు పలువురు మాజీ ప్రజాప్రతినిధులను సైతం వ్యాపారులు ఆహ్వానించారు. అయితే.. ఎమ్మెల్యే వచ్చిన సమయంలో నలుగురైదుగురు పోలీసులు రావడం, మళ్ళీ వారి కూడా వెళ్లిపోవడం సహజం. కానీ.. ఈ బిర్యానీ షాపు ప్రారంభం సందర్భంగా ఈ రోజు రూ.5 కే బిర్యాని అందిస్తున్నట్లు ఆఫర్ ప్రకటించారు. దీంతో భారీగా జనం బిర్యాని కోసం ఎగబడ్డారు. ఇంతవరకు బానే ఉన్నా..…
ఉమ్మడి విజయనగరం జిల్లాలో కొందరు టీడీపీ నాయకుల పరిస్థితి న ఘర్ కా... న ఘాట్ కా అన్నట్టు తయారైందట. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలాగైనా పవర్లోకి తీసుకు రావాలంటూ... పార్టీ తరపున పోటీ చేయాలనుకుంటూ... ఉన్న ఊళ్ళను, చేస్తున్న ఉద్యోగాలను వదిలేసి వచ్చారట కొందరు. పార్టీ పవర్లోకి వచ్చి ఆరునెలలైనా... ఎలాంటి అవకాశాలు దక్కక అడకత్తెరలో ఉన్నట్టు ఫీలవుతున్నారట. జిల్లాకు చెందిన ఇద్దరు ఎన్నారైలు.... విదేశాల్లో ఉద్యోగాలను వదులుకొని ఇక్కడికి రాగా.... ఓ జిల్లా స్థాయి…
మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లకు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది.. ఏపీ, తెలంగాణకు చెందిన 1,200 మంది మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లకు శుభవార్త చెప్పింది సుప్రీంకోర్టు.. మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ల నియామక జీవోను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు వెలువరించగా.. వాటిపై స్టేటస్ కో విధించింది సుప్రీంకోర్టు..